సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 30 న మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయనున్నారు.

శాంతి భద్రతల కారణంగా మద్యం షాపులను పండుగ సందర్భంగా మూసివేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్ణాటక::ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

బళ్ళారి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దనరెడ్డి కర్నాటక లో తానే సొంత పార్టీ పెట్టడం ఇప్పటికే 50 నియేజకవర్గలలో గాలి జనార్దనరెడ్డి దంపతులు సుడిగాలి గా రోడ్డు షో చేస్తున్నారు.

ఇప్పుడు గాలి జనార్దనరెడ్డి పార్టీ కి ఎన్నికల కమిషన్ ""పుట్ బాల్" గుర్తు కేటయించటం తో ఆయన పుట్ బాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నన్ను అన్ని పార్టీలు పుట్ బాల్ అడుకొన్నరు ఇంకా ఆట నాదే.

వేట నాదే.. ఇప్పుడు ఆటా నేను మొదలు పెట్టాతా.. గోల్ వేయడం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని ఈ జట్టు కెప్టెన్ నేనే ఆటగాడు నేనే అని బళ్ళారి బంగారు బాబు తెలిపారు.

51 నియేజవర్గలలో తమ పార్టీ పోటీ చేస్తారు అని 30 స్థానాల లో గెలుపు ఖాయం అని గాలి జనార్దనరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

ఏపీ : గుంటూరు...గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం . కాన్పుల వార్డు లో డబ్బులు వసూలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది...

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు...గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం ..

కాన్పుల వార్డు లో డబ్బులు వసూలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది...

మగ పిల్ల వాడికి 1500 ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు వసూలు చేస్తున్న సిబ్బంది తమకు తెలిసిందని ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడి

ఎమ్మెల్యే ముస్తఫా ,హాస్పిటల్ అధికారుల తనిఖీ ల లో వెలుగు చూసిన దారుణం...

కాన్పు ల వార్డు లో సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరిండెంట్ కు ఆదేశాలు...

తమ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ముస్తఫా ఎదుట నర్సింగ్ సిబ్బంది ఆవేదన....

తాము డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపణ చేయాలని ఛాలెంజ్ చెస్తున్నామన్న ఆసుపత్రి సిబ్బంది

గద్వాల్ -కర్నూల్ సిటీ మధ్య విద్యుదీకరణ పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే*

గద్వాల్ -కర్నూల్ సిటీ మధ్య విద్యుదీకరణ పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుండి ధర్మవరం అలాగే సౌత్ వెస్టర్న్ రైల్వే ( నైరుతి రైల్వే ) పరిధిలోని ధర్మవరం - బెంగళూరు వరకు పూర్తిగా విద్యుదీకరించిన రైలు మార్గ సౌకర్యాన్ని అందిస్తుంది, తద్వారా ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి అంకంలో విద్యుదీకరణ కు అధిక ప్రాధాన్యమిస్తు , పనులను వేగవంతం చేసింది, తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని విభాగాలను విద్యుదీకరించబడిన మార్గాలకు జోడించింది. ఈ క్రమంలో , దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ దూరం వరకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. తద్వారా జోన్ పరిధిలో సికింద్రాబాద్ - ధర్మవరం మధ్య పూర్తిస్థాయిలో విద్యుదీకరించబడిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపే వీలు కల్గింది .

గద్వాల్ - కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ , డోన్ - కర్నూలు సిటీ - మహబూబ్‌నగర్‌ ; సికింద్రాబాద్ - ముద్ఖేడ్ - మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేయబడింది . ఈ ప్రాజెక్ట్ 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో పనులు చేపట్టడం జరిగింది .సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య విభాగాన్ని వేరే ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేయబడి ఇప్పటికే విద్యుదీకరించారు. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్-గద్వాల్ & కర్నూలు సిటీ -డోన్ ల విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని డోన్ - గుత్తి - ధర్మవరం మరియు నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం - బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. అందువల్ల, ప్యాసింజర్ మరియు సరకు రవాణా రైళ్లు రెండూ, ఇప్పుడు హైదరాబాద్ - ధర్మవరం మరియు అటుపైన బెంగుళూరు వరకు సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది , తద్వారా , రైలు ప్రారంభ స్థానం నుండి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో నడిపేందుకు వీలుపడుతుంది .

