ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్: టి.ఎన్.సి.ఆర్.సి రాష్ట్ర వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకులు యంగలి గోపి.

ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్: 

టి.ఎన్.సి.ఆర్.సి రాష్ట్ర వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకులు యంగలి గోపి గౌడ్

Street buzz న్యూస్ నల్గొండ జిల్లా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్ర‌వేశ‌ పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టి.ఎన్.సి.ఆర్.సి రాష్ట్ర వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకులు యంగలి గోపి గౌడ్ .,

ఈ బడ్జెట్‌ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందంటూ కొనియాడారు.  

తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తూ, మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం సంతోషకరమని, దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు.

ఉదయ సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలంటూ రిలే నిరాహార దీక్ష

ఉదయ సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలంటూ రిలే నిరాహార దీక్ష  

Street Buzz news నల్గొండ జిల్లా:

 ;(నకిరేకల్):- వందల కోట్ల రూపాయలతో గత ప్రభుత్వాలు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లంల ఉదయసముద్రం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేసి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఆదివారం రిలే నిరాహార దీక్ష నార్కట్ పల్లి పోలీస్ కాంప్లెక్స్ దగ్గర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం ఉదయ సముద్రం మూడు నెలల్లో పూర్తి అవుతుందని మాట్లాడిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడానికి ఏ పని ప్రారంభించకపోవడం చూస్తే ప్రజలను మభ్య పెట్టడానికే ఇలాంటి బూటకపు వాగ్దానాలు, అదేవిధంగా మాయమాటలు చెపుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత ప్రాజెక్టుల రీడిజన్ పేరిట లక్షల కోట్ల రూపాయల  దుర్వినియోగం జరిగిందని ఒక ఎకరాకు కూడా కనీసం ఈ ప్రాంతంలో నీరు అందించలేనటువంటి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి విమర్శించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటికీ ఇప్పటి రెండు దశాబ్దలైన పూర్తి కానటువంటి ఏకైక ప్రాజెక్ట్ గా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ మిగిలిపోనుందని తెలియజేశారు. అభివృద్ది అంటే రోడ్ల వెడల్పులు, రోడ్లు వేయడం విధి దీపాలు వెయ్యడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడమే గొప్ప అనుకుంటున్నటు వంటి ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని విమర్శించారు. విద్యా వ్యవస్థకు సంబంధించి నకిరేకల్ నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి ఏంటో చెప్పాలని వైద్య వ్యవస్థలో, ఉపాధికి సంబంధించిన అభివృద్ధి కాని ఒక కంపెనీ, ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఈ నియోజకవర్గంలో వచ్చినయో తెలియజేయాలన్నారు. ఉదయ సముద్రం విషయంలో ఎంతోకాలంగా రైతులందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి, కాల్వలు లేనటువంటి దుస్థితి పోవాలన్నారు. ఈ ప్రాంతానికి ఎట్టి పరిస్థితిలోనూ ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప అభివృద్ధి జరగదు అన్నారు. కొద్దిపాటి నిధులు మాత్రమే కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల పాటు చోద్యం చూస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్ఎస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అదే విధంగా నకిరేకల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే కు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కూమార్, మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధ్యక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,కోశాధికారి గట్టు రమేష్, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, మేడి శ్రీను, గ్యార శేఖర్, మేడి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.