Andrapradesh

May 05 2021, 08:21

కర్ఫ్యూపై ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
 


ఈ నెల 18 వరకు కర్ప్యూ కొనసాగుతుందన్న ప్రభుత్వం


 మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు మూసివేత


కర్ఫ్యూ నుంచి పలు విభాగాలను మినహాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు


కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు


కర్ఫ్యూ నుంచి టెలికామ్‌, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపు


కర్ఫ్యూ నుంచి బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లకు మినహాయింపు

కర్ఫ్యూ నుంచి విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు 

నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు

విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని ప్రభుత్వం ఆదేశం

కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు

రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశం


వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు


ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకునేందుకు అనుమతి తప్పనిసరి


వివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆంక్షలు


రోజంతా 144 సెక్షన్ అమలుచేయాలని ఆదేశాల్లో తెలిపిన ప్రభుత్వం


కరోనా ఆంక్షలు అమలుచేయాలని కలెక్టర్లు, విభాగ అధిపతులకు ఆదేశం

Andrapradesh

May 04 2021, 16:18

ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు!
 

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలకంగా చర్చించారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ఎలా అమలు చేయాలి? విధివిధానాలేంటి? అనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. 

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. సరిపడా పడకలు లేక కొందరు చనిపోతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కొరతను ఎలా అధిగమించాలనే అంశంపైనా చర్చించారు. సుమారు 50 వేల బెడ్‌ల వరకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఆక్సిజన్ సమస్యపై చర్చ జరగ్గా.. తగిన ఆక్సిజన్‌ ఉన్నప్పటికీ రవాణాకు ట్రక్కుల కొరత వేధిస్తోందని, అందుకే సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్‌ అందడంలో జాప్యం జరుగుతున్నట్టు మంత్రులు సీఎంకు తెలిపినట్టు సమాచారం. దీంతో విదేశాల నుంచి కూడా ట్రక్కులు కొనుగోలు చేయాలనే అంశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ అంశంపైనా కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేందుకు వీలుగా నిధుల కేటాయింపుపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలో టీకా కొరత ఉండటంతో భారీగా కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లపైనా చర్చించారు. వీటితో పాటు రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కొనుగోళ్లపైనా చర్చ జరిగింది. టూరిజం శాఖకు సంబంధించి పలు అంశాలపైనా కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ సాయంత్రం 4గంటలకు మంత్రి పేర్నినాని కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు. కర్ఫ్యూ ఎలా అమలు చేయబోతున్నారు? విధివిధానాలు ఏమిటి అనే అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు.

Andrapradesh

May 04 2021, 14:55

దాసరికి పద్మపురస్కారం-ట్విట్ తో కేంద్రానికి చిరు విన్నపం
 


ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావుకి ప‌ద్మ పుర‌స్కారం ఇవ్వాల‌ని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్ర‌భుత్వానికి ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. దాస‌రి నారాయ‌ణరావు గారి జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు త‌న‌ స్మృత్యంజ‌లి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. 'విజ‌యాలలో ఒక‌దానికి మించిన చిత్రాల‌ను మరెన్నో త‌న అపూర్వ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మ‌ల‌చ‌డ‌మే కాదు.. నిరంత‌రం చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ మార్గ‌ద‌ర్శ‌క‌మే. శ్రీ దాస‌రికి ఇప్ప‌టికీ త‌గిన ప్ర‌భుత్వ‌ గుర్తింపు రాక‌పోవ‌డం ఒక తీర‌ని లోటు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Andrapradesh

May 04 2021, 14:53

ఏపీలో రేపటి నుంచి ఆటోలు, సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌
 


ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు.

ఏపీలో కరోనా కేసుల కల్లోలం దృష్ట్యా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజా రవాణాకు కూడా అనుమతించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయబోతోంది. అంటే గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయడం, ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తున్నారు. రేపటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Andrapradesh

May 04 2021, 09:07

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులు 
 
అమరావతి : రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో బుధవారం నుంచి రోజంతా కర్ఫ్యూ విధించాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వర్తక, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించాలని.. ఇదే సమయంలో 144 సెక్షన్‌ అమలు చేయాలని స్పష్టం చేశారు. జనజీవనానికి ఇబ్బంది లేకుండా పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.