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది . ఇంజిన్ మార్పిడి ని నివారించడం ద్వారా రైళ్ల నిర్వహణలో రైలు ప్రయాణీకులకు ఎలాంటి అంతరాయం లేని రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుంది. ప్రయాణికుల మరియు సరకు రవాణా చేసే రైళ్ల మార్గ మధ్య నిలుపుదలను తగ్గిస్తుంది మరియు రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. విభాగాల మధ్య సామర్థ్యం పెంపుదల కారణంగా ఈ విభాగంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున ఆదా చేయబడతాయి మరియు కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ..విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అంకితభావంతో పనిచేసినందుకు ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు. గద్వాల్-కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ మార్గాలను 100% విద్యుదీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీ. ఎం. మందపాటి శేషగిరిరావు అన్నారు.విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో రాష్ట్రంలోని గ్రంథాలయ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుస్తకాల కొనుగోలు, డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటు బడ్జెట్ ప్రతిపాధనలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛైర్మన్ శేషగిరి రావు మాట్లాడుతూ ప్రతి పేద వానికి విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించాలని లక్ష్యంతో విద్యా శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. అన్ని గ్రామల్లో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి ఆలోచనలకు అనుగుణంగా రూ.450 కోట్లతో 10,960 డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కడపలో మొదటి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామన్నారు, పల్లె పల్లెకు విజ్ఞాన వీచికలు అందాలనే లక్ష్యంతో గ్రంథాలయాలను బలోపేతం చేస్తున్నమన్నారు.

రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఏప్రిల్ 5 నుండి విజనరీజగన్ పేరుతో సెమీనార్‌లు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్రంలో గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలు చేయుటకు రూ.15.75 కోట్లు కేటాయించామన్నారు, ఇప్పటి వరకు రూ.10 కోట్లతో పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయాలకు అందించామన్నారు. గత పది సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాంలోని గ్రంథాలయాలను నిర్వీర్యం చేసాయన్నారు.

సామాజిక, విజ్ఞాన విషయాలకు సంబంధించి కొత్తగా ప్రచురింపబడిన (2021,2022,2023 సం//ల) పుస్తకాల నమూనా ప్రతులను రచయితలు, ప్రచురణ కర్తలనుండి కోరుచున్నామన్నారు. ఈ నెల 27 నుండి ఏప్రిల్ 26 వరకు రచయితలు, ప్రచురణకర్తల నుండి పుస్తకాలు నమూన ప్రతుల రిజిస్ట్రేషన్ కొరకు పుస్తకాల శాఖా గ్రంథాలయ భవనం, మొదటి అంతస్తు, శివాలయం ప్రక్కన, మెట్ల బజార్, పౌర గ్రంథాలయ సంచాలకుల వారి కార్యాలయం, మంగళగిరి నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో (పని దినాలు) ఉ.11. గంటల నుండి సా. 4. గంటల వరకు నమూన ప్రతులు, పోస్ట్ ద్వార గాని, స్వయంగా గాని అందజేయవచ్చునన్నారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టంలోని నిబంధనల (సెక్షన్-9) 1867 ప్రకారం ముద్రించిన పుస్తకాలు మూడు ప్రతులను అందజేయవలసి ఉందన్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్ధూ, సంస్కృతం, కన్నడ తమిళం మరియు ఒరియా సంబంధించి ప్రచురించబడిన పుస్తుకాలు ఈ ఎంపికకు అవసరమైవున్నవని. ఛైర్మన్ శ్రీ. ఎం. మందపాటి శేషగిరిరావు అన్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు జి. మహేష్, శ్రీమతి రెడ్డి పద్మావతి, వై. నరసింహరావు, అమిరుద్దీన్, పౌర గ్రంథాలయ సంస్ధ, ఉప సంచాలకులు సి. శ్రీనివాస రెడ్డి, 13 ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు

రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ వారిచే జారీ చేయబడినది.

ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే.

ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే.


స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు స్థలం దొరికడం లేదని నాన్చే అధికారులకు ఓ యువకుడు బెస్ట్ ఐడియా చెప్పాడు. రోడ్డుపై ఉండే ఫ్లై ఓవర్ల కింది భాగాన ఖాళీగా ఉండే స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఫ్లైఓవర్ కింద నిర్మించిన పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ధనన్యాజ్_టెక్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోలో ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ ప్రాంతాన్ని చూపిస్తూ.. ఫ్లైఓవర్ కింద మిగిలిన సగం ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ని చూపించాడు. దాంతో పాటు ఇది చాలా బ్రిలియంట్ ఐడియా అని, అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ క్యాప్షన్ లో తెలిపాడు. ఇలాంటిదే మీ సిటీలో ఉందా..? అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ ఐడియాను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాతో సహా పలువురు స్మార్ట్ ప్లానింగ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సంపద ఫ్లై ఓవర్ కింద 2021లో నిర్మించినట్టు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో, బంతులు, ఇతర వస్తువులు రోడ్డుపై పడకుండా నెట్‌తో ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు1.3 మిలియన్ వ్యూస్ రాగా… 12,000 పైగా లైక్‌లు వచ్చాయి. ఈ అమేజింగ్ ఐడియాను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. గొప్ప మేక్ఓవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ తరహా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఢిల్లీలోనూ ఏర్పాటు చేయాలని మరికొందరు కోరుతున్నారు. నవీ ముంబై నుండి వెలువడిన స్థానిక దినపత్రిక న్యూస్‌బ్యాండ్ ప్రకారం, ఈ పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2745.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది డిసెంబర్ 2022లో క్రీడాకారులకు ఉచితంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు.

సిద్దిపేటలో తుపాకులు క్లీన్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్

తుపాకులు క్లీన్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్

సిద్దిపేటలో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకులు క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ రాజశేఖర్ కుడి కన్నుకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజశేఖర్ 2013 బ్యాచ్ కి చెందిన వాడు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుప్రీంకోర్ట్ - ఢిల్లీ:అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.

- సుప్రీంకోర్ట్ - ఢిల్లీ

- అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

- అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

- హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

- రెండు పిటీషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం

- అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం

- జగన్ మూడు రాజధానుల గురించి తమకు తెలియదన్న కేంద్రం

త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని స్పష్టం చేసిన జగన్

అమరావతి కేసు విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ..

- 11 జులై 2023 కి వాయిదా వేసిన ధర్మాసనం

ఏపీ ::అమరావతి- సచివాలయం. *మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలుః మంత్రి మేరుగు నాగార్జున*

అమరావతి- సచివాలయం.

మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలుః మంత్రి మేరుగు నాగార్జున

– అందుకే దళితులపై దమనకాండ అంటూ ఈనాడు అడ్డగోలు రాతలు..

– మార్గదర్శి కేసులో ప్రధాన ముద్దాయి రామోజీరావు

– ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే రాతలు

– ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే రామోజీకి పరాభవం తప్పదు

– బాబు, రామోజీ ముసుగు దొంగలు

-ః మంత్రి మేరుగు నాగార్జున ఫైర్

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున ప్రెస్‌మీట్ః

– దళితులపై దమనకాండ జరిగింది బాబు హయాంలోనే..

– దళితులను అడ్డుపెట్టుకుని మా ప్రభుత్వంపై బురదచల్లుతావా?

– టీడీపీ హయాంలో కారంచేడు, దళితుల ఊచకోత ఘటనలపై రామోజీ ఎందుకు కథనాలు రాయలేదు..?

– గరగపర్రులో దళితుల వెలివేత, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలు రామోజీ కళ్ళకు కనిపించలేదా ..?

