పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్, ఆర్ బి న్యూస్ మండల్ రిపోర్టర్ ఉప్పుల రవి కిరణ్
సాంబమూర్తి దేవాలయంలో మహా శివరాత్రి సంద్భంగా ప్రత్యేక పూజలు చేసిన మహేందర్ గౌడ్, ఉప్పుల రవి కిరణ్
పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ కేసరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సాంబమూర్తి దేవాలయంలో మహేందర్ గౌడ్, ఆర్ బి న్యూస్ మొగుళ్ళపల్లి మండల రిపోర్టర్ ఉప్పుల రవి కిరణ్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్, ఉప్పుల రవి కిరణ్ లు మాట్లాడుతూ.. మహామహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలతో ఉపవాసం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. ఆ పరమ శివుని కటాక్షాలు ప్రతి ఒక్కరిపై వుండాలని, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో జీవించాలని కోరారు. ఆ ఆది దేవుని తత్వం నేటికీ ఓ జీవన మార్గమని, నీవే దిక్కు అంటే చాలు..కరిగే అల్ప సంతోషి శివుడు అని, పార్వతికి తన అర్ధ భాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడిగా ప్రఖ్యాతి గాంచారని, రాక్షసులకు సైతం వరాలు ఇచ్చే భోళాతనం శివుని సొంతమని, శ్రీవాదాన్ని చాటిన ఆదిదేవుడు శివుడని, ఆ శివపార్వతులు జగతికి తల్లిదండ్రులని..వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యవంతమైన జీవితంలో గడపాలని ఆకాంక్షించారు.
Feb 19 2023, 08:36