ఈ సమావేశంలో బుధవారం నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను విధించాలని ఆయన పేర్కొన్నారు. షాపులను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరవాలని.. మధ్యాహ్నం తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతివ్వాలని ఆదేశించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. రెండువారాల పాటు ప్రయోగాత్మకంగా ఈ ఆంక్షలు అమలు చేయాలన్నారు. వైరస్‌ బాధితుల వైద్య సేవల కోసం అవసరమైన ఆక్సిజన్‌ స్టోరేజీకి అన్ని ఏర్పాట్లూ చేయాలని.. కొరత రాకుండా చూసుకోవాలని.. అన్ని ఆస్పత్రుల్లోని రోగులకు సరిపడా దిగుమతి చేసుకుని.. నిల్వకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైనన్ని ట్యాంకర్లను సేకరించాలని ఆదేశించారు. పాజిటివ్‌ వచ్చిన వారితో పాటు వారి ప్రైమరీ కాంటాక్టులను కూడా గుర్తించి.. పరీక్షలు నిర్వహించాలని.. ఇది పక్కాగా జరగాలన్నారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌లో ఉన్న ఆస్పత్రుల్లోనూ వైద్యులు, సహాయ సిబ్బంది కొరత ఉండకూడదన్నారు. 

16.6 లక్షల పరీక్షలు..

రాష్ట్రంలో నెలకు సగటున 3,10,915 పరీక్షలు చొప్పున ఇప్పటి వరకూ1660873 కొవిడ్‌ పరీక్షలు జరిపామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం 558 కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయని.. వాటిలో 44, 599 బెడ్లు ఉన్నాయని చెప్పారు. ‘ఆ ఆస్పత్రుల్లో 37,760 మంది చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్లపై 3,597 మంది పేషెంట్లు ఉన్నారు. హోం ఐసొలేషన్‌లో 1,01,304 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 81 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 41,780 బెడ్లు ఉండగా.. వాటిలో 9,937 మంది చికిత్స పొందుతున్నారు.

 • Andrapradesh
   @Andrapradesh ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రానికి కేంద్రం 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటాను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నాం. మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 5 లక్షల రెడ్‌మి్‌సవిర్‌ ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం. 5,67,844 ఎన్‌95 మాస్కులు, 7,67,732 పీపీఈ కిట్లు , 35,46,100 సర్జికల్‌ మాస్కులు, 2,04,960 హోం ఇసోలేషన్‌ కిట్లకు ఆర్డర్‌ చేశాం’ అని వివరించారు. 45 ఏళ్ల పైబడినవారిలో ఇప్పటివరకూ 52 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు.
  
  మళ్లీ సీల్డ్‌ కవర్లలోనే కేబినెట్‌ అజెండా
  
  రెండువారాల ప్రయోగాత్మక కర్ఫ్యూ.. ఆ తర్వాత తీసుకోవలసిన చర్యలపై చర్చించడమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరగనున్నది. వాస్తవానికి గత నెల 22న ఈ భేటీ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో 29వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు కూడా జరగలేదు మళ్లీ మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులెవరూ కేబినెట్‌ భేటీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత మంత్రివర్గ సమావేశంలో .. కేబినెట్‌ అజెండా అంశాలు సామాజిక మాధ్యమాల్లోనూ.. అధికార పార్టీ అనుకూల మీడియాలోనూ ముందే ప్రసారం కావడంపై సీనియర్‌ మంత్రి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-కేబినెట్‌ విధానం వల్లే అజెండా బయటకు పొక్కుతోందన్న అభిప్రాయం రావడంతో.. మంగళవారం నాటి కేబినెట్‌ భేటీ నుంచి పాత సీల్డ్‌ కవర్‌ విధానంలోనే అజెండా పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సమావేఽశానికి ముందు మంత్రులకు అజెండా కవర్లు అందజేస్తారు. 
Andrapradesh

May 04 2021, 08:59

కృష్ణ జిల్లా
 


విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు..

రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం..

విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతి..

కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్ కు మాత్రమే అనుమతి..

స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్ద నిలుపుదల..

ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా..

ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు..

పాజిటివ్ నిర్దారణ అయిన ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించేలా చర్యలు చేపట్టనున్న అధికారులు..

Andrapradesh

May 03 2021, 14:51

మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత...
 
టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న సబ్బం హరి గతంలో విశాఖ మేయర్ గానూ పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

అప్పట్లో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఓ దశలో ఓదార్పు యాత్రలో జగన్ వెంటే నడిచారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను రాజకీయాలకు దూరం చేశాయి. ఆపై టీడీపీలో చేరారు. కొన్నివారాల కిందట కరోనా బారినపడిన ఆయన మొదట ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ లక్షణాలు తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. కానీ చికిత్స పొందుతుండగా, ఇటీవల పరిస్థితి విషమించింది. అప్పటినుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది.