– అచ్చెన్న మహిళను కాలితో తంతే.. మీకు ముచ్చటగా అనిపించిందా..?

-ఃసూటిగా ప్రశ్నించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ మేరుగు నాగార్జున

– జగన్‌గారి పాలనలో దళితులకు జరుగుతున్న మేలు రామోజీకి అట్రాసిటీగా కనిపిస్తుందా..?

– ఫిల్మ్ సిటీలో దళితుల భూములను కొట్టేసింది రామోజీనే 

-ః మంత్రి శ్రీ మేరుగు నాగార్జున 

మంత్రి శ్రీ మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ .. ఇంకా ఏమన్నారంటే..ః

రామోజీ.. ఇవేనా జర్నలిజం విలువలు..?

రామోజీరావు, ఈనాడు పేపర్‌ పెట్టుకున్న తర్వాత ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా..? ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నట్లు కథనాలు రాయడానికి ఆయనకు సిగ్గుందా..? అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనలపై కథనాలను ఎందుకు రాయలేదు రామోజీ..? ఇదేనా మీ జర్నలిజం విలువలు..? 

- కారంచేడులో దళితులపై దాడులు జరిగినప్పుడు.. అప్పుడు జరిగిన అగ్రవర్ణాల అహంకారం గురించి ఈనాడు ఎందుకు రాయలేదు..? ఆరోజు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన వారి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా.. రామోజీరావు సొంత సామాజికవర్గానికి చెందిన వారు దళితులపై మారణకాండ జరుపుతున్నప్పుడు .. ఇది తప్పు అని ఎందుకు రాయలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. 

బాబు, రామోజీ ముసుగుదొంగలుః

  ఎందుకంటే.. తన రాతలతో చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఈనాడు ముసుగులో నువ్వు వ్యాపారాలు చేయాలి. మార్గదర్శి ఎవరిది..? అందులో వ్యాపార భాగస్వాములు ఎవరు..? ఎవరి డబ్బులతో రామోజీరావు వ్యాపారం చేస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో.. ప్రస్తుతం సీఐడీ ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. రేపు మార్గదర్శి కేసులో ఈనాడు రామోజీరావు ప్రధాన ముద్దాయి అవుతున్నాడని .. ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అందుకే, ఇప్పుడు దళితులపై దాడులంటూ.. తప్పుడు కథనాలు రాస్తున్నాడనేది పచ్చి నిజం. 

- మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల డొంక కదిలేకొద్దీ.. రామోజీకి బుర్ర పనిచేయడం లేదు. 

- మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో.. జనం సొమ్మును తన వేరే వ్యాపారాలకు విస్తరించి, చిట్స్ వేసిన ఖాతాదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది రామోజీనే.

- రామోజీ చిట్స్- చీటింగ్ బాగోతాన్ని సీబీసీఐడీ అధికారులు తవ్వి తీస్తుంటే.. ఆయనకు, ఆయనకు వకాల్తా పలుకుతున్న చంద్రబాబు, దుష్ట చతుష్టయానికి కడుపు రగిలిపోతుంది.

ఫిల్మ్ సిటీలో దళితుల భూములు కొట్టేసిన రామోజీరావు

రామోజీఫిల్మ్‌సిటీ నిర్మాణానికి సంబంధించి దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీరావుపై పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఈరోజు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు, ఈ రాష్ట్రంలో ఎవరో దళిత డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్లు తప్పుడు రాతలతో నీచమైన మనస్తత్వాన్ని రామోజీరావు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి దౌర్భాగ్యపు రాతలతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ లకు రాజకీయంగా పట్టం కట్టాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలించేదే లేదు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక దొంగ అయితే.. ఆయన్ను భుజానెత్తుకుని విషపురాతలు రాసే రామోజీరావేమో గజదొంగ అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే రాతలు మానుకోకపోతే ఈనాడు రామోజీరావుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. 

