Andrapradesh

May 19 2020, 10:10

వెబ్సైట్ లో ఏపీ పదోతరగతి నమూనా ప్రశ్నా పత్రాలు

ఆంధ్ర ప్రదేశ్ పదోతరగతి పరీక్షలు కరోనా తొ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మిగిలిన పరీక్షలు నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పరీక్షల విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకు ముందు ఒక్కో సబ్జెక్టు లోనూ రెండు పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి అలాకాకుండా ఒకే పరీక్ష నిర్వహించేలా మార్పులు చేశారు. దీంతో పరీక్షా పత్రం ఎలా ఉంటుందో అని విద్యార్థులకు అనుమానాలు ఉండేవి. వాటిని తీర్చడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

వెబ్ సైట్ లో  ఆంధ్రప్రదేశ్ పదో తరగతి నమూనా పత్రాలు 

 పేపరు మార్పులకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నాపత్రాలను దీనిలో చూడవచ్చు. 

 www.bseap.org వెబ్ సైట్ నుంచి ఈ మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.*

Andrapradesh

May 19 2020, 10:08

నెల్లూరు జిల్లా ఘటనపై రష్మీ ఫైర్


నెల్లూరు జిల్లా ఘటనపై యాంకర్ రష్మీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. దీనిని చిన్న విషయంగా చూడకూడదని, ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై వ్యతిరేకంగా గళం వినిపించాలని రష్మీ తన ట్వీట్‌లో పేర్కొంది. ఇంతకీ నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కదా! ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ నిమిత్తం రూమ్స్‌ని రెడీ చేస్తున్న పోలీసులు 6 సంవత్సరాల బాలికతో రూమ్ తుడిపించారు. ఆ బాలిక వాచ్‌మెన్ కుమార్తె అని తెలుస్తుంది. అయితే పోలీసులే చిన్న బాలికతో అటువంటి పని చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠినంగా శిక్షించాలనే చట్టాలు ఉన్నా.. అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి. మళ్లీ మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

ఇటువంటివి ఎక్కడ జరిగినా సహించవద్దు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడితేనే ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. పిల్లలతో పని చేయించడం ఆపాలి అని గట్టిగా తన స్వరం వినిపించేలా ట్యాగ్‌ను కూడా ఆమె తన ట్వీట్‌కు జత చేసింది

Andrapradesh

May 19 2020, 10:06

కడప స్టీల్ ప్లాంట్‌ కోసం అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవాలి : సీఎం జగన్

కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంలో అనుసరించాల్సిన వ్యూహాలను సమావేశంలో చర్చించారు. ఎలాంటి ఉత్పత్తులు చేస్తే డిమాండ్ ఉంటుంది, దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఎలా లభిస్తుందన్నా దానిపై చర్చించారు. ఉత్పత్తులకు అనుగుణంగా ప్లాంట్‌ నిర్మాణంలో వివిధ దశలను ఎలా ప్రారంభించాలన్న దానిపైనా చర్చించారు.

ప్రఖ్యాత ఉక్కు తయారీ సంస్థల భాగస్వామ్యం, దీని కోసం జరపాల్సిన సంప్రదింపుల పైనా సమావేశంలో చర్చ జరిగింది. ఉక్కు రంగంలో ప్రముఖుడు, సెయిల్‌ మాజీ సీఎండీ సీఎస్‌.వర్మ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో మాట్లాడారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఉన్న పరిస్థితులను సమావేశంలో చర్చించారు. ముడి ఖనిజం సరఫరా, రవాణా, ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై తన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించారు.

కడప స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామ్యానికి చాలా సంస్థలు ఆసక్తిచూపిస్తాయని వర్మ చెప్పారు. జాయింట్‌ వెంచర్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఈలోగా చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌ కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని నిర్మాణం కోసం సిద్ధం చేయడం చాలా ముఖ్యమైన అంశము. దీనిపై దృష్టి పెడితే.. సమయం చాలా ఆదా అవుతుందని సీఎం ఆదేశించారు. ప్లాంట్‌ కోసం అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవాలని సీఎం పేర్కొన్నారు.

