ఏపీ :వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి. బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలిః ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.

ఏపీ :వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి.

బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలిః ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.

శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రెస్ మీట్ః

- నాటి వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మల్యేల కొనుగోలు వరకూ బాబుది అదే తీరు

- సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

- ఈడీలాంటి సంస్థలు ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో వెలికితీయాలి

- మొన్న తెలంగాణ, నేడు ఏపీలో ఓటుకు నోటు వ్యవహారాలకు మూలం చంద్రబాబే

 - శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్

- శ్రీదేవి స్క్రిప్ట్‌ బాబుదే..

- మీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే సజ్జల గారిపై ఆరోపణలు

- ఇక్కడ నీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు...భయపడాల్సిన పనిలేదు

- పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు

- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

- జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

-శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్

శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

- నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావించారు

- తనకు డబ్బులివ్వడానికి ఒక ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు మనుషులు కొందరు సంభాషించారని చెప్పాడు

- ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్‌ చేశానని కూడా రాపాక వరప్రసాద్‌ చెప్పారు..

- నేను మాట్లాడిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకున్నారు

- ఇంతటి దుర్మార్గానికి పాల్పడినందుకు ఆ వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది

- గతంలో తెలంగాణా రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు

- మళ్లీ మన రాష్ట్రంలో అటువంటి ప్రయత్నాలే చేయడం దుర్మార్గమైన విషయం

- ఈ వ్యవహారంపై.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి

- ఒక్కొక్క ఎమెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని రాపాక, మద్దాళి గిరి కూడా తెలిపారు

- వీటన్నిటిపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరపాలి...దీనికి సంబంధించిన వారిని అరెస్ట్‌ చేయాలి

- ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నా

- తెలంగాణాలో జరిగిన ఓటుకు నోటు కేసును కూడా దీనితో కలిపి విచారించాలి

- ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని, ఎలా డబ్బు తరలింది అనేది విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి

- తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభం అయ్యింది.

వైశ్రాయ్‌ నుంచి నిన్నటి వరకూ మారని బాబు తీరు:

- ఇలాంటి అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

-1995లో వైశ్రాయ్‌ క్యాంపు దగ్గర నుంచి నిన్నటి ఓటుకు నోటు వరకూ గమనించండి

- ఇప్పుడు వరప్రసాద్, గిరితో మాట్లాడటం చూడండి..ఇవన్నీ ఒకే సోర్స్‌ నుంచి జరుగుతున్నాయి

- ఆ సోర్స్‌ను పట్టుకుని ఆపగలిగితే ప్రజాస్వామ్యానికి మంచింది..భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి

- విచారణ సంస్థలకు ఎక్కడ పట్టుకుంటే ఇది ఆగిపోతుందో నేను క్లూ ఇస్తున్నా..

అమరావతి అన్నావంటే స్క్రిప్ట్‌ ఎక్కడిదో అర్ధం కావడం లేదా..?:

- ఉండవల్లి శ్రీదేవి గారు తన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు...వెళ్లిపోయారు

- ఆమె ఒక్కదాన్నే కాదు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు

- పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇతర పార్టీలతో కలిసిపోయారనేది పార్టీ నమ్మింది

- దానిపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేశారు

- ఎందుకు ఆమె కంగారుపడి అమరావతి నినాదాన్ని ఎత్తుకున్నారు..?

- నువ్వు తెలుగుదేశం వారితో వెళ్లావని చెప్పడానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు

- నిన్న నువ్వు మాట్లాడిన స్క్రిప్ట్‌ అంతా యథాతథంగా టీడీపీదే.

- నువ్వు తెలుగుదేశానికి సహకరించుకోవాలి అనుకుంటే సహకరించుకో

- నీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని సజ్జల గారితో నాకుప్రాణ హాని అనడం సరైంది కాదు

- అంత పెద్ద వారి గురించి ఎందుకు..? నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారని అంతటి పెద్ద పెద్ద మాటలు..?

పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు:

- మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు...మీ మార్గం మీరు ఎంచుకున్నారు..దయచేసి మీ పని మీరు చేసుకోండి

- ఒక పెద్దగా, సీనియర్‌గా, మీ నాన్నకు స్నేహితుడిగా చెప్తున్నా...ఒక కుల పెద్దగా కూడా చెప్తున్నా

- ఇలాంటి విషయాల్లో కులాన్ని వాడుకోవద్దు...మీ నాన్న ప్రతిష్టను పాడుచేయవద్దు

- పెద్ద పెద్ద పేర్లు వాడటం వల్ల నీకు ఏమీ మంచి పేరు రాదు

- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

- ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు

- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

- పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పడం వల్ల పేపర్లో ఒక రోజు పేరు వస్తుందేమీ కానీ నీకు ఒరిగేది ఏమీ లేదు

- ఇలాంటి చర్యల వల్ల సమాజం హర్షించదు..వాస్తవం ఏం జరిగిందో ప్రజలకు తెలుసు

- నీకు బంధువుగా, కులపెద్దగా చెప్తున్నా...కులాన్ని తీసుకురావద్దు...పెద్ద వాళ్ల పేర్లు వాడొద్దు

ప్రభుత్వం నీకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది:

- నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకో..నీకు ఎలాంటి భయం లేదు

- ప్రభుత్వం నీకు ఏం రక్షణ కావాలో అది కల్పిస్తారు..ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు

- ఎవరిమీదా వైల్డ్‌ ఎలిగేషన్స్‌ చేయవద్దు...చేసి మీనాన్న ప్రతిష్టకు, కుల ప్రతిష్టకు భగం కలిగించవద్దు

- సజ్జల చంపాలని చూస్తున్నాడంటూ అంత పెద్ద మాటలు మాట్లాడతావా అమ్మా..?

- నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా...అలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయవద్దు

- కొన్ని మీడియా వాళ్లు, రాజకీయ పార్టీలు నిన్ను రెచ్చగొడతారు...

- రాజకీయంగా నీ ప్రయాణం నువ్వు చేసుకో...దానికి మేమేం అడ్డు చెప్పడం లేదు

- కానీ కులాన్ని వాడుకోవద్దని మాత్రం ఒక పెద్దవాడిగా చెప్తున్నా

జగన్‌ గారి నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారు:

- జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

- ఎమ్మెల్యే శ్రీదేవి ని కూడా ఆయన చాలా గౌరవంగా చూసుకున్నారు

- ఇక ఇలాంటి వివాదాలు క్లోజ్‌ చేసి రాజకీయంగా నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్లు

- అనవరంగా వివాదాస్పద విషయాలు మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు

- కులాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని నా మనవి.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి అందజేత.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణానికి చెందిన గుండు శ్రీనివాస్ ఆనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సి. ద్వారా మంజూరైన.1,25,000/- రూపాయల ఎల్ ఓ సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేసారు.    

ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ    

కేతపల్లి మండల కేంద్రానికి చెందిన పిల్లలమర్రి జ్యోతి లక్ష్మి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,ఆయన వెంట నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.

కట్టంగూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

కట్టంగూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuzz news.నల్గొండ జిల్లా :

ఈ నెల 31 న కట్టంగూర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. సోమవారం కట్టంగూర్ లోని సత్యసాయి ఫంక్షన్ హాల్ లో కట్టంగూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని.ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. కట్టంగూర్ మండలంలోని 12 గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అభిమానులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సమ్మేళనానికి ముఖ్య అతిధిగా గుంతకండ్ల జగదీశ్ రెడ్డి జడ్పీ చైర్మన్ బండ నరేందర్ హాజరు కానునట్లు తెలిపారు ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు,ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్లు, వార్డ్ నెంబర్లు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవిత : ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా..

ఎమ్మెల్సీ కవిత : ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా..

దిల్లీ : మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది..

గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్‌ దాఖలు చేశారు..

దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు కేసు విచారణకు రాలేదు. నేడు జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయగా.. ధర్మాసనం విచారణ చేపట్టింది..

కోవిడ్-19పై అధ్యయనంతో తీసుకున్న చర్యలేమిటి. లోక్సభలో అడిగిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.

కోవిడ్-19పై అధ్యయనంతో తీసుకున్న చర్యలేమిటి?

లోక్సభలో అడిగిన ఎంపీ ఆదాల

Streetbuzz news..

