madagoni surendar

Mar 24 2023, 17:52

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి.పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా.

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా 

 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య. అన్నారు.శుక్రవారం రామన్న పేట ఎంపీడీఓ కార్యాలయంలో రామన్న పేట మండలానికి చెందిన 45 మందికి రూ.45 లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులను,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. .పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని...దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు. అనంతరం.సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి*

రామన్న పేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ. 12 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు అందజేశారు.

madagoni surendar

Mar 24 2023, 17:46

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuz news.నల్గొండ జిల్లా :

గ్రామాల సర్వతోముకాభివృద్దికి సర్పంచుల పాత్ర కీలకమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కట్టంగూర్ మండల స్థాయిలో వివిధ కేటగిరీల కింద ఎంపికైనా గ్రామా పంచాయతీల సర్పంచులకు జాతీయ పంచాయతీ అవార్డులు ప్రధానం చేసి ఘనంగా సన్మానించి.అనంతరం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి

కట్టంగూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ. 5 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో. కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, ఎంపీటీసీలు,వివిధ గ్రామాల సర్పంచులు,వార్డ్ నెంబర్లు,ఎంపీడీఓ సునీత,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 24 2023, 13:33

15 రోజులు బ్యాంకులు బంద్.

15 రోజులు బ్యాంకులు బంద్ 

మార్చి 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగనున్నాయి, ఈసారి ఏప్రిల్ నెల మొత్తం 15 రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి, ఏప్రిల్ 1,2,4,5,7,8,9,14,15,16,18,21,22,23,30, తేదీలలో బ్యాంకు సెలవులు ఉండ ఉన్నాయి, బ్యాంకు కస్టమర్లు. మీకు బ్యాంకు పనులు ఉంటే సెలవులకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకోండి..

madagoni surendar

Mar 24 2023, 09:08

తిరుపతి : నేడు శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్ల విడుదల

తిరుపతి : నేడు శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్ల విడుదల

తిరుపతి : నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి..

మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ టోకెన్లను విడుదల చేయనుంది. గురువారం స్వామివారిని 58,965 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.5 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 25,113 మంది తలనీలాలు సమర్పించారు..

madagoni surendar

Mar 23 2023, 19:07

ఏపీ :వైసీపీకి దిమ్మతిరిగే షాక్.టీడీపీ 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపు* *కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్*

ఏపీ :వైసీపీకి దిమ్మతిరిగే షాక్.టీడీపీ 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపు

 కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 

 175కు 175 ఓట్లు చెల్లినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటన 

 ప్రారంభమైన కౌంటింగ్.. వైసీపీలో మొదలైన టెన్షన్..* 

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గంటలోపే ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ నమోదయింది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ముందుగా లెక్కిస్తున్నారు. అవసరమైతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే వైసీపీకి క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. ఏడు స్థానాల్లోనూ గెలుస్తామని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. వైసీపీ సొంత బలం 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తుండడంతో దాని బలం 155కు చేరింది. అయితే వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జులుగా తొలగించి వేరేవారిని నియమించింది. ముఖ్యంగా కోటంరెడ్డిని కొద్దిరోజుల కింద నిండు సభలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నానా బూతులు తిట్టారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. వీరిద్దరూ అంతరాత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అదే జరిగితే వైసీపీ బలం 153కి పడిపోతుంది. టీడీపీ అభ్యర్థికి అధికారికంగా 19 ఓట్లు ఉన్నాయి. ఆనం, కోటంరెడ్డి ఓటేస్తే టీడీపీ బలం 21కి పెరుగుతుంది. అప్పుడు వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమాన ఓట్లు లభిస్తాయి. అప్పుడు రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. వైసీపీకే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి గెలవడం తేలికే. కానీ గెలుపు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా దక్కుతుంది.. కేపి

madagoni surendar

Mar 23 2023, 18:10

మోదీపాలన కూట్రపూరితం కక్ష సాధింపుల ప్రభుత్వాలకు స్వస్తి పలుకుదాం.రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకోబోం.కొండేటి

మోదీపాలన కూట్రపూరితం  కక్ష సాధింపుల ప్రభుత్వాలకు స్వస్తి పలుకుదాం.రాహుల్ గాంధీపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకోబోం.టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఫైర్.

Streerbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్: కేంద్ర రాష్ట్రాల్లో కక్ష సాధింపుల పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య ఫైర్ అయ్యారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీపై ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గురువారం నిరసన వ్యక్తం చేశారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీపై కావాలనే బీజేపీ ప్రభుత్వం తీర్పులు ఇప్పిస్తోందని, తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోందని, అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు త్వరలోనే చెక్ పెట్టే రోజు వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీకి దేశమంతా అండగా ఉంటుందని, ఇప్పటికే ప్రజల్లో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్లో అపహాస్యం అవుతుననాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతి నేతపై ప్రజలు కోపంతో ఉన్నారని, వారిమ కుట్రపూరితమైన పాలనకు స్వస్తి పలికే రోజు త్వరలోనే ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంలు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనైనా మోదీ పాలనలో బంధీ అయిన ప్రజాస్వామ్యాన్ని కాపడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొండేటి మల్లయ్య పిలుపునిచ్చారు.

madagoni surendar

Mar 23 2023, 18:00

హైదరాబాద్‌: తెలంగాణ(తెలంగాణ ) లో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Centre) వెల్లడించిం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు..

హైదరాబాద్‌: తెలంగాణ(తెలంగాణ ) లో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Centre) వెల్లడించింది..

ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదై.. సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించారు..

madagoni surendar

Mar 23 2023, 17:56

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి. (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్)

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలి. (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్)

నేటి యువతకు భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకంమని ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జగ్గయ్యపేట మండల కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ,రాజ్ గురు ,సుకుదేవ్ ల 92వ వర్ధంతి కార్యక్రమం జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నా నారాయణ స్కూల్ నుండి బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటముకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు....

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా, దేశస్వాతంత్య్రం కోసం నూనూగు మీసాల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన వీరకిశోరాలన్నారు. జలియన్ వాలా బాగ్ దురంతంతో ప్రభావితమైన ఆయన జీవితం దేశ స్వాతంత్య్రం కోసం పార్లమెంట్ పొగ బాంబులతో దాడి చేసి బ్రిటీష్ వారిని గడగడ లాడించిన పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు, కాషాయకరణ, యుద్ధోన్మాదంకి వ్యతిరేకంగా పోరాడాలని, కార్పొరేట్ అనుకూల జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేసేంత వరకు,విద్యా ఉపాధి అవకాశాల కోసం భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పోరాడాలని యువతని కోరారు..   

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏం.సోమేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు జి.గోపినాయక్, ఐద్వా డివిజన్ కార్యదర్శి సోమోజు నాగమణి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష , కార్యదర్శులు రాజు ఎస్.ప్రణయ్ తేజ సిఐటియు మండల కార్యదర్శి గౌస్, డివైఎఫ్ఐ కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 23 2023, 16:59

గ్రామీణానికి వరం బార్క్‌ నీటి శుద్ధి పరిజ్ఞానం.

గ్రామీణానికి వరం బార్క్‌ నీటి శుద్ధి పరిజ్ఞానం.

రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, మార్చి 23: బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్‌) అభివృద్ధి చేసిన నీటి శుద్ధి పరిజ్ఞానం సాయంతో అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు శుద్ధిచేసిన, సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పీఎంవో శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధిచేసిన తాగునీరు అందించే లక్ష్యంతో ఆకృతి ప్రోగ్రాం పేరిట కేంద్ర ప్రభుత్వం అనేక మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ ఆధారిత నీటిశుద్ధి సాంకేతికతను బదలాయించినట్లు తెలిపారు.

బార్క్‌ అభివృద్ధి చేసిన నీటిశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏఏ రాష్ట్రాల్లో విస్తరించింది? ఏ టెక్నాలజీ ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయి? చౌకగా తాగు నీటిని శుద్ధి చేసే ఈ టెక్నాలజీని వాణిజ్యపరం చేసే ఆలోచన ఉందా అంటూ శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ వినూత్న నీటి శుద్ధి పరిజ్ఞానం గురించి వివరించారు. బార్క్ రూపొందించి నీటిశుద్ధి సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించినట్లు తెలిపారు. అలాగే వాణిజ్యపరంగా దీనిని విస్తరించేందుకు 14 పైగా ప్రైవేటు సంస్థలకు వివిధ రకాల టెక్నాలజీలను బదలాయించినట్లు తెలిపారు.

ఆయా ప్రాంతాల్లో నీటి నాణ్యత ఆధారంగా ఏ విధమైన నీటిశుద్ధి టెక్నాలజీని వినియోగించాలో నిర్ణయించిన మీదట దానిని విస్తరిస్తారని మంత్రి తెలిపారు. నీటిలో సూక్ష్మక్రిములతో నిండిన కాలుష్యం, మలినాలను తొలగించేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ టెక్నాలజీని, నీటిలో ఆర్సెనిక్/ ఐరన్ వంటి కాలుష్యాన్ని తొలగించేందుకు ఫిజికో కెమికల్ ప్రాసెస్ అసిస్టెడ్ ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ టెక్నాలజీని, ఉప్పుతోపాటు అనేక రకాల కాలుష్యాలు తొలగించేందుకు బ్రాకిష్‌ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆధారిత మెంబ్రేన్ టెక్నాలజీ, టీడీఎస్ 5000 నుంచి 35000 పీపీఎం వరకు తొలగించేందుకు సీ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆధారిత మెంబ్రేన్ టెక్నాలజీని బార్క్‌ రూపొందించినట్లు తెలిపారు.

బార్క్ రూపొందించిన మెంబ్రేన్ ఆధారిత నీటిశుద్ది సాంకేతిక పూర్తిగా స్వదేశీయమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని మంత్రి తెలిపారు. ఈ టెక్నాలజీల ఆధారంగా రూపొందించిన డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్స్ మార్కెట్లో లభ్యమయ్యే వాణిజ్యపరమైన రకాలతో పోల్చిచూస్తే 30%-40% వరకు తక్కువ ధరలో అందిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో కుళాయికి అమర్చే డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ 5 వేల రూపాయలు, గంటకు 10 లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్ధ్యం గల బీడబ్ల్యుఆర్ఓ-పీఓయూ వాటర్ ప్యూరిఫైర్ 10 వేలు, కమ్యూనిటీ సైజ్ యూఎఫ్ ఆధారిత ఆర్సెనిక్/ ఐరన్ రిమూవల్ యూనిట్ 10 లక్షలు, బీడబ్ల్యుఆర్ఓ మెంబ్రేన్ ఆధారిత కమ్యూనిటీ సైజ్ ఆర్ ఓ యూనిట్ 12 నుంచి 15 లక్షలు, గంటకు 10 వేల లీటర్ల నీటని శుద్ధి చేసే సామర్ధ్యం కలిగిన ఎస్‌డబ్ల్యుఆర్‌ఓ మెంబ్రేన్ ఆధారిత కమ్యూనిటీ సైజ్ ఆర్వో యూనిట్ 70 నుంచి 85 లక్షల మధ్యలో లభిస్తుందని మంత్రి తెలిపారు.

----------------------------------------------------------

madagoni surendar

Mar 23 2023, 16:54

హైదరాబాద్ : అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్ : అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు..

పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్‌ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

''బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్‌బుక్‌ యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్‌, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారు. మహిళల వ్యక్తిగత డేటానూ సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పు. సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి జస్ట్‌ డయల్‌ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం'' అని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు..