Andrapradesh

Jun 29 2020, 12:19

నిండు గర్భిణీ మృతుదేహాన్ని చెట్టుకు కట్టేసి

నిండు గర్భిణీ... మరి కొద్ది రోజుల్లో బిడ్డ పుడతాడని కుటుంబంలోని వారంతా ఎంతో సంబరపడ్డారు. కానీ... ఆశలన్నీ అడయాశలయ్యాయి. బిడ్డ కడుపులో ఉండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ గర్భంలో ఉండగా చనిపోయిందని.. అంత్యక్రియలకు కూడా గ్రామస్థులు అంగీకరించలేదు. దీంతో.. కుటుంబసభ్యులు.. ఆమె మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి వచ్చారు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన లావణ్యను శుక్రవారం రాత్రి ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.

అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది.

మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. అంత్యక్రియలకు గ్రామస్థులు అంగీకరించలేదు. గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమంటూ అడ్డుపడ్డారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని ఓ వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద మృతదేహాన్ని కూర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి వచ్చారు

స్థానికులు పనులకు వెళ్తూ ఆమె మృతదేహాన్ని చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల మూఢనమ్మకాల కారణంగా.. కనీసం ఆమెకు అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Andrapradesh

Jun 29 2020, 11:50

మద్యం మత్తులో యువకుడి హల్చల్  

 తిరుపతి 

  తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించి పోలీసుల కి చుక్కలు చూపించాడు. చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు విషయం తెలుసుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఏ.ఎస్.ఐ రోహిణి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆ యువకుడిని క్షేమంగా దింపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఏ ఏ ఎస్ఐ రోహిణి ఆ యువకుని విచారించగా తన పేరు బాబు అని తన నాన్న పేరు వీర మణి కుంభకోణం స్వస్థలం అని చెప్పాడు. అనంతరం ఆ యువకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Andrapradesh

Jun 29 2020, 11:10

శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తితిదే ఇవాళ విడుదల చేయనుంది. 


  జులై నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. 

  రోజుకు తొమ్మిది వేల టికెట్ల చొప్పున తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. 

tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లను పొందాలని తితిదే అధికారులు సూచించారు.

  సాధారణ భక్తుల కోసం ఉచిత టైంస్లాట్ టోకెన్లు తిరుపతిలో ఇవ్వనున్నాను. 

  శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులకు టోకెన్లు జారీచేయనున్నారు. 

రోజుకు మూడు వేల చొప్పున ఒక రోజు ముందు టోకెన్లు జారీ చేయనున్నారు. 

జులై 1వ తేదీన దర్శనం కోసం ఈ నెల 30న టోకెన్లు జారీచేస్తారు.

Andrapradesh

Jun 28 2020, 18:10

క్లాస్‌మేట్‌ను గ‌ర్భవతిని చేసిన టెన్త్ విద్యార్థి..

టీనేజ్ స‌మ‌యంలో పేరెంట్స్ పిల్ల‌ల‌ను ఓ కంట క‌నిపెడుతూనే ఉండాలి.. ఎందుకంటే ఆ స‌మ‌యంలో వారి వ‌య‌సు పెడ దోవ‌లవైపు ఆక‌ర్షిస్తుందన్న విషయం తెలిసిందే..స‌రైన కేర్ తీసుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది..

తాజాగా గుంటూరు జిల్లాలో క్లాస్‌మేట్‌ను ప్రేమ పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు ఓ టెన్త్ సూడెంట్. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.
వివ‌రాల్లోకి వెళ్తే..

అమృతలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు జిల్లా పరిష‌త్ ఉన్న పాఠ‌శాల‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చదువుతున్నాడు. అదే స్కూల్‌లో ఓ బాలిక కూడా టెన్త్ క్లాస్ చదువుతోంది. 

ఆమెపై కన్నేసిన బాలుడు… ప్రేమ పేరుతో బాలిక వ‌ద్ద చనువు పెంచుకున్నాడు. చదువు పూర్తయి ఉన్న‌త స్థాయికి వెళ్లాక మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడు.
అయితే ఇటీవల బాలిక శరీరంలో మార్పులు రావ‌డంతో.. ఆమె తల్లి నిల‌దీయ‌గా అస‌లు విష‌యం చెప్పింది. దీంతో కుమార్తెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా గర్భంతో ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారు. 

దీంతో బాలిక త‌ల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ‌ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు మైనర్ కావడంతో అతడి వివరాలు బయటకు వెల్ల‌డించలేదు.

Andrapradesh

Jun 28 2020, 16:41

ప్రపంచంతో పోటీపడే స్థాయికి దేశాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి పీవీ
 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా... బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. తన జాతి ప్రజలను సంక్షోభం నుంచి గట్టెక్కించిన నాయకులను చరిత్ర మరచిపోదన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పీవీ ఆర్థికరంగానికి దిశానిర్దేశం చేశారని... ప్రపంచంతో పోటీపడే స్థాయికి దేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పీవీ నిలిచిపోయారని చంద్రబాబు కొనియాడారు. సాహితీవేత్తగా కూడా తెలుగుజాతికి పీవీ తనదైన ముద్రవేశారన్నారు.

Andrapradesh

Jun 28 2020, 16:40

జనసేన పార్టీ నేతలు పోతున మహేష్,అక్కల గాంధీ కామెంట్స్...

కాపు సామాజిక వర్గం పై జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారు.

కాపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు.

జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్లుగా కాపులకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

2000 కోట్ల రూపాయలు కాపులకు కేటాయించి కేవలం 400 వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు.

కాపులకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీలో ఉన్న కాపుమంత్రులు,ఎమ్మెల్యేలు,స్పందించకుండా ఉంటే మీరు చరిత్ర హీనులు అవుతారు.

 కాపు అభివృద్ధి,సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం.

వైసీపీ కాపు నేతలు ప్రశించాల్సింది పవన్ కళ్యాణ్ ని కాదు జగన్మోహన్ రెడ్డిని.

కాపులకు తప్పనిసరిగా 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే.

లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు జనసేన సిద్ధం.

Andrapradesh

Jun 28 2020, 16:39

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి : సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి :

 భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా పీవీ గొప్పతనాన్ని వెల్లడించారు. 'పీవీ నరసింహారావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త, రాజనీతిజ్ఞులు, బహుభాషా పండితుడు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిన సందర్భంలో ప్రధాని పదవి చేపట్టిన పీవీ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. దేశాన్ని ఆర్ధిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని భవిష్యత్తు తరాల వారు కూడా గుర్తుంచుకుంటారు.' అంటూ పేర్కొన్నారు.

Andrapradesh

Jun 28 2020, 14:17

కేంద్ర హోంశాఖకు రఘురామ వినతి.!

రాజ్‌నాథ్‌, కిషన్‌ రెడ్డిలతో భేటీ.!!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. 

హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని, కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాను కూడా కలిశారు. 

తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వారికి విజ్ఞప్తి చేశారు.

 ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి రాజ్‌నాథ్‌కు ఆయన వివరించినట్లు తెలిసింది.

 అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 వారం రోజుల్లో తనకు భద్రత కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

 ‘‘నేను మా పార్టీని, సీఎంను" కలలో కూడా ఒక్క మాటా అనలేదు.

 సూచనలు చేశాను కానీ... విమర్శలు చేయలేదు. 

ఇసుక మాయమైందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారని, దానిపైనే చర్యలు తీసుకోవాలని సూచించాను. 

టీటీడీ భూములు విక్రయిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పాను. 

ఒక భక్తుడిగా టీటీడీ బోర్డు నిర్ణయంతో విభేదించాను. 

టీటీడీ చైర్మన్‌ అయిన వైవీ సుబ్బారెడ్డి మా జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా ఉండటంతో... నేను తిరుగుబాటు చేస్తున్నానని కొందరు ఎమ్మెల్యేలు దూషించారు. 

నా దిష్టి బొమ్మలు తగలబెట్టడంపై  పోలీసులకు ఫిర్యాదు చేశాను.

 ఎస్పీకి విజ్ఞప్తి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. 

బెదిరింపు కాల్స్‌ కూడా వస్తుండడంతో రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Andrapradesh

Jun 28 2020, 14:16

అనంతపురంలో యువతుల కిడ్నాప్ కలకలం

★ అనంతపురం జిల్లాలో యువతుల కిడ్నాప్ కలకలం రేపింది. 

★ శింగనమల మండలం లోలూరు గ్రామంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. 

★ గ్రామంలోని ఇద్దరు అమ్మాయిలను.. స్థానికంగా ఉన్న వాలంటీర్లు కిడ్నాప్ చేశారన్న వార్తలు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. 

★ గ్రామంలో టైలరింగ్‌ చేసే ఇద్దరు అమ్మాయిలు బయటకెళ్లిన సమయంలో…స్థానికంగా ఉండే ముగ్గురు వాలంటీర్లు, మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి అడ్డగించారు. 

★ మత్తుమందు కలిపిన గుడ్డను నోటికి అడ్డంపెట్టి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. 

★ అయితే దుండగుల నుంచి తప్పించుకుని వచ్చిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

★ సినీపక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

★ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

★ కిడ్నాప్‌ చేసిన వ్యక్తుల నుంచి ప్రాణపాయం ఉందని… తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోయారు.

Andrapradesh

Jun 28 2020, 14:14

ఏపి హెల్త్ బులిటెన్ విడుదల

గడిచిన 24 గంటల్లో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు.. 

కరోనా పాజిటివ్ తో కొత్తగా 12 మృతి 

కృష్ణా జిల్లా లో 5, కర్నూల్ జిల్లా లో 6, గుంటూరు 1, పశ్చిమ గోదావరి 1మృతి

రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 755

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 58 మందికి కరోనా నిర్ధరణ 

 దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13098

గడిచిన 24 గంటల్లో మొత్తం 25778 శాంపిల్స్‌ పరీక్ష

ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 169

కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. 

813 పాజిటివ్ కేసులతో 12 మరణాలతో ఈ మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందీ

కడప కర్నూలు లలో అత్యధిక కేసులు నమోదు కావడం జరిగింది

కర్నూలులో ఆరు కృష్ణ లో ఐదు మరణాలు.

అందరం పరిస్థితిని అవగాహన చేసుకుని సాధ్యమైనంత వరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రాకుండా 

బయట ఉన్న కరోనా ని ఇంట్లోకి తెచ్చుకోకుండా ఉండవలసిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.

టెస్టులు విషయంలో, ఆసుపత్రి, వైద్య విషయంలో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా

 మన అజాగ్రత్త వలన ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది.

భౌతిక దూరం , మాస్కులు ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండటం మాత్రమే ఈ కరోనా వ్యాప్తిని అరికట్ట గలవు.