మహబూబాబాద్ జిల్లా ::ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

నెల్లికుదురు (కేసముద్రం), మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, శాసనమండలి వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌‌‌‌ను వాయిదా వేయాలని వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.

మహబూబాబాద్ జిల్లా ::ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

నెల్లికుదురు (కేసముద్రం), మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, శాసనమండలి వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌‌‌‌ను వాయిదా వేయాలని వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.

న్యూడిల్లీ :కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

 

Stretbuzz news.

 

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత..

న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇటువంటి అంశాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని.. వాటిలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్​ ఈ వ్యాఖ్యలు చేసింది.స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని తాము పార్లమెంటుకు మాండమస్​(ఎక్స్​ట్రాడినరీ రిట్) ను జారీ చేయలేమని బెంచ్​ స్పష్టం చేసింది.

ఒకవేళ తాము ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరిస్తే.. దానికి అనుగుణంగా కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే ఇందుకు అనుగుణంగా మహిళల కనీస వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలని పిటిషనర్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ కోరారు. పురుషాధిక్య దృక్పథంతోనే మనదేశంలో పురుషుల వివాహ వయసును ఎక్కువగా, మహిళల వివాహ వయసును తక్కువగా ఉంచారని పిటిషన్ లో​ పేర్కొన్నారు.

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములుమెరుపులు, ఈదురుగాలులు.

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములుమెరుపులు, ఈదురుగాలులు..

Streetbuzz News. నల్గొండ జిల్లా:

హైదరాబాద్ : తూర్పు తెలంగాణ జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంగళవారం ఉదయం నుంచి పలు ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చేతికందిన పంట అకాల వర్షంతో పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత ఆర్థిక భారం పెరిగిపోయిందని వాపోయారు.

ఏపీ ::సియం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన కు రెడీ అయ్యరా.కొడాలి నానీ కీ మల్లి ఛాన్స్

సియం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన కు రెడీ అయ్యరా??

కొడాలి నానీ కీ మల్లి ఛాన్స్

ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల జగన్ అంతర్గతంగా చాలా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రత్యర్థిలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులలో చాలామంది కౌంటర్లు ఇవ్వకపోవడం పట్ల కూడా అధినాయకుడు అసహనంగా ఉన్నారట. దీంతో క్యాబినెట్లో ఐదుగురు మంత్రులను పక్కన పెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు టాక్. పైగా వాళ్లకు కేటాయించిన శాఖలో వాళ్ళ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడంతో… మంత్రివర్గ ప్రక్షాళన చేయటానికి

నిర్ణయం తీసుకున్నట్లు దీంతో త్వరలోనే గవర్నర్ తో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల ప్లేసులోకి ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రిగా తీసుకోవడానికి జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ టైం లో ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా వ్యవహరించారు. ఇక రెండోసారి.. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన టైంలో కొడాలి నానిని… పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఐదుగురు మంత్రులను పక్కన పెడుతున్న నేపథ్యంలో కొడాలి నాని తో పాటు పేర్ని నాని మరి కొంతమంది కౌంటర్లు ఇచ్చే పార్టీ వాయిస్.. తోపాటు ప్రభుత్వం చేసే మంచి పనులను తెలియజేసే వారికి అవకాశం కల్పించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు సమాచారం.

ఏపీ:వీల్స్ ఇండియాలో 261 మంది పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉద్యోగాలు.సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి*

వీల్స్ ఇండియాలో 261 మంది పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉద్యోగాలు 

 సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి 

Streetbuzz news.

పాలిటెక్నిక్ విద్యార్ధులకు తక్షణ ఉపాధి చూపాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చేపడుతున్న ప్రత్యేక జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి వీల్స్ ఇండియా సంస్ధలో ఉద్యోగాలు పొందిన 261 మంది విద్యార్ధులకు సోమవారం నాగరాణి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారెవ్వరూ నిరుద్యోగులుగా మిగలరాదన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాంకేతిక విద్యా శాఖలో ఉపాధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. మూడు దశలలో విద్యార్ధులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం కళాశాల యూనిట్ గా తొలిదశ, క్లస్టర్ స్ధాయిలో మలిదశ, రాష్ట్ర స్ధాయిలో తుదిదశ విభాగాలు పనిచేస్తున్నాయని నాగరాణి తెలిపారు. అయా సంస్ధలు, విద్యార్ధుల మధ్య సమన్వయం కోసం అనుభవం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో మొత్తం 335 మంది చివరి సంవత్సరం విద్యార్థులు హాజరు కాగా, 261 మంది విద్యార్ధులు 2.32 లక్షల సాంవత్సరిక వేతనంతో ఎంపికయ్యారన్నారు. వీరిలో 236 మంది విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ నుండి, 25 మంది సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుండి ఉన్నారన్నారు. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ బ్రాంచ్‌ల నుండి వీరు ఎంపిక అయ్యారన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, వీల్స్ ఇండియా మానవవనరుల విభాగం నుండి దివాకర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ సారధి, ఉఫాధి అధికారి డాక్టర్ కె విజయ భాస్కర్, సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు. వీల్స్ ఇండియాతో పాటు ప్రతిష్టాత్మక టాటా ప్రాజెక్ట్స్ కు మరో 11 మంది ఎంపిక కాగా వారికి కూడా కమీషనర్ నియామక పత్రాలు పంపిణీ చేసారు. 

 హెచ్‌ఎల్ మండో ఆనంద్ ఇండియాలో 19 మందికి అవకాశం: 

మరోవైపు హెచ్‌ఎల్ మండో ఆనంద్ ఇండియాలో 19 మందికి అవకాశం లభించింది. ఉత్తీర్ణత సాధించిన డిప్లొమా విద్యార్థులు ఈ సంస్దలో టెక్నీషియన్ అప్రెంటీస్‌లుగా ఎంపికకాగా, ఒంగోలు డిఎ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఇటీవల సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన జాబ్ మేళాలో ఈ ఎంపికలు జరిగాయి.

ఏపీ :వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి. బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలిః ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.

ఏపీ :వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి.

బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలిః ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.

శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రెస్ మీట్ః

- నాటి వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మల్యేల కొనుగోలు వరకూ బాబుది అదే తీరు

- సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

- ఈడీలాంటి సంస్థలు ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో వెలికితీయాలి

- మొన్న తెలంగాణ, నేడు ఏపీలో ఓటుకు నోటు వ్యవహారాలకు మూలం చంద్రబాబే

 - శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్

- శ్రీదేవి స్క్రిప్ట్‌ బాబుదే..

- మీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే సజ్జల గారిపై ఆరోపణలు

- ఇక్కడ నీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు...భయపడాల్సిన పనిలేదు

- పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు

- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

- జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

-శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్

శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

- నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావించారు

- తనకు డబ్బులివ్వడానికి ఒక ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు మనుషులు కొందరు సంభాషించారని చెప్పాడు

- ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్‌ చేశానని కూడా రాపాక వరప్రసాద్‌ చెప్పారు..

- నేను మాట్లాడిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకున్నారు

- ఇంతటి దుర్మార్గానికి పాల్పడినందుకు ఆ వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది

- గతంలో తెలంగాణా రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు

- మళ్లీ మన రాష్ట్రంలో అటువంటి ప్రయత్నాలే చేయడం దుర్మార్గమైన విషయం

- ఈ వ్యవహారంపై.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి

- ఒక్కొక్క ఎమెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని రాపాక, మద్దాళి గిరి కూడా తెలిపారు

- వీటన్నిటిపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరపాలి...దీనికి సంబంధించిన వారిని అరెస్ట్‌ చేయాలి

- ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నా

- తెలంగాణాలో జరిగిన ఓటుకు నోటు కేసును కూడా దీనితో కలిపి విచారించాలి

- ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని, ఎలా డబ్బు తరలింది అనేది విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి

- తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభం అయ్యింది.

వైశ్రాయ్‌ నుంచి నిన్నటి వరకూ మారని బాబు తీరు:

- ఇలాంటి అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

-1995లో వైశ్రాయ్‌ క్యాంపు దగ్గర నుంచి నిన్నటి ఓటుకు నోటు వరకూ గమనించండి

- ఇప్పుడు వరప్రసాద్, గిరితో మాట్లాడటం చూడండి..ఇవన్నీ ఒకే సోర్స్‌ నుంచి జరుగుతున్నాయి

- ఆ సోర్స్‌ను పట్టుకుని ఆపగలిగితే ప్రజాస్వామ్యానికి మంచింది..భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి

- విచారణ సంస్థలకు ఎక్కడ పట్టుకుంటే ఇది ఆగిపోతుందో నేను క్లూ ఇస్తున్నా..

అమరావతి అన్నావంటే స్క్రిప్ట్‌ ఎక్కడిదో అర్ధం కావడం లేదా..?:

- ఉండవల్లి శ్రీదేవి గారు తన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు...వెళ్లిపోయారు

- ఆమె ఒక్కదాన్నే కాదు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు

- పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇతర పార్టీలతో కలిసిపోయారనేది పార్టీ నమ్మింది

- దానిపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేశారు

- ఎందుకు ఆమె కంగారుపడి అమరావతి నినాదాన్ని ఎత్తుకున్నారు..?

