వైద్య సేవలు రోగుల హక్కులు.. యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్.
వైద్య సేవలు రోగుల హక్కులు..
యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్,
ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్.
నల్గొండ జిల్లా :
సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగ దారులే అందరూ తమ అవసరాల కోసం అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ధరలలో తేడాలు, కల్తీ, తూనికలు, కొలతలలో మోసాలు వంటివెన్నో జరుగుతుంటాయి వినియోగదారులకు చట్ట పరిజ్ఞానం లేనందు వల్ల నష్టపోతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పొందే సేవల్లో లోపం ఉంటే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు వర్తించదు కానీ వైద్యంలో నిర్లక్ష్యం చూపితే డాక్టర్‌పై సివిల్ కోర్టులో కేసు నమోదు చేసుకోవచ్చు.
రోగానికి సంబంధించిన సమాచారం కోరొచ్చు. మందుల పట్టికకు సంబంధించిత సమాచారం చికిత్సకు సంబంధించిన వివరాలను పొందే హక్కు ఉంటుంది
మార్కెట్ నుంచి ఏ వస్తువునైనా కొనేటప్పుడు ఐఎస్‌టీ, అగ్‌మార్క్ ముద్ర ఉన్న వస్తువులనే కొనాలి. కల్తీ జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. ఫోరాల పరిధిలోకి వచ్చే వివాదాలు, అంశాలు వస్తు సేవల నాణ్యతా ప్రమాణాలలో లోపాలు, వ్యత్యాసాలు, తేడాలు వస్తు, సేవల ప్యాకేజీల ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు బస్డాండ్స్, రైల్వేస్టేషన్స్, సినిమా హాళ్లలోనూ వస్తు, సేవల ప్యాకేజీ మీద ముద్రించిన రేటుకే అమ్మాలని చట్టం శాసిస్తోంది. అలా కాకుండా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికల, కొలతల శాఖవారి టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-333కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందొచ్చు ఆ ఫిర్యాదును వారం రోజలలోపు విచారించి పరిష్కరిస్తుంది.
Feb 11 2023, 17:30