ఏపీ ::మహిళల పక్షపాతి వైఎస్ జగన్. నరసరావుపేట శాసనసభ్యులు డా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
మహిళల పక్షపాతి వైఎస్ జగన్ -నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి .
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన..
ఘనంగా ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గంలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు 11,351 మంది సభ్యులకు 8,97,96,156/- చెక్కు నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేసారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ది.11-04-2019 నాటికి స్వయం సహాయక సంఘాలకు రుణ మొత్తాన్ని 4 విడతల్లో రుణమాఫీ చేయుటకు నిర్ణయించింది, దీనిలో భాగంగా ఇప్పటి వరకు 3 విడతలలో స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ నిధులు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేయడం జరిగినది..
పట్టణ పేదరికం నిర్మూలన సంస్థ (మెప్మా) నరసరావుపేట పురపాలక సంగం నందు 1190 స్వయం సహాయక సంఘాలు వైయస్సా ఆసరా పథకాన్ని పొందటకు అర్హత కలిగి ఉన్నాయి. 1190 స్వయం సహాయక సంఘాల్లో ని 11,351 మంది సభ్యులకు 8,97,96,156/- కోట్లు చెక్కు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది, ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 1190 స్వయం సహాయక సంఘాలకు 26.86 కోట్లు స్వయం సహాయక సంఘాలకు జమ చెయ్యటమైనది..
నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్ కు భారీగా తరలి వచ్చిన మహిళలు - కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,
ఈ సంధర్బంగా. నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ:
రాష్ట్రంలో మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చేపట్టడం హర్షణియ్యమని అన్నారు..
ఈ మూడు సంవత్సరాల కాలంలో సుమారు 20 వేల కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ ఆసరా కొసం కేటాయించడం చరిత్రలో లిఖించదగిన అంశంగా పేర్కొన్నారు..
గతలో తెలుగుదేశం ప్రభుత్వాలు మహిళలను మోసం చేస్తే, ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులలో సైతం మాట నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కొనియాడారు..
ఇది సామాన్యమైన విషయం కాదని, నాయకుడి యెక్క విలువలకు, విశ్వసనియతకు ఇది నిదర్శమన్నారు...
కుటుంబం నడపగల ఆలోచన శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుందని గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి , కుల, మత, వర్గ పార్టీ, ప్రాంతాలకు అతీతంగా ప్రతి మహిళకు చేయూతనందించారని అన్నారు..
ఎవరికి ఒక్క పైసా లంచం లేకుండా ఇటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం అని అన్నారు..
ప్రతి మహిళకు సొంత అన్నలా ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళల శ్రేయస్సు కోసం శ్రమించారో..
ఆయన తనయుడిగా నేడు వైయస్ జగన్ ఆ ఆశయాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు..
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆశించిన పేదరిక నిర్మూలన కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి,అహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు..
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పిడి మెప్మా , మున్సిపల్ కమిషనర్, PUDA చైర్మన్ మిట్టపల్లి రమేష్ , జిల్లా మరియు మండల ఉన్నతాధిరులు, డ్వాక్రా మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, అన్ని శాఖల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు మండలంలోని రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.._
Mar 28 2023, 16:42