అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఏటిడిఓ ఇంచార్జీ డిటిడిఓ ను ఉద్యోగం నుంచి తొలగించాలి
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నిర్మల్ ఏటిడిఓ ఇంచార్జి డిటిడిఓ శ్రీనివాస్ రెడ్డిని ఉద్యోగం నుండి తొలగించాలి
పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలి
గత జూన్ నుండి హాస్టల్ లో పెట్టుబడి పెట్టిన హాస్టల్ వార్డెన్ లకు హెడ్ మాస్టర్ లకు బడ్జెట్ కేటాయించి బిల్లులు చెల్లీంచాలి
టెండర్ లు వేసి హాస్టల్ కు సామాగ్రి సప్లైయి చేయాలి
లేని ఏడల ఆందోళన చేస్తామని గవ్వల శ్రీకాంత్ డిమాండ్
Street Buzz news నిర్మల్ జిల్లా:
(దస్తురాబాద్):- తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటి విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ గిరిజన ఆశ్రమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఆకస్మాత్తుగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల్ మల్లపూర్ లో గల బాలుర హాస్టల్ కు వెళ్లి వారితో మాట్లాడారు. మరియు హెచ్ ఎం కమ్ వార్డెన్ గారితో వారి వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం సమయం కావడం వలన విద్యార్థులకు పెట్టే భోజనం విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ భోజనం చేశారు. విద్యార్థులకు పెట్టె భోజనం రోజు వారి మెను ప్రకారం పెట్టడం జరిగింది. విద్యార్థులు కూడ ఎప్పుడు ఇదే విదంగా వంట చేస్తారని వారితో చెప్పారు. మెను ప్రకారం భోజనం పెట్టడం వలన విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మరియు టెండర్ వేయకుండా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గవ్వల శ్రీకాంత్ హెచ్చరించారు. మరియు నిర్మల్ ఎటిడీఓ ఇంచార్జి డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్లలో పరివేక్షణ చేయకుండా ప్రతి రోజు రాత్రి పగలు తేడా లేకుండ తప్ప తాగి డ్యూటీ చేస్తూ ఆఫీస్ కు వస్తూ కింది అధికారులను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతు ప్రతి నెల ఒక విద్యార్థికి కమిషన్ లాగా పది శాతం లంచం ఇవ్వాలని మరియు కనీసం నెలకు ఒక హాస్టల్ నుండి పది వేలు తగ్గకుండ ఇవ్వాలని డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి వార్డెన్ లను హెచ్ ఎం లను వేధింపులకు గురిచేస్తే డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి వలన మానసిక ఒత్తిడి తట్టుకోలేక పెట్టిన పెట్టుబడి బిల్లులు రాక ఇద్దరు అధికారులు అనగా పీజి హెచ్ ఎం సుభాష్ హాస్టల్ వార్డెన్ పి నారాయణ ఇద్దరు మృతి చెందినారని కావున ఈ అధికారి పై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి అవసరమైతే శ్రీనివాస్ రెడ్డి పై హత్యనేరం కేసు పెట్టాలని ఉద్యోగం నుండి తొలగించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.అదేవిదంగా కొంత మంది వార్డెన్ లు హెచ్ ఎం లు కూడ వర్కర్లను విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. వార్డెన్ లు హెచ్ ఎం లు వారి పద్ధతులు మార్చుకోవాలని కోరారు. డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి పై ట్రైబల్ వేల్పర్ కమిషనర్ గారికి ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారికి సెక్రెటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి పిఓ గారికి గిరిజన శాఖ మంత్రి గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సీ ఎం గారికి వినతి పత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పంపి త్వరలో కలిసి వినతి పత్రాలు ఇస్తున్నట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు.
Feb 17 2023, 08:27