- నువ్వు తెలుగుదేశం వారితో వెళ్లావని చెప్పడానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు

- నిన్న నువ్వు మాట్లాడిన స్క్రిప్ట్‌ అంతా యథాతథంగా టీడీపీదే.

- నువ్వు తెలుగుదేశానికి సహకరించుకోవాలి అనుకుంటే సహకరించుకో

- నీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని సజ్జల గారితో నాకుప్రాణ హాని అనడం సరైంది కాదు

- అంత పెద్ద వారి గురించి ఎందుకు..? నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారని అంతటి పెద్ద పెద్ద మాటలు..?

పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు:

- మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు...మీ మార్గం మీరు ఎంచుకున్నారు..దయచేసి మీ పని మీరు చేసుకోండి

- ఒక పెద్దగా, సీనియర్‌గా, మీ నాన్నకు స్నేహితుడిగా చెప్తున్నా...ఒక కుల పెద్దగా కూడా చెప్తున్నా

- ఇలాంటి విషయాల్లో కులాన్ని వాడుకోవద్దు...మీ నాన్న ప్రతిష్టను పాడుచేయవద్దు

- పెద్ద పెద్ద పేర్లు వాడటం వల్ల నీకు ఏమీ మంచి పేరు రాదు

- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

- ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు

- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

- పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పడం వల్ల పేపర్లో ఒక రోజు పేరు వస్తుందేమీ కానీ నీకు ఒరిగేది ఏమీ లేదు

- ఇలాంటి చర్యల వల్ల సమాజం హర్షించదు..వాస్తవం ఏం జరిగిందో ప్రజలకు తెలుసు

- నీకు బంధువుగా, కులపెద్దగా చెప్తున్నా...కులాన్ని తీసుకురావద్దు...పెద్ద వాళ్ల పేర్లు వాడొద్దు

ప్రభుత్వం నీకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది:

- నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకో..నీకు ఎలాంటి భయం లేదు

- ప్రభుత్వం నీకు ఏం రక్షణ కావాలో అది కల్పిస్తారు..ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు

- ఎవరిమీదా వైల్డ్‌ ఎలిగేషన్స్‌ చేయవద్దు...చేసి మీనాన్న ప్రతిష్టకు, కుల ప్రతిష్టకు భగం కలిగించవద్దు

- సజ్జల చంపాలని చూస్తున్నాడంటూ అంత పెద్ద మాటలు మాట్లాడతావా అమ్మా..?

- నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా...అలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయవద్దు

- కొన్ని మీడియా వాళ్లు, రాజకీయ పార్టీలు నిన్ను రెచ్చగొడతారు...

- రాజకీయంగా నీ ప్రయాణం నువ్వు చేసుకో...దానికి మేమేం అడ్డు చెప్పడం లేదు

- కానీ కులాన్ని వాడుకోవద్దని మాత్రం ఒక పెద్దవాడిగా చెప్తున్నా

జగన్‌ గారి నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారు:

- జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

- ఎమ్మెల్యే శ్రీదేవి ని కూడా ఆయన చాలా గౌరవంగా చూసుకున్నారు

- ఇక ఇలాంటి వివాదాలు క్లోజ్‌ చేసి రాజకీయంగా నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్లు

- అనవరంగా వివాదాస్పద విషయాలు మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు

- కులాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని నా మనవి.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణానికి చెందిన గుండు శ్రీనివాస్ ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి. ద్వారా మంజూరైన.1,25,000/- రూపాయల ఎల్ ఓ సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేసారు.    

ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ    

కేతపల్లి మండల కేంద్రానికి చెందిన పిల్లలమర్రి జ్యోతి లక్ష్మి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,ఆయన వెంట నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.

కట్టంగూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

కట్టంగూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuzz news.నల్గొండ జిల్లా :

ఈ నెల 31 న కట్టంగూర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. సోమవారం కట్టంగూర్ లోని సత్యసాయి ఫంక్షన్ హాల్ లో కట్టంగూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని.ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. కట్టంగూర్ మండలంలోని 12 గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అభిమానులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సమ్మేళనానికి ముఖ్య అతిధిగా గుంతకండ్ల జగదీశ్ రెడ్డి జడ్పీ చైర్మన్ బండ నరేందర్ హాజరు కానునట్లు తెలిపారు ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు,ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్లు, వార్డ్ నెంబర్లు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవిత : ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా..

ఎమ్మెల్సీ కవిత : ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా..

దిల్లీ : మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది..

గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్‌ దాఖలు చేశారు..

దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు కేసు విచారణకు రాలేదు. నేడు జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయగా.. ధర్మాసనం విచారణ చేపట్టింది..