madagoni surendar

Mar 28 2023, 14:28

ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు :హీరో నాని

ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు : నాని

 

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 30న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈసందర్భంగా నాని మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు. ‘దసరా’తో మీ మనసుకు హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్‌‌‌‌‌‌‌‌తో విజిల్స్ వేసే ఆనందం దసరాతో ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేస్తారు. దసరా నా మనసుకు దగ్గరైనా సినిమా. ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌‌‌‌ని రూపొందించిన నిర్మాత సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్‌‌‌‌కి థ్యాంక్స్’ అని చెప్పాడు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నాని, నేను కలిసి ‘నేను లోకల్’ సినిమా చేశాం. కానీ నాకు ‘దసరా’నే లోకల్ అనిపిస్తుంది. నాని నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కో యాక్టర్. ఈ సినిమాతో అందరికీ వెన్నెలగా గుర్తుంటాను’ అని చెప్పింది. నటుడు దీక్షిత్ శెట్టి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 13:52

హైదరాబాద్ : మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

హైదరాబాద్ : మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు రోజురోజుకూ సృతి మించుతున్నాయి. తాజాగా తెలంగాణలోని అబిడ్స్‌లో ఓ యువతి వీరి మాయలోపడి రూ.5 లక్షలు పోగొట్టుకుంది. బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతి మొబైల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే రోజూకు అరగంట పని చేసుకుని రూ.700ల నుంచి 900ల వరకు సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. అందుకు ముందుగా రూ.2,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్‌ ఖాతాలో రూ.28 వేల ఆదాయం చూపారు. ఆ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలనే షరతు పెట్టారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్‌ పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకొని చెప్పాపెట్టకుండా ఖాతా రద్దు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను సంప్రదించింది.

ఇలా ఫోన్లకు తొలుత పార్ట్‌టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అంటూ మెసేజ్‌లను పంపించి ఆశల వల విసురుతున్నారు. గతంలో దీపాల వత్తులు, కరక్కాయ పొడి, బుక్స్‌ పీడీఎఫ్‌గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. వీరి వలలో గృహిణులు, యువతులు అధికంగా చిక్కుకుంటున్నారు. నగరంలో సైబర్‌ క్రైమ్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మి సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీ నేహా మెహ్రా సూచించారు.

madagoni surendar

Mar 28 2023, 13:37

జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు 1కోటి 7లక్షల 50 వేల రూపాయల నిధులను కేటాయించిన విజయవాడ ఎంపీ.

జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి మరియు నియోజకవర్గ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు 1కోటి 7లక్షల 50 వేల రూపాయల నిధులను కేటాయించిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)

25 మంచినీటి ట్యాంకర్లను నియోజకవర్గ ప్రజల అవసరార్థం కేటాయించారు

Streetbuzz news :

బండిపాలెం, తక్కెళ్లపాడు , ఇందుగుపల్లి, కాకరవాయి, ముక్త్యాల, వెంగనాయకునిపాలెం, శివాపురం, శెనగపాడు, ముంగొల్లు, భీమవరం, వత్సవాయి, కంభంపాడు, వేమవరం, కొండూరు, తొర్రగుడిపాడు, మాగల్లు, కొణతమాత్మకూరు, గొల్లమూడి, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, వెంకటాపురం, పోచవరం, , జయంతిపురం, ఎస్.ఎం. పేట, చిల్లకల్లు గ్రామ పంచాయితీల ప్రజల త్రాగునీటి అవసరాల కొరకు వాటర్ ట్యాంకర్లను మరయు 

జగ్గయ్యపేట మండలం, పోచంపల్లి గ్రామంలో రూ.45:00 లక్షలతో కమ్యూనిటీ హాల్, బాత్రూమ్స్, టాయిలెట్స్ నిర్మాణానికి

విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) తమ ఎంపి నిధుల నుండి నిధులు మంజూరు చేసారు

madagoni surendar

Mar 28 2023, 13:14

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి ..*

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి ..

 కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది.

గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని సూచించింది.

madagoni surendar

Mar 28 2023, 12:02

ఏపీ ::దొంగలందరూ మీ ఇళ్ల పక్కనే ఉన్నారు.. వారు చెప్పింది విని జగన్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యొద్దు: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

*దొంగలందరూ మీ ఇళ్ల పక్కనే ఉన్నారు.. వారు చెప్పింది విని జగన్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యొద్దు: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (నిజాయితీ గల నాయకుడు )

జగన్‌కు వ్యతిరేకంగా ఓటేసి మీ చేతులు మీరే నరుక్కోవద్దన్న ధర్మాన

ఎన్నికల్లో ఇంకొకరికి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరిక

ఓటు ద్వారా వైసీపీకి మరోమారు అవకాశం ఇవ్వాలని అభ్యర్థన

ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న దొంగలందరూ మీ ఇళ్ల పక్కన, మీ వీధుల్లో, మీ ఊరిలోనే ఉన్నారని, వారు చెప్పింది విని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి మీ చేతులు మీరే నరుక్కోవద్దని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గారలో నిన్న వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తరతరాలుగా ఉన్న ఆధిపత్యం పోయిందన్న ధర్మాన.. ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉందని, ఆ తర్వాత ఇంకొకరికి ఓటు వేస్తే ఈ కార్యక్రమాలన్నీ అగిపోతాయని అన్నారు. ఓటు ద్వారా మరోమారు వైసీపీకి అధికారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం అందుకుంటున్న పథకాలు, పొందుతున్న గౌరవం, కుటుంబ హోదా పెరగడం, పిల్లలు హాయిగా చదువుకోవడానికి కారణమైన వ్యక్తి, పార్టీ, ఆ పార్టీ గుర్తు మీకు జ్ఞాపకం ఉండాలని అన్నారు. మీ కుటుంబం పొందుతున్న గౌరవం, ఆనందానికి కారణమైన వ్యక్తిని పిచ్చోడని, సైకో అనే అంటే నమ్ముతారా? అని ధర్మాన ప్రశ్నించారు. ప్రయోజనం పొందుతున్న పార్టీని నిలబెట్టాలని కోరారు.

madagoni surendar

Mar 28 2023, 10:35

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

మహబూబ్​నగర్​, : యాసంగి పంటలకు కష్టాకలం వచ్చింది. సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనాల్స్​కు నీటి విడుదల లేకపోవడం, ఎండలు ముదరడంతో గ్రౌండ్​ వాటర్​ తగ్గిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. దీని ప్రభావంతో పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. మరో నెల రోజుల పాటు నీరు అవసరం ఉండడంతో, రైతులు పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి, మక్కలు, పత్తి, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిడ్జిల్ మండలానికి మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం (ఎంజీకేఎల్ఐ) ద్వారా, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని కొన్ని ఏరియాలకు కోయిల్​సాగర్​ కెనాల్స్​ ద్వారా సాగు నీరందుతుంది. మహబూబ్​నగర్, భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట, బాలానగర్, నవాబ్​పేట, జడ్చర్ల, రాజాపూర్, కోయిల్​కొండ మండలాల్లో బోర్ల ఆధారంగానే వరి వేసుకున్నారు. అయితే, వానాకాలం వడ్ల కొనుగోళ్లు లేట్​ కావడంతో యాసంగి రెండు నెలలు ఆలస్యమైంది. అక్టోబరులో వరి నార్లు పోసుకోవాల్సి ఉండగా, జనవరిలో నార్లు పోసుకున్నారు. కొందరు రైతులు అక్టోబరులో నార్లు పోసుకున్నా.. వరి పైర్లపై చలి ప్రభావంతో పంటలు ఎదగలేదు. దీంతో వీరు కూడా పంటను తీసేసి, జనవరిలో మరోసారి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ కంకి పట్టే దశలో ఉన్నాయి. పాల దశకు చేరుకోవడానికి మరో రెండు వారాల టైం పడుతుంది. ఇంకా నెల రోజులు సాగునీరు అందించాల్సి ఉంది.

కాల్వలకు నీళ్లు బంద్..​

ఎంజీకేఎల్ఐ కాల్వ కింద సాగు చేసిన వరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారబందీ ప్రకారం నీళ్లు వదులుతుండడంతో మిడ్జిల్​ మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కెనాల్​ ఎండిపోయింది. ఈ కెనాల్​లో అక్కడక్కడా నీరు నిల్వ ఉండగా, రైతులు మోటార్లతో ఎత్తిపోసుకొని పంటలను కాపాడుకుంటున్నారు. కోయిల్​సాగర్​ కింద రైట్, లెఫ్ట్​ మెయిన్​ కెనాల్స్​​ద్వారా పంటలకు పది రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నా.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరో పది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఈ కెనాల్స్​ పరిధిలోని వరి, తోటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది.

బోర్లు పోస్తలేవు..

యాసంగిలో జిల్లాలో బోర్ల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 2018 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడంతో బోర్లపై ఎఫెక్ట్​ పడింది. ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీలుగా నమోదమయ్యాయి. మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత పెరగడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దాదాపు 80 వేల ఎకరాలు బోర్ల కింద సాగవుతుండడం, అందరూ ఒకేసారి మోటార్లను ఆన్​ చేస్తుండడంతో గ్రౌండ్​ వాటర్​ త్వరగా పడిపోతోంది. ఇప్పటికే జిల్లాలో 1.16 మీటర్ల లోతుకు నీరు పడిపోగా రానున్న రెండు వారాల్లో గ్రౌండ్​ వాటర్​ మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఒక బోరు​లో నీళ్లు వస్తలే..

నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. బోర్ల ఆధారంగా ఆరెకరాల్లో డిసెంబరులో వరి వేసిన. ఇప్పుడు కంకి దశలో ఉంది. ఈ టైంలో బోర్లల్లో నీళ్లు వస్తలేవు. ఇప్పటికే ఒక బోరు బంద్​ అయింది. ఉన్న ఒక్క దాంతోనే పంటను కాపాడుకోవాలి.

–పి.రాములు, అమ్మాపూర్​

వంకాయ తోట వదిలేసిన..

నాకు ఎకరా పొలం ఉంది. బోరు ఉందని అర ఎకరంలో టమాట, మిగిలిన అర ఎకరంలో వంకాయ తోట పెట్టిన. పది రోజుల నుంచి బోరు పోస్తలేదు. దీంతో వంకాయ తోటను వదిలేసిన. టమాట తోటకు అరకొరగా నీరు అందిస్తున్న. వారం రోజులు అయితే ఈ బోరు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.

–కొత్తకోట గోవర్ధన్​, చిన్నచింతకుంట.

madagoni surendar

Mar 28 2023, 10:28

భద్రాద్రికొత్తగూడెం::గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు.

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

 

 

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

భద్రాద్రికొత్తగూడెం,  జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక కొత్తగూడెంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలాన్ని కూడా వదలడం లేదు. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు అయిన పెద్ద బజార్, చిన్నబజార్, ఎంజీరోడ్​, లేపాక్షి రోడ్, సూర్యాప్యాలెస్​ వెనుక వైపు గల గల్లీలను అధికార పార్టీ నేతల అండదండలతో బడాబాబులు కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో గజం భూమి ధర రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతోంది. ఫలితంగా రాజకీయ ప్రోద్బలంతో అధికారులకు మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. లేపాక్షి రోడ్డు–మార్కెట్–ఎంజీ రోడ్డుకు మధ్యలో పలు గల్లీలు ఆక్రమణలతో మాయమయ్యాయి.

సూర్యాప్యాలెస్​వెనెక గల గల్లీలో ఓ బడా వ్యాపారిదే రాజ్యం. ఎంజీ రోడ్​ నుంచి చిన్నబజార్, పెద్ద బజార్​లకు వెళ్లేందుకు పలు గల్లీలను గతంలో ఏర్పాటు చేయగా అవన్నీ ఇప్పుడు కబ్జాల పాలయ్యాయి. కొన్ని చోట్ల గల్లీల దారులు ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. కింద గల్లీ రోడ్ పై అక్రమ నిర్మాణాలు చేపడితే మరి కొందరేమో గల్లీలనే మూసేసి వ్యాపారాలు మొదలెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గల్లీల ఆక్రమణలతో తమ ఇళ్లకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గల్లీలను కబ్జా కోరల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

madagoni surendar

Mar 28 2023, 10:17

అల్లు అర్జున్ : చరణ్ కి దూరంగా బన్నీ… విష్ లేదు, విజిట్ లేదు..

అల్లు అర్జున్ : చరణ్ కి దూరంగా బన్నీ… విష్ లేదు, విజిట్ లేదు…

‘చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కాదు అనే స్థాయికి వెళ్లిందీ గొడవ. దీన్ని సారి చెయ్యడానికి, అందరం కలిసే ఉన్నాం అని చెప్పడానికి, చూపించడానికి మెగా హీరోలు అప్పుడప్పుడూ కలిసి కనిపిస్తూ ఉంటారు. దీంతో ఫాన్స్ మళ్లీ మా హీరోలంతా ఒకటే అనుకుంటూ ఉంటారు. అభిమానులు అలా అనుకునే లోపే కాదు కాదు అల్లు అర్జున్ వేరు మెగా హీరోలు వేరు అనిపించేలా ఒక సంఘటన జరుగుతుంది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నార్త్ సెలబ్రిటీల వరకూ చాలా మంది చరణ్ ని విష్ చేశారు.

అల్లు అర్జున్ మాత్రం విష్ చెయ్యలేదు, పర్సనల్ గ ఫోన్ చేసి విష్ చేసాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చెయ్యలేదు. నైట్ వరకూ వెయిట్ చేసిన ఫాన్స్, అల్లు అర్జున్ నుంచి ట్వీట్ రాకపోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ వేరు అల్లు అర్జున్ వేరు అనే కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చెయ్యకపోవడం ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫాన్స్ అందరికీ ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. చరణ్ ఇంట్లో నిన్న నైట్ వరకూ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఇండస్ట్రీ వర్గాలందరూ వచ్చారు కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు. దీంతో రాత్రి నుంచి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై మరింత నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మెగా అల్లు హీరోల మధ్య గ్యాప్ ఎప్పుడు సెటిల్ అవుతుందో చూడాలి.

madagoni surendar

Mar 28 2023, 10:10

మహబూబాబాద్ జిల్లా ::ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

నెల్లికుదురు (కేసముద్రం), మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, శాసనమండలి వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌‌‌‌ను వాయిదా వేయాలని వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.

madagoni surendar

Mar 28 2023, 10:06

మహబూబాబాద్ జిల్లా ::ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

నెల్లికుదురు (కేసముద్రం), మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, శాసనమండలి వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌‌‌‌ను వాయిదా వేయాలని వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.