madagoni surendar

Mar 27 2023, 11:19

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల.శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు.ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.

madagoni surendar

Mar 27 2023, 11:17

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.

madagoni surendar

Mar 27 2023, 10:34

పెరుగుతున్న కరోనా కేసులు. నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి 1000కి పైగా రోజువారీ కేసుల నమోదు

పెరుగుతున్న కరోనా కేసులు.... నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి

1000కి పైగా రోజువారీ కేసుల నమోదు

పలు చోట్ల మరణాలు

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

కరోనా కట్టడి చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్

భారత్ లో కొన్ని వారాలుగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరణాలు కూడా సంభవిస్తుండడం కలవరపరుస్తోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. 

కాగా, దేశంలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ను ఎక్స్ బీబీ 1.16 అని గుర్తించారు.

madagoni surendar

Mar 27 2023, 09:27

తిరుమల సమాచారం...5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

తిరుమల సమాచారం...

5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,415 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 28,454 మంది భక్తులు...

హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు...

madagoni surendar

Mar 27 2023, 09:21

ఏపీ :ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన*

ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన

నేడు ప్రకాశం జిల్లా వస్తున్న సీఎం

వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి

సాయంత్రం గవర్నర్ తో భేటీ

రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం

విందు కార్యక్రమానికి హాజరు

Streetbuzz news.

గుంటూరు : ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10.55 గంటలకు ప్రకాశం జిల్లా కారుమంచి వెళ్లనున్నారు. వైసీపీ నేత అశోక్ బాబు తల్లి కోటమ్మకు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.

సీఎం జగన్ రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకోనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు జీ20 ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జీ20 ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం, రేపు రాత్రి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

madagoni surendar

Mar 27 2023, 09:15

ఏపీ.వాహనాలపై నకిలీ స్టిక్కర్లు మరియు పోలీస్ సైరన్ తో హల్చల్. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

వాహనాలపై నకిలీ స్టిక్కర్లు మరియు పోలీస్ సైరన్ తో హల్చల్

అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

Streetbuz news.

విజయవాడ పలువురు వాహనాలపై దర్జాగా నకిలీ స్టిక్కర్లు (ప్రెస్, పోలీస్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఎమ్మెల్యే, ఎంపీ)వేసుకొని తిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ వాహనాలకు పోలీస్ సైరన్ వేసుకొని దర్జాగా జన సందడి ఉన్న ప్రాంతాలలో హడావుడి సృష్టిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రెస్, పోలీస్, ప్రభుత్వ అధికారులు, నాయకులమని చెప్పి అనేక అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని. అధికారులు వెంటనే స్పందించి వాహనాలపై నకిలి స్టిక్కర్లు, పోలీస్ సైరన్ వినియోగించే వాహనదారుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి, గుర్తింపు కార్డు లేని వాహనదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను కోరుతున్నారు.

madagoni surendar

Mar 26 2023, 15:31

ధర్మ బిక్షం గౌడ్ 12 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించిన.తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

ధర్మ బిక్షం గౌడ్ 12 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించిన.తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండగాని నాగభూషణం గౌడ్ 

Streetbuzz news. నల్గొండ జిల్లా :

తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ పార్లమెంటు సభ్యులు గీత కార్మికుల హక్కులకై అనేక ఉద్యమాలు చేసి సాధించడం తో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షం గౌడ్ 12 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిoచిన. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండగాని నాగభూషణం గౌడ్,మరియు గుండగాని అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 26 2023, 13:14

జోగులాంబ గద్వాల జిల్లా: మిషన్ భగీరథ లో ఒంటిపూట నీళ్లు. గత పది రోజుల నుంచి అరకొరగా నీటి సరఫరా. ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.

జోగులాంబ గద్వాల జిల్లా: మిషన్ భగీరథ లో ఒంటిపూట నీళ్లు.

గత పది రోజుల నుంచి అరకొరగా నీటి సరఫరా.

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.

Strrtbuzz news

జోగులాoబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, రాజోలి మండలం, పచ్చర్ల గ్రామంలో గత పది రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు అరకోరగా రావడంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. మార్చి నెలలో ఎండలు అధికమవడంతో నీటి అవసరాలు కూడా అధికంగా ఉంటాయన్నారు. గత పది రోజుల నుండి అరకొరగా కొళాయి నీళ్లు రావడంతో మిషన్ భగీరథ లో ఒంటి పూట నీళ్లు రావడంతో గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారని, ఉదయం పూట మాత్రమే కొళాయి నీళ్లు వస్తున్నాయని, అది కూడా ఒక గంటకు నాలుగు లేక ఐదు బిందెలు మాత్రమే వస్తున్నాయన్నారు. వచ్చే నీళ్లు కూడా సన్నగా వస్తున్నాయని, సాయంత్రం వేళ గత పది రోజుల నుంచి కొళాయి నీళ్లు రావడంలేదని, ఎన్ని రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారో కూడా మాకు తెలియడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ దృష్టికి తీసుకొని ఉదయం సాయంత్రం వేళ నీటి సరఫరా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు పై అధికారులను కోరుతున్నారు.

madagoni surendar

Mar 26 2023, 12:22

నకిరేకల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన.

నకిరేకల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన 

 

Streetbuzz news.నల్గొండ జిల్లా :

కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ఆదివారం ఉదయం హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది

కార్యకర్తలు నాయకులు వందలాదిగా పాల్గొని కొండేటి మల్లయ్యను ఆశీర్వదించారు 

ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన కొండేటి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్ షిప్ కార్డులను పంపిణీ చేసిన కొండేటి మల్లయ్య.

గుడివాడ గ్రామంలో పలువురి కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందించిన కొండేటి మల్లయ్య

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేకతీరును వివరించారు. 

కేంద్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సంక్షేమాన్ని వదిలి, కక్ష సాధింపులకు పాల్పడుతోందని చెప్పారు. 

ఈకార్యక్రమంలో. మాజీ జడ్పీటీసీ జఠంగి వెంకటనర్సయ్య, గుడివాడ మాజీ సర్పంచ్ SK. లతీఫ్, నకిరేకల్ మండల మాజీ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య, ఎంపీటీసీ గాజుల ప్రభాకర్, గుడివాడ గ్రామశాఖ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి,బడుగుల శేఖర్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల వేణు,దున్న కొండల్, ఏపూరి జగన్నాథ్, వార్డు మెంబర్,వేములకొండ సైదులు, నాయకులు.వేములకొండ నర్సింహ,ఖమ్మంపాటి సతీష్, గద్దపాటి సతీష్, ఏ. నారాయణ, SK. దస్తగిరి, చంద్రశేఖర్, గాజుల గోపి, రాచకొండ నాగభూషనం, టేకుల సుధాకర్, , గోలి సీతయ్య, పదిర గీత, ఆలకుంట్ల నర్సింహ, ఆలకుంట్ల సైదులు, రేపణి సత్తయ్య, కిరణ్, గ్యార గోపి, మంద భిక్షం, మాగి రాములు, కొడిదెల యాదయ్య, గుండ్లపల్లి మారయ్య, చిత్తలూరి వెంకన్న, చిత్తలూరి రాము, మంద వెంకయ్య, చిత్తలూరి పెద్దులు, చిత్తలూరి రాములు, చిత్తలూరి లక్ష్మయ్య, ఏడెల్లి నరేష్, ఏడెల్లి శ్రీను, గుండ్లపల్లి వెంకులు, చిత్తలూరి నర్సింహ, గాజులు చంధు, చేగోని నాగరాజు, చౌగోని రమేష్,కదిరె శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 26 2023, 11:53

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన

ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన

Streetbuzz news.నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో పలు వార్డులలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఆదివారం ఉదయం కాలినడకన పర్యటించారు.ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తనని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా పనులకు స్థానిక దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాలని, అభివృద్ధి లో నకిరేకల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలని కోరారు