ఆ నేత కాంగ్రెస్ కు మరక - కార్యకర్తలను పట్టించుకోక పార్టీని అణగదొక్కిన నాయకుడు
కార్యకర్తలను పట్టించుకోక పార్టీని అడగదొక్కిన నాయకుడు
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా విలసిల్లిన మొగుళ్ళపల్లి మండలం ఆ పార్టీకి గుర్తింపును తెచ్చిపెట్టింది. నియోజకవర్గాల విభజన అనంతరం పరకాల నుంచి విడిపోయిన మొగుళ్ళపల్లి మండలం భూపాలపల్లి నియోజకవర్గంలో కలిసింది. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా విలిసిల్లిన మొగుళ్లపల్లి మండలం నేడు ఆ పార్టీని పట్టించుకునే నాధుడే లేక విలవిలలాడుతుంది. కార్యకర్తలను కలుపుకొని ముందుకు నడిపించే బాధ్యతలు ప్రస్తుతం భుజాన వేసుకుని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు తమ ఉనికిని ప్రతిష్టాపించుకునే దిశలో లేకపోవడం గమనార్హం. ఈనెల 21న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మొగుళ్లపల్లి మండలానికి చేరుకొనుండడంతో ఆ పార్టీ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులను సమీకరించడంలో మండల నేత ఉనికి కనిపించడం లేదని ఆ పార్టీ శ్రేణులు విడ్డూరంగా మాట్లాడడం వల్ల రాజకీయ విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్ను దండగా ఉండి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించిన అభిమానులు గుర్తింపు తగిన సరైన మండల నేత లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. మండలంలో పార్టీ ఉనికిని కాపాడాలంటే సరైన నేతకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కోరుతున్నారు. ఈనెల 21న వచ్చే రేవంత్ రెడ్డి రాకతోనైనా ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు కనువిప్పు కలగాలని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఆ పార్టీలో నాయకత్వ లోపంతో ఏర్పడిన విభేదాలు ఫ్లెక్సీలో ఏర్పాటులో సాక్షాత్కరిస్తుంది.
Feb 20 2023, 15:53