Andrapradesh

May 03 2021, 14:48

హాస్పిటల్ బెడ్ పైనే మృతదేహం
 


వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామానికి చెందిన 55 సంవత్సరాల కోట మార్తమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం.....

నిన్న సాయంత్రం చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు.....

హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం వచ్చిన మార్తమ్మ కు కరోనా టెస్ట్ చేయించిన హాస్పిటల్ సిబ్బంది.....

చికిత్స చేస్తుండగా మృతి చెందిన మార్తమ్మ.....

మృతి చెందిన మార్తమ్మ మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యులు.....

నిన్నటి నుండి హాస్పిటల్ బెడ్ పైనే ఉన్న మార్తమ్మ మృతదేహం.....

ఇటు కుటుంబ సభ్యులు కాని అటు హాస్పిటల్ సిబ్బంది కాని మార్తమ్మ మృతదేహాన్ని పట్టించుకోని వైనం.....

కరోనా రిజల్ట్ వచ్చిన తర్వాతనే తీసుకువెళ్తామంటున్న కుటుంబ సభ్యులు.....

Andrapradesh

May 03 2021, 14:46

అమరావతి
 


రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం

ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు. పాక్షిక కర్ఫ్యూ అమలు

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు

ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే

రెండు వారాల పాటు ఆంక్షలు అమలు

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు. 

ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలు..

Andrapradesh

May 03 2021, 14:40

అలా చేస్తే ఏపీలోని ఆసుప‌త్రుల్లో ఇంత‌మంది ఊపిరి ఆగిపోయేది కాదు: లోకేశ్
 


ప్ర‌భుత్వం ఆధిప‌త్య రాజ‌కీయాల‌పై చూపించే శ్ర‌ద్ధ ప్ర‌జ‌ల ఆరోగ్యంపై చూపాలి
ప్ర‌తిప‌క్ష‌నేత‌ల్ని క‌క్ష‌గ‌ట్టి అరెస్ట్ చేయించేందుకు యంత్రాంగాన్ని వాడుతున్నారు
ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు వారిని వాడితే బాగుంటుంది
దొంగ ఓట్లు వేయించుకోవ‌డంపై పెట్టిన శ్ర‌ద్ధ ఆక్సిజ‌న్ అందించ‌డంపై పెట్టాలి
క‌రోనా వేళ వైసీపీ ప్ర‌భుత్వం త‌మ శ్ర‌ద్ధ‌ను రాజ‌కీయాల‌పై కాకుండా ప్ర‌జ‌ల ఆరోగ్యంపై చూపితే బాగుంటుందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ప్ర‌భుత్వం ఆధిప‌త్య రాజ‌కీయాల‌పై చూపించే శ్ర‌ద్ధ, ప్ర‌జ‌ల‌కు ఆక్సిజ‌న్ అందించడంపై చూపెడితే హిందూపురం ఆసుప‌త్రిలో 8 మంది చ‌నిపోయేవారు కాదు. ప్ర‌తిప‌క్ష‌నేత‌ల్ని క‌క్ష‌గ‌ట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు వాడితే క‌ర్నూలు ఆసుప‌త్రిలో ఆరుగురి ఊపిరి ఆగిపోయేది కాదు' అని లోకేశ్ చెప్పారు. 'అధికారులు, పోలీసులు, వాలంటీర్లను వాడుకుని తిరుప‌తి ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేయించుకోవ‌డంపై పెట్టిన శ్ర‌ద్ధ ప్రాణ‌వాయువు అందించే దానిపై పెట్టి వుంటే అనంత‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో 10 మంది చ‌నిపోయేవారు కాదు' అని లోకేశ్ ట్వీట్ చేశారు. 'టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడుని ఏదో ఒక అక్ర‌మ‌కేసు పెట్టి అరెస్ట్ చేయించాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు, ఉత్త‌రాంధ్ర‌లోని ఆసుప‌త్రులలో మెరుగైన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై పెట్టి వుంటే విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ అంద‌క కొవిడ్ పేషెంట్లు చ‌నిపోయి వుండేవారు కాదు' అని లోకేశ్ చెప్పారు. 'ప్ర‌జ‌లకి ర‌క్ష‌గా ఉంటావ‌ని ఎన్నుకుంటే, ప్ర‌తిప‌క్షంపై క‌క్ష తీర్చుకుంటున్నావు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న‌ నిన్ను నువ్వు న‌మ్ముకున్న‌ దేవుడు కూడా క్ష‌మించ‌డు వైఎస్ జ‌గ‌న్. హిందూపూర్ ఘటన పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వ హత్యలకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలి' అని లోకేశ్ తెలిపారు.