చంద్రబాబు హయాంలో దళితులపై అరాచకాలు

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు అలో లక్ష్మణా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరిగి కేసులు పెట్టమని రోధిస్తే ఏ ఒక్కడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అచ్చెన్నాయుడు మహిళను కాలుతో తంతే ఎందుకు కేసు పెట్టలేదు..? గరగపర్రులో దళితులు వెలివేత కేసు ఏంచేశారు..? పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన కేసుకు సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్‌ ముందు ధర్నాకు దిగితే.. ఆ కేసుల్ని ఏం చేశారు..? వాటిని ఎందుకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు..? ఈ ఘటనలపై ఈనాడులో వరుస కథనాలు ఎందుకు రాయలేదో.. రామోజీరావు సమాధానం చెప్పాలి..? ఇవన్నీ ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా..? 

దళితుల మేలుపై చర్చకొస్తారా..?  

రాష్ట్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగబద్ధంగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి ఆలోచనా విధానంతో సుభిక్షమైన పరిపాలన అందజేస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంక్షేమపథకాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దళితుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గురించి మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని మా జగన్‌మోహన్‌రెడ్డి గారిని ప్రతీ పేదోడి ఇంట్లో దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబుకు, రామోజీరావుకు కన్నుకుట్టే విషయమైంది. దళితుల రక్షణకు, వారి మేలుకు మేం బాధ్యతగా పనిచేస్తున్నామని దమ్ముగా చెబుతున్నాను. అడ్డగోలు రాతలకు, నీచమైన రాతలకు ఈనాడు వేదికగా ఉంది. దళితులకు ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో... మీరు చర్చకు రాగలరా..?

అట్రాసిటీ అంటే అర్ధమేంటి..?

  ఈనాడు మాత్రం ‘దళితులపై దమనకాండ’ అంటూ విషప్రచారానికి పూనుకుంటుంది. అసలు అట్రాసిటీ అంటే రామోజీరావు దృష్టిలో ఏంటి..? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషుమీడియం తీసుకొచ్చి పేదపిల్లలకు చదువు చెప్పడాన్ని అట్రాసిటీ అంటారా..? రాజధాని ప్రాంతంలో భూముల్ని పేదలకు ఇస్తామంటే.. ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని టీడీపీ అడ్డుకోవడాన్ని అట్రాసిటీ అంటారా..? కొన్ని లక్షల కోట్లు డీబీటీ రూపంలో దళితులకు సంక్షేమపథకాల కింద నేరుగా మా ప్రభుత్వం అందజేస్తుంటే అది అట్రాసిటీనా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 68శాతం రాజకీయ పదవులిచ్చి అత్యున్నత స్థానాల్లో నిలబెట్టడాన్నిరామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తున్నాయా.?. పేదోడికి గూడును కల్పిద్దామని.. వారికి ఉచితంగా ఇంటి స్థలమిచ్చి రుణసాయంతో ఇల్లు నిర్మించడమే కాకుండా వారికి ఉపాధిచూపాలని తపనపడే ప్రభుత్వం మీకు అట్రాసిటీకి పాల్పడుతున్నట్లు కనిపిస్తుందా..? పేదవాళ్లకు సాయం చేయడం అనేది నీకు, నువ్వు అండగా ఉండే నీ నాయకుడు చంద్రబాబుకు చేతగాదు. పేదవాళ్లను అక్కునజేర్చుకుని భావితరాల భవిష్యత్తుకోసం మా ప్రభుత్వం గొప్ప పరిపాలన అందిస్తుంటే.. అది రామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తుందా..?

దళితులు ఎప్పటికీ కూలోళ్ళుగానే బతకాలా రామోజీ..?  

