నల్గొండ జిల్లా :నకిరేకల్::అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి
![]()
నకిరేకల్ పురపాలిక ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను కోరారు. రహదారి విస్తరణ పనులను సోమవారం సాయంత్రం పరిశీలించారు ఈ పనులకు స్థానిక దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాలని అభివృద్ధిలో నకిరేకల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగుల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టినందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా సహకరించాలన్నారు. విస్తరణలో భాగంగా రహదారిపైకి వచ్చిన దుకాణాలు, ఇళ్ల శ్లాబుల ముందు భాగాలను తొలగించేందుకు పుర సిబ్బందికి విస్తరణ పనుల కాంట్రాక్టర్ సిబ్బందికి వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి కోరారు.












Apr 17 2023, 23:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.9k