Andrapradesh

May 21 2020, 14:36

లోకేశ్‌ను వేధించిన పోలీస్ అధికారిపై చర్య తీసుకోవాలి: పవన్

అమరావతి: జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేశ్‌ను ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన లోకేశ్ పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసి బాధపడ్డానన్నారు. పోలీసులు ప్రజలకే జవాబుదారీ అని... అధికార పక్షానికి కాదన్నారు. ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసు వేధింపులా? అని పవన్ ఫైర్ అయ్యారు. 
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. లోకేశ్‌ను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘు వేధించడం వల్లే ప్రాణం తీసుకోవాలనుకొన్నాడని తెలిసిందన్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా? అని ప్రశ్నించారు. లోకేశ్‌కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు తెలిపానన్నారు. పోలీసు వేధింపులు, అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య ధోరణిలో పోరాడాలన్నారు. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు... ఈ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందాతోపాటు ఇతర అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా నేతలకు పవన్ సూచించారు.

Andrapradesh

May 21 2020, 13:53

ఉద్యోగులకు శుభవార్త..ఈ నెల నుంచి ఫుల్ శాలరీ..బకాయిలపై..

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతామే చెల్లించారు. గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా సగం జీతాలు మాత్రమే తీసుకుంటున్న ఎంప్లాయిస్ కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఊరట నిచ్చింది. జీతాలు, గత రెండు నెలల బకాయిలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
దేశంలో లాక్‌‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ..ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లించారు. గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అటు ఉద్యోగులకు జీతాలు కట్ చేయడంపై హైకోర్టులో ఒక ఉద్యోగి పిటిషన్ వేయగా… దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

Andrapradesh

May 21 2020, 13:48

కాపురంలో కలహాలు.. కన్నబిడ్డలను చంపి విషం తాగిన మహిళ

వరంగల్‌ ఆశ్రమంలో పెరిగిన ప్రీతి అనే అనాథ మహిళను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన గోపీనాథ్‌ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో గొడవల కారణంగా విసిగిపోయిన ప్రీతి కఠిన నిర్ణయం తీసుకుంది.

భర్తతో తరుచూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపం చెందిన మహిళ ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపేసి.. తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన గోపీనాథ్‌.. వరంగల్‌ జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో పెరిగిన ప్రీతి అనే యువతిని ప్రేమించాడు. ఆశ్రమం పెద్దలను ఒప్పించి ఆరేళ్ల క్రితం ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు ప్రస్తుతం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌లో ప్రజయ్‌ హోమ్స్‌లో అద్దెకు ఉంటున్నారు. గోపీనాథ్‌ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి గౌరవ్‌(4), కౌశిక్‌(3) సంతానం.

కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన ప్రీతి ఇద్దరు పిల్లలను తీసుకుని తాను పెరిగిన అనాథాశ్రమానికి వెళ్లిపోయింది. ఇటీవల అక్కడికి వెళ్లిన గోపీనాథ్ ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉంటామని చెప్పి, ఆశ్రమ నిర్వాహకులను ఒప్పించి భార్యను తీసుకొచ్చాడు. అయితే మంగళవారం భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో విరక్తి చెందిన ప్రీతి బుధవారం ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తాను కూడా తాగింది. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన భర్తకు ప్రీతి విషయం చెప్పడంతో అతడు భార్యా, బిడ్డలను మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిల్లలు గౌరవ్, కౌశిక్ చనిపోగా.. ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది.

Andrapradesh

May 21 2020, 12:04

పోలీస్ స్టేషన్‌లో జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎమ్మెల్యే  కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారనే కారణంతో నిన్న రాత్రి పోలీసు స్టేషన్‌లో పురుగు మందు తాగి లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. రెడ్ జోన్ పరిధిలో ఆసుపత్రి ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు యత్నిస్తుండగా.. దానికి అధికారులు అంగీకరించడం లేదు. ఈ విషయమై కాసేపట్లో జనసేన నాయకులు మీడియాతో మాట్లాడనున్నారు.

Andrapradesh

May 21 2020, 09:56

ఆంధ్రప్రదేశ్ఏపీ డీసెట్‌ నోటిఫికేషన్‌

అమరావతి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(డీసెట్‌-2020) నోటిఫికేషన్‌ విడుదలైంది. 2020-22 విద్యా సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని గవర్నమెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌(డైట్స్‌), ప్రైవేట్‌ ఎలిమెంటరీ టీచర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆఫర్‌ చేసిన రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీసెట్‌-2020 కన్వీనర్‌ కోరారు. https://apdeecet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా బుధవారం నుంచి జూన్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Andrapradesh

May 21 2020, 09:44

లాక్‌డౌన్‌ 4.0.. ఇవాళ్టి నుంచి ఇవి ఓపెన్...!

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ 3.0 ముగిసింది.. మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని న‌రేంద్ర మోడీ.. దేశ‌మంతా లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు 21 రోజుల పాటు తొలి ద‌శ లాక్ డౌన్ అమలు చేశారు.. ఆ త‌ర్వాత క‌రోనా కేసుల సంఖ్య పెర‌గ‌డంతో మే 3 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. మ‌ళ్లీ మే 17 వ‌ర‌కు మ‌రోసారి లాక్ డౌన్ పొడిగించారు.. తాజాగా మళ్లీ మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాక్‌డౌన్‌ పొడిగిస్తూ వస్తూనే.. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి క్రమంగా కొన్ని సడలింపులు ఇస్తూనే వస్తోంది కేంద్రం.. తాజాగా, లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. అయితే, కొన్ని రాష్ట్రాలు యథావిథిగా కేంద్రం నిర్ణయాలు అమలు చేస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించినందున.. మరోసారి కేంద్రం గైడ్‌లైన్స్‌పై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నాయి.. 

 లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు: 

లాక్‌డౌన్‌ ముగియడంతో.. “జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ” (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ . 

 రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం. 

 కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు. 

 రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర సర్వీసులను నడుపుకోవచ్చు. 

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. 

 దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు. 

 మెట్రో రైలు సేవలు అనుమతి లేదు. 

పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి. 

 ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ( ఆన్ లైన్ భోధన)ఎప్పటిలాగే కొనసాగుతాయి. 

 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. 

వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి.*

 • Andrapradesh
   @Andrapradesh ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లకు అనుమతులు. 
  
   బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు. 
  
   సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు. 
  
   రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు. 
  
   మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు.. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు. 
  
   కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే. 
  
   కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి. 
  
  రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి. 
  
   కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు. 
  
  కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అయితే, అత్యవసర వైద్య పరీక్షలు, సేవలు అందించాలి. 
  
  రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు.*
   
Andrapradesh

May 21 2020, 08:05

ఏపీలో ప్రజారవాణా ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత 58 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా ‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ సర్వీసులు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిన్న సాయంత్రం నుంచే మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు (17 శాతం) నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖలోని ద్వారకా బస్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రయాణికులు బారులు తీరారు.

 ప్రస్తుతానికి బస్టాండ్ల మధ్య మాత్రమే బస్సులు నడుపుతున్నారు.  ప్రస్తుతానికి బస్సుల్లో ఎలాంటి రాయితీలు వర్తించడంలేదు. నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తున్నారు. ముందుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే బస్సులోకి అనుమతిస్తున్నారు. అన్ని బస్టాండ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించారు. కౌంటర్‌లో టికెట్‌ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్‌ నంబరు నమోదుచేసుకుంటున్నారు. తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని సూచిస్తున్నారు. దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల్లోపే బస్టాండ్లకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.  సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు.

Andrapradesh

May 20 2020, 19:04

ఆర్టీసీ విలీనం పేరుతో 6వేల మందిని తొలగించారు: చంద్రబాబు

అమరావతి: ఆర్టీసీ విలీనం పేరుతో 6వేల మందిని తొలగించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇకనైనా ప్రజలు మేల్కొనకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. టీడీపీ పోరాటానికి ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా గురువారం టీడీపీ నేతల దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పోరాటం చేసి కరోనాను కట్టడి చేస్తే.. తిక్క సీఎం మద్యం షాపులు ఓపెన్‌ చేయించి మళ్లీ మొదటికి తెచ్చారని ధ్వజమెత్తారు. మద్యం షాపుల్లో టీచర్లతో పని చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఎలా కట్‌ చేస్తారు.. వాళ్లు ఎలా జీవించాలని నిలదీశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

Andrapradesh

May 20 2020, 18:55

వాటిపై రంగులు తొలగించమన్నాం కదా?:ఏపీ హైకోర్టు

అమరావతి: గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 623ను సవాల్‌ చేస్తూ న్యాయవాది సోమయాజులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పంచాయతీ భవనాలపై ఇప్పటికీ వైకాపా జెండాను పోలిన రంగులనే వేస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. రంగుల క్రమం కూడా జెండాను పోలి ఉందని న్యాయస్థానానికి తెలియజేశారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. భవనాలపై ఉన్న రంగులను తీసివేయమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశాం కదా? అని ప్రశ్నించింది. అయితే పంచాయతీ భవనాలకు వేస్తున్న రంగులు ఏ ఉద్దేశంతో వేస్తున్నామో పూర్తి వివరాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగులతో పాటు అదనంగా మరో రంగు కలిపి వేస్తున్నట్లు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Andrapradesh

May 20 2020, 15:49

టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కామెంట్స్.....

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

చిన్న లడ్డూలను 50 నుంచి 25రూపాయలకు తగ్గించిన టిటిడి

ఎల్లుండి నుంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు

ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో లడ్డూలు

శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమయ్యేంత వరకు భక్తులకు అందుబాటులో లడ్డూలు

శ్రీవారి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు ప్రాధాన్యత

ఈ-హుండీ ఆదాయం 2019 సంవత్సరంలో 1.79 కోట్లు

2020 సంవత్సరంలో 1.97కోట్లు ఆదాయం వచ్చింది

భక్తులకు దర్శనం కల్పించలేకపోయినా ఈ-హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించుకున్నారు

ప్రతిరోజు 3నుంచి 4లక్షల లడ్డూలను తయారుచేస్తున్నాం

అధిక లడ్డూలు కావాల్సిన వారు తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓ 9849575952, పోటు పేష్కార్ 9701092777 సంప్రదించవచ్చు

తిరుపతి కోవిడ్-19 ఆసుపత్రికి అవసరమైన మౌళిక వసతులకు టిటిడి పూర్తి సహకారం అందిస్తుంది

శ్రీవారి దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేము