ఏపీ :వైసీపీకి దిమ్మతిరిగే షాక్.టీడీపీ 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపు* *కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్*
ఏపీ :వైసీపీకి దిమ్మతిరిగే షాక్.టీడీపీ 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపు
కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
175కు 175 ఓట్లు చెల్లినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటన
ప్రారంభమైన కౌంటింగ్.. వైసీపీలో మొదలైన టెన్షన్..*
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గంటలోపే ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ నమోదయింది. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ముందుగా లెక్కిస్తున్నారు. అవసరమైతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే వైసీపీకి క్రాస్ ఓటింగ్ టెన్షన్ మొదలైంది. ఏడు స్థానాల్లోనూ గెలుస్తామని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు తిరుగుబాటు అభ్యర్థుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. వైసీపీ సొంత బలం 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తుండడంతో దాని బలం 155కు చేరింది. అయితే వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జులుగా తొలగించి వేరేవారిని నియమించింది. ముఖ్యంగా కోటంరెడ్డిని కొద్దిరోజుల కింద నిండు సభలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నానా బూతులు తిట్టారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు కూడా వేశారు. వీరిద్దరూ అంతరాత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అదే జరిగితే వైసీపీ బలం 153కి పడిపోతుంది. టీడీపీ అభ్యర్థికి అధికారికంగా 19 ఓట్లు ఉన్నాయి. ఆనం, కోటంరెడ్డి ఓటేస్తే టీడీపీ బలం 21కి పెరుగుతుంది. అప్పుడు వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమాన ఓట్లు లభిస్తాయి. అప్పుడు రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. వైసీపీకే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి గెలవడం తేలికే. కానీ గెలుపు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా దక్కుతుంది.. కేపి
Mar 24 2023, 09:08