ఏపీ :ఆదాయం విషయంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది.2022-23 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే

విశాఖపట్నం;

ఆదాయం విషయంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 

2022-23 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే మార్చి 25వ తేదీ నాటికి రూ.9 వేల కోట్ల ఆదాయం సాధించింది. 

Streetbuzz news.

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 61.17 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగా రూ.8,498.86 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మార్చి 25వ తేదీ నాటికి 68.12 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేసి రూ.9 వేల కోట్ల ఆదాయం సాధించింది. డివిజన్‌లో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి అని డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ శెత్పథి ప్రకటించారు.

ఏపీ:గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు.

గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.. డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు.  

 104 అంబులెన్స్ లను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి 

దేవరాపల్లి, 27, మార్చి. 

రాష్ట్రంలో వైద్య సేవలకు వైఎస్సార్ హయంలో ఉన్న వైభవం తిరిగి తీసుకుని వచ్చే దిశగా సేవలు అందించడమే లక్ష్యమని, గత ప్రభుత్వం విస్మరించిన వైద్య సేవలను వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గతం కన్నా ఎక్కువ అంబులెన్స్ లను ఏర్పాటు చేశామనని, గ్రామీణ ప్రాంతాలలో నిర్దిష్ట సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి అన్నారు.

 మండలం లోని తారువ గ్రామం క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల, కోటపాడు, దేవరాపల్లి మండలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి కీలపర్తి భాస్కరరావు, కోటపాడు జెడ్పీటీసి అనురాధ, వైద్యాధికారి సబ్రమణ్యం, MPHEO రాజశేఖర్, TSN మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత.

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారన్నది ఈడీ అభియోగం. దీనిపై ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ.. 16న మరోసారి హాజరుకావాలని సమన్లు జారీచేసింది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు ఈకేసు విచారణకు రాలేదు. 27 నాటికి జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌చేశారు. దీనిపై ఇప్పటికే ఈడీ కెవియట్‌ దాఖలు చేసింది. ఈ రెండు అంశాలూ సోమవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.

నేడు గవర్నర్‌తో సీఎం భేటీ- త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం.

నేడు గవర్నర్‌తో సీఎం భేటీ- త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం!

సీఎం జగన్‌ ఇవాళ గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశంపైనే భేటీ జరగనుందని టాక్ నడుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సమావేశం కానున్నారు. ప్రకాశం, విశాఖలోనూ జగన్ పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత గవర్నర్‌తో సమావేశం కానున్నారు. 

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందుకే ముందస్తుగా గవర్నర్‌తో సీఎం సమావేశంకానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఈ మధ్యే ఆ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడున్న జట్టులోంచి కొందర్ని తప్పించి కొత్తవాళ్లకు స్థానం కల్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

గత ఏప్రిల్‌లోనే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో చాలా మందిని కొత్తవాళ్లనే తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి మార్పులు చేర్పులు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి శాఖాల్లో మార్పులు ఉండవచ్చేమోగానీ, జట్టులో ముగ్గురినే మార్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కులసమీకరణాలు, పనితీరు ఆధారంగా ఈ ఛేంజెస్ ఉంటాయంటున్నారు. 

ఇప్పటికే మార్చి 14నే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై సంకేతాలు ఇచ్చారు. కొత్తగా జట్టులోకి ముగ్గురు లేదా నలుగురిని తీసుకొని ఉన్న వారిలో కొందరిని బైబై చెప్పనున్నారని సమాచారం. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్‌తోపాటు తోట త్రిమూర్తులు, కౌరు శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. అయితే ఎవర్ని తప్పిస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విడదల రజిని, దాడిశెట్టి రాజా తప్పించి ఛాన్స్ ఉందటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

దాడిశెట్టి రాజా స్థానంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును జగన్ మూడో దఫా కేబినెట్ లోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు 14 జూన్ 2021లో గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులు కాగా, అదే నెల 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చిలకలూరిపేటకు చెందిన మంత్రి విడదల రజిని బీసీ ఎమ్మెల్యే కాగా, ఆమెను కేబినెట్ నుంచి తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇస్తారా అనేది డౌట్‌గానే ఉంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అసలే ఈ మధ్య కాలంలో అసంతృప్తులు పెరిగిపోతున్న టైంలో కేబినెట్ విస్తరణకు వెళ్తారా అనేది కూడా ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా వెళితే మార్పులు చేర్పుల్లో పదవులు రాని వారిని సైతం బుజ్జగించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో రిస్క్‌ చేస్తారా లేదా అనేది మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే పాదయాత్ర టైంలో చాలా మంది నేతలకు చట్టసభల్లోకి తీసుకెళ్లి మంత్రులుగా చేస్తానంటూ ప్రజల ముందు మాట ఇచ్చారు జగన్. అలాంటి వ్యక్తుల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. ఇన్నాళ్లకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఈ దఫా మంత్రిని చేస్తారా లేకుంటే వచ్చే టెర్మ్‌కు వాయిదా వేస్తారా అనేది సస్పెన్స్‌. 

నేటి గవర్నర్‌తో భేటీలో మాత్రం మంత్రివర్గం అంశంపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన బిల్లపై గవర్నర్‌తో చర్చించనున్నారు.

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల.శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు.ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.

పెరుగుతున్న కరోనా కేసులు. నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి 1000కి పైగా రోజువారీ కేసుల నమోదు

పెరుగుతున్న కరోనా కేసులు.... నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి

1000కి పైగా రోజువారీ కేసుల నమోదు

పలు చోట్ల మరణాలు

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

కరోనా కట్టడి చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్

భారత్ లో కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరణాలు కూడా సంభవిస్తుండడం కలవరపరుస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. 

కాగా, దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ను ఎక్స్ బీబీ 1.16 అని గుర్తించారు.

తిరుమల సమాచారం...5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

తిరుమల సమాచారం...

5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,415 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 28,454 మంది భక్తులు...

హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు...

ఏపీ :ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన*

ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన

నేడు ప్రకాశం జిల్లా వస్తున్న సీఎం

వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి

సాయంత్రం గవర్నర్ తో భేటీ

రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం

విందు కార్యక్రమానికి హాజరు

Streetbuzz news.

గుంటూరు : ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10.55 గంటలకు ప్రకాశం జిల్లా కారుమంచి వెళ్లనున్నారు. వైసీపీ నేత అశోక్ బాబు తల్లి కోటమ్మకు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.

సీఎం జగన్ రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకోనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు జీ20 ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జీ20 ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం, రేపు రాత్రి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఏపీ.వాహనాలపై నకిలీ స్టిక్కర్లు మరియు పోలీస్ సైరన్ తో హల్చల్. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

వాహనాలపై నకిలీ స్టిక్కర్లు మరియు పోలీస్ సైరన్ తో హల్చల్

అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

Streetbuz news.

విజయవాడ పలువురు వాహనాలపై దర్జాగా నకిలీ స్టిక్కర్లు (ప్రెస్, పోలీస్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఎమ్మెల్యే, ఎంపీ)వేసుకొని తిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ వాహనాలకు పోలీస్ సైరన్ వేసుకొని దర్జాగా జన సందడి ఉన్న ప్రాంతాలలో హడావుడి సృష్టిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రెస్, పోలీస్, ప్రభుత్వ అధికారులు, నాయకులమని చెప్పి అనేక అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని. అధికారులు వెంటనే స్పందించి వాహనాలపై నకిలి స్టిక్కర్లు, పోలీస్ సైరన్ వినియోగించే వాహనదారుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి, గుర్తింపు కార్డు లేని వాహనదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను కోరుతున్నారు.