ఏపీ:జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

యన్ టి ఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :

జగనన్న మహిళా మార్ట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

డ్వాక్రా మహిళలే యజమానులుగా మహిళా మార్ట్ లు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

పొదుపు సంఘాల్లోని మహిళలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు : జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు ..

కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు ధీటుగా జగనన్న చేయూత మహిళా మార్ట్ లు ..*

కంచికచర్ల పట్టణంలో డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా చేయూత మార్ట్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారితో కలిసి ప్రారంభించారు, అనంతరం మార్ట్ ను సందర్శించి, డ్వాక్రా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు, పట్టణ మహిళా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలే ఈ జగనన్న మహిళా మార్ట్‌కు యజమానులుగా ఉంటారన్నారు, ప్రతి పట్టణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలతో కూడిన పట్టణ మహిళా సమాఖ్య యూనిట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తారని, సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేస్తారని, తద్వారా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరుతుందని చెప్పారు, దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వమే సహకరిస్తుందని, కార్పొరేట్‌ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్‌ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్‌లను తీర్చిదిద్దాలని కోరారు, నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యులతో కమిటీని డ్వాక్రా ఏర్పాటు చేస్తుందని, సమాఖ్య మార్ట్‌లో 10 మంది సిబ్బందిని నియమించుకుంటుందన్నారు, ఈ మార్ట్‌లు ఆరునెలల్లోనే లాభాల్లోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుందని, సమాఖ్య సభ్యులకు లాభాల్లో వాటాను 6 నెలలకు ఓసారి డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేస్తారని, ఈ మార్ట్‌లో కొనుగోలు చేసే సమాఖ్య సభ్యులకు 3 శాతం రాయితీ కూడా ఇస్తారని తెలిపారు ..

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత, ఉపసర్పంచ్ వేమా సురేష్ బాబు, ఎమ్మార్వో రాజకుమారి, సొసైటీ అధ్యక్షులు కాలవ పెదబాబు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాల్గొన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి పాల్గొన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తో కలసి పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,ఈసందర్భంగా.ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..  

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. బీజేపీ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సంపదని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్లు, సిపిఎం నాయకులు,బీఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు వర్షసూచన ..పిడుగులు పడే అవకాశం ..*

నేడు, రేపు వర్షసూచన ..

పిడుగులు పడే అవకాశం ..

తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా బిహార్‌ వరకు ద్రోణి విస్తరించింది.

దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా ఆదివారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఆవరించాయి.

పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

సోమ, మంగళవారాల్లోనూ కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో సకల సౌకర్యాలు కల్పించి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.సోమవారం నకిరేకల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు మరియు డ్రైనేజి పనులను పరిశీలించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం.

నకిరేకల్ పట్టణానికి చెందిన గంధమల్ల సత్తయ్య కి రూ.53 వేల ఐదువందల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,అందజేశారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జెడ్పిటిసి మాద ధనలక్ష్మినగేష్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

చందర్లపాడు..ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి. చనుమోలు సైదులు

27-03-2023 చందర్లపాడు

ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి చనుమోలు సైదులు

Streetbuzz news.

ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను చందర్లపాడు సెంటర్ నందు ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 65% ప్రజల పై ఆధారపడి న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అప్ప చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలను విద్యుత్తు బిల్లలు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి తలగిన ప్రభుత్వం చట్టాలు రద్దు ప్రకటించింది

బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంపద నంత పెట్టుబడిదారులు కార్పొరేట్లకు దోచిపెట్టింది దేశ ప్రజలు కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ ఆస్తులను తగనంపుకుంటుంది కార్మికులు హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోళ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను రైతుల హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తుంది అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ

జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని రైతులకు ఇచ్చే వ్యవసాయ పరికరాల మీద జిఎస్టిని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై సంకలు తగ్గించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేల్పుల ఏసోబు, తోటరామారావు, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం..

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం..

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సిబిఐ..

ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కేసులో సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

విచారణ అధికారిని తక్షణమే మార్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ అధికారి రాంసింగ్ ను మార్చివేయాలని జస్టిస్ ఎం ఆర్ షా సిబిఐకి సూచించారు..

ఏపీ.దాతృత్వాన్ని చాటుకున్న నందిగామ సిఐ కే సతీష్.

దాతృత్వాన్ని చాటుకున్న నందిగామ సిఐ కే సతీష్

భార్యా పై భర్త బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో గాయపడ్డ బాధితురాలికి అండగా నిలిచి సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసిన.నందిగామ సీఐ

సీఐ స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు స్థానికులు

Streetbuz news.

నందిగామాలో దారుణం.

 భార్యపై బీరు సీసాతో దాడి భర్త...

నందిగామ బీసీ కాలనీలో నివాసముంటున్న పల్లెపు శ్రీలక్ష్మి నీ ఆమె భర్త ఆంజనేయులు బీరు సీసాతో విచక్షణ రహితంగా గాయపరిచాడు...

భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగా గత ఆరు నెలల నుంచి విడిగా ఉంటున్న శ్రీలక్ష్మి...

ఉదయం ఇంట్లో ఉన్న భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త...

 నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రధమ చికిత్స అనంతరం విజయవాడ తరలించాలని వైద్యులు తెలపడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న శ్రీ లక్ష్మీ కుటుంబ సభ్యుల ఆవేదన గమనించిన సిఐ కె సతీష్ వెంటనే సొంత ఖర్చులతో ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి విజయవాడ తరలించిన వైనం..

సిఐ కే సతీష్ స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు కుటుంబ సభ్యులు...

ఏపీ :ఆదాయం విషయంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది.2022-23 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే

విశాఖపట్నం;

ఆదాయం విషయంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 

2022-23 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే మార్చి 25వ తేదీ నాటికి రూ.9 వేల కోట్ల ఆదాయం సాధించింది. 

Streetbuzz news.

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 61.17 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగా రూ.8,498.86 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మార్చి 25వ తేదీ నాటికి 68.12 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేసి రూ.9 వేల కోట్ల ఆదాయం సాధించింది. డివిజన్‌లో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి అని డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ శెత్పథి ప్రకటించారు.

ఏపీ:గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు.

గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.. డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు.  

 104 అంబులెన్స్ లను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి 

దేవరాపల్లి, 27, మార్చి. 

రాష్ట్రంలో వైద్య సేవలకు వైఎస్సార్ హయంలో ఉన్న వైభవం తిరిగి తీసుకుని వచ్చే దిశగా సేవలు అందించడమే లక్ష్యమని, గత ప్రభుత్వం విస్మరించిన వైద్య సేవలను వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గతం కన్నా ఎక్కువ అంబులెన్స్ లను ఏర్పాటు చేశామనని, గ్రామీణ ప్రాంతాలలో నిర్దిష్ట సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి అన్నారు.

 మండలం లోని తారువ గ్రామం క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల, కోటపాడు, దేవరాపల్లి మండలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి కీలపర్తి భాస్కరరావు, కోటపాడు జెడ్పీటీసి అనురాధ, వైద్యాధికారి సబ్రమణ్యం, MPHEO రాజశేఖర్, TSN మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత.

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారన్నది ఈడీ అభియోగం. దీనిపై ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ.. 16న మరోసారి హాజరుకావాలని సమన్లు జారీచేసింది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు ఈకేసు విచారణకు రాలేదు. 27 నాటికి జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌చేశారు. దీనిపై ఇప్పటికే ఈడీ కెవియట్‌ దాఖలు చేసింది. ఈ రెండు అంశాలూ సోమవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.