ఏపీ ::ఎన్టీఆర్ జిల్లా /జుజ్జూరు లో వైయస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
ఎన్టీఆర్ జిల్లా / జుజ్జూరు :
జుజ్జూరు లో వైయస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .
ఆసరాతో అక్క చెల్లెమ్మలకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
వీరులపాడు మండల పరిధిలో 1055 పొదుపు సంఘాలకు 10550 మంది అక్కచెల్లెమ్మలకు రూ.8 కోట్ల 74 లక్షల రుణమాఫీ ..
డ్వాక్రా మహిళలను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ది ..
టిడిపి నేతలు నిజమైన సైకోలుగా వ్యవహరిస్తున్నారు ..
జుజ్జూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వీరులపాడు మండల పరిధి వైయస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చెక్కును పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఆశయమని, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి, 45 సంవత్సరాల వయసు వారికి రూ.18,750, సున్నా వడ్డీ పథకం డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన ఘనత ఒక్క జగన్ కే దక్కిందని చెప్పారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆలోచనతో టిడిపి వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ఎమ్మెల్సీ గెలవడం గొప్ప అని ఎద్దేవా చేశారు, తామొస్తే పథకాలు రద్దు చేస్తామని చెబుతున్న చంద్రబాబు పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ము ఉందా అని అనడంతో .. లేదు.. లేదంటూ మహిళలు బదులిచ్చారు .. ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు గతంలో రెండు విడతలుగా రుణమాఫీ నగదు అందించామని, మూడో విడత సైతం పంపిణీ చేసినట్లు తెలిపారు, మహిళల జీవన ప్రమాణాలు మార్చాలనదే సీఎం జగన్ లక్ష్యంమని, కులమతాలు, పార్టీలకతీతంగా డ్వాక్రా మహిళలందరికీ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు, గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు డ్వాక్రా మహిళల బకాయిలు రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు, టిడిపి నేతలు నిజమైన సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు .. అనంతరం మహిళలంతా థాంక్యూ సీఎం సార్ అంటూ నినదించడంతో సభా ప్రాంగణం మార్మోగింది ..
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, వైస్ ఎంపిపి ఆదాం, నాగుల్ మీరా, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోటేరు మల్లీశ్వరి సూర్యనారాయణ, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొమ్మిశెట్టి భాస్కరరావు, స్థానిక గ్రామ సర్పంచ్ కోటి మరియు పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
Mar 28 2023, 16:08