ఏపీ:జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
యన్ టి ఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
డ్వాక్రా మహిళలే యజమానులుగా మహిళా మార్ట్ లు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
పొదుపు సంఘాల్లోని మహిళలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు : జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు ..
కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు ధీటుగా జగనన్న చేయూత మహిళా మార్ట్ లు ..*
కంచికచర్ల పట్టణంలో డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా చేయూత మార్ట్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారితో కలిసి ప్రారంభించారు, అనంతరం మార్ట్ ను సందర్శించి, డ్వాక్రా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు, పట్టణ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే ఈ జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులుగా ఉంటారన్నారు, ప్రతి పట్టణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య యూనిట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తారని, సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారని, తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుందని చెప్పారు, దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వమే సహకరిస్తుందని, కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్‌లను తీర్చిదిద్దాలని కోరారు, నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని డ్వాక్రా ఏర్పాటు చేస్తుందని, సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుందన్నారు, ఈ మార్ట్‌లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుందని, సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తారని, ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత, ఉపసర్పంచ్ వేమా సురేష్ బాబు, ఎమ్మార్వో రాజకుమారి, సొసైటీ అధ్యక్షులు కాలవ పెదబాబు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
Mar 27 2023, 17:32