విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.
Street Buzz news నల్గొండ జిల్లా:
 నకిరేకల్):- విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ, NSUI విద్యార్థి సంఘాల నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ మైనార్టీ స్కూల్ ను కట్టంగూర్ కు తరలించొద్దని ఆ పాఠశాల అద్దె భవనంలో మగ్గుతోందని వెంటనే సొంత భవనం నిర్మించాలని డిగ్రీ, బీసీ గురుకుల.మైనార్టీ గురుకుల పాలిటెక్ని, ఐటిఐ కళాశాలను నకరేకల్ లో నిర్మించాలని డిమాండ్ చేశారు,లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ లోని విద్యారంగా సమస్యలు ఏం పరిష్కరించిండు నకిరేకల్ నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ నాయకుడు గద్దపాటి రమేష్, నియోజకవర్గ కోశాధికారి కొవ్వూరి రంజిత్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, విజయ్, సందుపట్ల శృతి విద్యార్థి యూనియన్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Feb 11 2023, 11:24