ఎస్సీ, ఎస్టీలు పనివాళ్లుగా ఉంటే చంద్రబాబు, రామోజీరావు సామాజికవర్గమే పరిపాలన చేస్తూ దళితుల మీద పెత్తనం చే స్తారా..? దళితుల మేలు జరగడం అంటే.. ఈనాడు రామోజీరావు దృష్టిలో మేమంతా కూలోళ్లుగానే బతకడమా..? ఇలాంటి తప్పుడు రాతలు రాసేటప్పుడు .. బాధ్యత లేకుండా రాతలు రాసేటప్పుడు సిగ్గూశరం గుర్తుకురావా..? ఈనాడు పత్రికకు విలువలు, విశ్వసనీయత ఉండవా.? అని నిలదీస్తున్నాను. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విలువల్ని పుణికిపుచ్చుకున్న మా నేత, గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆనందంగా.. గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా బతుకుతున్నారు. ఇదే విషయాన్ని మేం గర్వంగా దమ్ముగా చెప్పుకుంటున్నాం. 

దళితులకు ‘బాబు’చేసిన మోసం గురించి ఎందుకు రాయవు..?

చంద్రబాబు హయాంలో 5 ఏళ్ళలో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే.. ఆ డబ్బు దళితులకు దేనికోసం ఖర్చుచేశారో.. అందులో అవినీతి ఎంత జరిగిందో.. ఎంతమంది చేతులు మార్చుకున్నారో.. ఈ కుంభకోణాలపై కథనాలు రాసే దమ్ము రామోజీరావుకు ఉందా..? అని అడుగుతున్నాను. అదే మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ఫిబ్రవరి మాసాంతానికి దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చుచేశాం. డీబీటీ ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయితే.. వీటిమీద రాతలు రాయడానికి చేతులు కదలడం లేదా రామోజీరావు..? అని అడుగుతున్నాను. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

తప్పుచేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు తప్పు చేశారు కనుకనే ఈరోజు భయపడుతున్నారేమో.. ఆమె చంద్రబాబు వలలో చిక్కుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జెండాపై గెలిచి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీల్లోకి వెళ్లిన వారి భవిష్యత్తు ఇప్పుడెలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు శ్రీదేవి మాట్లాడుతున్న మాటలన్నీ చంద్రబాబు స్క్రిప్టుగానే చూడాలి. అనామకులను కూడా రాజకీయాల్లో ఉన్నత పదవులు కల్పించి నాయకుల్ని చేసిన ఘనమైన చరిత్ర డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి ఉంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మనసున్న మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించి అక్కునజేర్చుకుంటే చంద్రబాబుకు కన్నుకుడుతుంది. అందుకే ఎమ్మెల్యే శ్రీదేవి లాంటి వారిని రాజకీయంగా ప్రలోభపెట్టి, తన పంచన చేర్చుకుంటున్నాడు. ఆమె మా పార్టీకి ద్రోహం చేసినందుకు మేమంతా బాధపడుతున్నాం. 

ఏపీ :మెగా వైద్య శిబిరాన్ని,మినీ వాటర్ ట్యాంకులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

మెగా వైద్య శిబిరాన్ని,మినీ వాటర్ ట్యాంకులను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో రాగోలు జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో లావేరు మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజినాయుడు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెజ్జిపురం గ్రామపంచాయతీ నిధులతో నాలుగు మినీ వాటర్ ట్యాంక్ లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ,జే.సి.యస్ మండల ఇంచార్జి మీసాల శ్రీనువాసరావు,వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనువాసరావు,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు గొర్లె అప్పలనాయుడు,సర్పంచ్లు సంఘం అధ్యక్షులు చాంద్ బాషా,మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు,నాయకులు బొంతు సూర్యనారాయణ,బెజ్జిపురం పంచాయతీ నాయకులు దన్నాన అప్పలనాయుడు,ఇజ్జాడవెంకటరమణ,పిన్నింటి పూర్ణచంద్రరావు,ఇజ్జాడసూర్యనారాయణ,చివికి ఆశిరప్పడు,కడుపూరి అప్పారావు,దన్నాన రామ్మూర్తి,ఇజ్జాడ సన్యాసప్పుడు,కలిశెట్టి పైడితల్లి,బెజ్జిపురం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,లావేరు మండలం సర్పంచులు,ఎంపీటీసీలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,జెమ్స్ హాస్పిటల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.