కోవిడ్-19 మహమారిపై నిర్వహించిన సమగ్ర అధ్యయనంతో ఎటువంటి చర్యలు తీసుకున్నారని? నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో సోమవారం అడిగారు. ఈ ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏదైనా ప్రపంచ సహాయం తీసుకుందా? అని కూడా ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఉప మంత్రి పంకజ్ చౌదరి దీనికి రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ కోవిడ్-19 మహమ్మారి ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే భారీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. గత మూడు బడ్జెట్లలో ఆర్థిక వ్యవస్థను ఉద్దీపనం చేసేందుకు మూలధన వ్యయాన్ని 30-35 శాతం పెంచినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రాలకు కూడా గణనీయమైన సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ లింక్ గ్యారెంటీ స్కీంను ప్రారంభించామని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలు, వృద్ధులు, వితంతువులకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపారు. ప్రపంచ సహాయాన్ని పొంది, మరెన్నో ఉపశమన చర్యలను తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఏపీ:జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

యన్ టి ఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :

జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

డ్వాక్రా మహిళలే యజమానులుగా మహిళా మార్ట్ లు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

పొదుపు సంఘాల్లోని మహిళలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు : జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు ..

కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు ధీటుగా జగనన్న చేయూత మహిళా మార్ట్ లు ..*

కంచికచర్ల పట్టణంలో డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా చేయూత మార్ట్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారితో కలిసి ప్రారంభించారు, అనంతరం మార్ట్ ను సందర్శించి, డ్వాక్రా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు, పట్టణ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే ఈ జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులుగా ఉంటారన్నారు, ప్రతి పట్టణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య యూనిట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తారని, సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారని, తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుందని చెప్పారు, దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వమే సహకరిస్తుందని, కార్పొరేట్‌ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్‌ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్‌లను తీర్చిదిద్దాలని కోరారు, నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని డ్వాక్రా ఏర్పాటు చేస్తుందని, సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుందన్నారు, ఈ మార్ట్‌లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుందని, సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేస్తారని, ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారని తెలిపారు ..

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత, ఉపసర్పంచ్ వేమా సురేష్ బాబు, ఎమ్మార్వో రాజకుమారి, సొసైటీ అధ్యక్షులు కాలవ పెదబాబు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాల్గొన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాల్గొన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో కలసి పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,ఈసందర్భంగా.ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..  

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. బీజేపీ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సంపదని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు, సిపిఎం నాయకులు,బీఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు వర్షసూచన ..పిడుగులు పడే అవకాశం ..*

నేడు, రేపు వర్షసూచన ..

పిడుగులు పడే అవకాశం ..

తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా బిహార్‌ వరకు ద్రోణి విస్తరించింది.

దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా ఆదివారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఆవరించాయి.

పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

సోమ, మంగళవారాల్లోనూ కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో సకల సౌకర్యాలు కల్పించి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.సోమవారం నకిరేకల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు మరియు డ్రైనేజి పనులను పరిశీలించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం.

నకిరేకల్ పట్టణానికి చెందిన గంధమల్ల సత్తయ్య కి రూ.53 వేల ఐదువందల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,అందజేశారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జెడ్పిటిసి మాద ధనలక్ష్మినగేష్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

చందర్లపాడు..ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి. చనుమోలు సైదులు

27-03-2023 చందర్లపాడు

ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి చనుమోలు సైదులు

Streetbuzz news.

ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను చందర్లపాడు సెంటర్ నందు ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 65% ప్రజల పై ఆధారపడి న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అప్ప చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలను విద్యుత్తు బిల్లలు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి తలగిన ప్రభుత్వం చట్టాలు రద్దు ప్రకటించింది

బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంపద నంత పెట్టుబడిదారులు కార్పొరేట్లకు దోచిపెట్టింది దేశ ప్రజలు కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ ఆస్తులను తగనంపుకుంటుంది కార్మికులు హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోళ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను రైతుల హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తుంది అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ

జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని రైతులకు ఇచ్చే వ్యవసాయ పరికరాల మీద జిఎస్టిని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై సంకలు తగ్గించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేల్పుల ఏసోబు, తోటరామారావు, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.