Andrapradesh

May 18 2020, 17:26

నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో జరిగిన ఘటన తీవ్రంగా కలిచి వేసింది - డీజీపీ గౌతమ్ సవాంగ్ 

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో చిన్నారితో స్పాట్ వాల్యుయేషన్ గదిని శుభ్రం చేయించడం, ఆ సందర్భంగా పోలీసు హెడ్ కానిస్టేబుళ్ళు ప్రేక్షక పాత్ర పోషించడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు తీవ్రంగా స్పందించారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ఆ యిద్దరు హెడ్ కానిస్టేబుళ్ళపై శాఖా పరమైన చర్యలు తీసుకోవలసినిదిగా నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. గదిని శుభ్రం చేయాల్సిన తండ్రి తన 6 ఏళ్ల కుమార్తెతో గదిని ఊడిపించడం బాధాకరమైన విషయమని తెలియచేస్తూ, తండ్రి అయినప్పటికీ చట్ట ప్రకారం శిక్ష తప్పదని పేర్కొన్నారు.

Child labour prohibition and regulation act 1986 చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండని బాల బాలికల చేత చాకిరీ చేయించడం నిషిద్ధం. సెక్షన్ 14 ప్రకారం శిక్షార్హం. పని చేయించిన అట్టి వ్యక్తులకు కనీసం 3 నెలల నుండి సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా కనీసం 10000 నుండి 20000 వరకు జరిమానా లేదా శిక్ష మరియూ జరిమానా విధించాల్సి ఉంటుంది. 

డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడుతూ ఈ చట్టం పట్ల పోలీసు సిబ్బంది అందరికీ అవగాహన కల్గిస్తున్నపటికీ, కొందరు సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించడం క్షమార్హం కాదని తెలిపారు.

ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందనీ, పోలీసు శాఖ లో ఎప్పటికప్పుడు, బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఈ సంఘటన జరగడం దిగ్భ్రాంతి ని కలిగిస్తుందని, శాఖలో లోపాలను సరి దిద్ది ముందుకు వెళతామని తెలియ చేశారు. పోలీసు సిబ్బందికి మరిన్నీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

బాల బాలికలను ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించడం కూడా నేరమే అని తెలియచేస్తూ, త్వరలో దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలియ చేశారు. 

ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీసు శాఖ వీథి బాల బాలికలను గుర్తిస్తూ వారికి పునరావాసం కలుగ చేస్తూ సమాజంలో పిల్లల పట్ల తమకున్న భాధ్యతను ప్రస్ఫుటంగా తెలియచేస్తున్న విషయాన్ని పోలీసు సిబ్బంది మరవరాదని అభిలషించారు.

Andrapradesh

May 18 2020, 17:18

కోవిడ్‌–19పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి:
క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌–19పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు.

కోవిడ్‌ –19 పట్ల భయాందోళనలు పోవాలి: సీఎం
వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారు:
రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారు:
యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నారు:
వీళ్లు మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా? అని ఆలోచన చేయడం సరికాదు:
మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది:
మానవత్వంతో వారిని ఆదుకోవాలి:

కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై సమావేశంలో చర్చ
అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై ఎలా నడపాలన్నదానిపై చర్చ
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలనుంచి రావాలనుకుంటున్నవారికి బస్సులు నడపడంపై దృష్టి
దశలవారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయం
బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు అనుమతి లేదు
బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు
ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని సీఎం ఆదేశం
ఎక్కడ నుంచి బయల్దేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానిపై వివరాలు తీసుకోవాలి
దీని వల్ల వ్యక్తి ట్రేసింగ్‌ సులభం అవుతుందన్న సీఎం
రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు 
బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి

రాష్ట్రంలోకూడా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం
దీనిపై విధివిధానాలు తయారుచేయాలని నిర్ణయం
సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు
ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని నిర్ణయం
తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందే...
వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం
బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటన

ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ
కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణం
బస్సులో 20 మందికే 
ప్రతి దుకాణంలో 5గురు మాత్రమే
పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి

 • Andrapradesh
   @Andrapradesh రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవే కు అనుమతి
  టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందే
  నైట్‌ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగింపు
  అన్ని దుకాణాలూ ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతి
  
  కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్యపరిస్థితులను తెలియజేయడంపై దృష్టిపెట్టాలన్న సీఎం
  ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తామన్న అధికారులు
  వార్డు క్లినిక్స్‌ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
  స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్న సీఎం
  వచ్చే మార్చి నాటికి ఇవి పూర్తికావాలని సీఎం ఆదేశం
  విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్న సీఎం 
Andrapradesh

May 18 2020, 17:16

ఏపీలో మరో 52 కొత్త కేసులు.. యాక్టీవ్ కేసుల సంఖ్య చూస్తే..

* ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య ఏపీలో 2282 కు చేరింది. అయితే ఇవాళ 94 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూరు లో 12 , నెల్లూరులో 7 , కోయంబేడు(తమిళనాడు) నుంచి 19 మంది వచ్చారు. ఇతర రాష్ట్రానికి(గుజరాత్) కు చెందిన ఇద్దరు రోగులు కోలుకోవడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలావుంటే రాష్ట్రంలో ప్రస్తుతం 705 యాక్టీవ్ కేసులుండగా.. మొత్తం 1527 మంది కోలుకున్నారు. 50 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు 110, ప్రకాశం 3, నెల్లూరు 60, అనంతపురం 45, పచ్చిమగోదావరి 21, గుంటూరు 94, కృష్ణ 104, కడప 35, కర్నూల్ 163, తూర్పు గోదావరి 14, విశాఖపట్నం 38, విజయనగరం 8, శ్రీకాకుళం 10గా ఉన్నాయి.

Andrapradesh

May 18 2020, 17:15

ఏపీలోనూ లాక్‌డౌన్ పొడిగిస్తూ సర్కారు నిర్ణయం!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఏపీ లోనూ మే 31 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క‌రోనా నియంత్రణ చ‌ర్యల్లో భాగంగా విప‌త్తు నిర్వహ‌ణ చ‌ట్టాన్ని అనుస‌రించి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను ఏపీలోనూ అమలు చేస్తామని పేర్కొంది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్నీ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2230కి చేరింది.

Andrapradesh

May 18 2020, 15:45

సర్కార్ మరో సంచలనం.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

ఒకవైపు రాష్ట్రాన్ని కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం వరుసగా పేదవారి కోసం సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల రైతు భరోసా కింద రైతులకు ఆర్ధిక సాయాన్ని అందించిన ఆయన.. జూన్‌ మొదటివారంలో ‘జగనన్న చేదోడు’ పధకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పధకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం ఇవ్వనుండగా.. ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. సుమారు 2,50,015 మంది అర్హత సాధించగా.. వారి పేర్ల జాబితాను ఈ నెల 25 తేదీ నాటికీ దశలవారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. కాగా, కరోనా కాలంలో నాయి బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు తీవ్రంగా నష్టపోయారు. దీనితో వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి ఇదే మంచి తరుణమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏపీలో లాక్ డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Andrapradesh

May 18 2020, 13:18

ప్రజారవాణాపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు..మంత్రి పేర్నినాని

సీఎం ఆదేశాలు రాగానే బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసాం..

రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేసాం..

సీఎం నుండి ఆదేశాలు వచ్చిన 24 గంటల్లో బస్సులు నడుపుతాం..

ఆర్టీసీ బుకింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. సోషల్ distance పాటిస్తూ సీటింగ్ లో మార్పులు చేసాం..

పల్లె వెలుగు బస్సుల్లో మార్కింగ్ సిస్టం అమలు చేస్తున్నాం..

రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ తో బుక్కింగ్స్ అనుసంధానం చేస్తాం..

బస్సుల్లో యాంటీ వైరల్ స్ప్రే లు అందుబాటులో ఉంటాయి..

Andrapradesh

May 18 2020, 13:08

గుంటూరు.. hyd నుంచి గుంటూరుకు వెళ్లి.. ఇద్దరు పిల్లలు సహా వివాహిత ఆత్మహత్య

తోటికోడలి వేధింపులతో.. ఇద్దరు పిల్లలు సహా వివాహిత ఆత్మహత్య
పిడుగురాళ్ల (గుంటూరు): తోడికోడలు వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. జూలకంటి రాధిక (35)... ఆమె ఇద్దరు పిల్లలు క్రిస్టప్‌ రెడ్డి (4), రుషిత (3)లకు ఆదివారం రాత్రి ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌లో నివాసం ఉంటూ రాధిక భర్త లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు వాటర్‌ప్లాంట్‌ నడుపుతూ ఒకేచోట కలిసి వుంటున్నారు. అక్కడ రాధిక తోడికోడలి ఐదేళ్ల కుమార్తె ఈనెల 14న తెలియక లైజాల్‌ లిక్విడ్‌ తాగి చనిపోయింది. 
రాధిక వల్లే తన కుమార్తె చనిపోయిందని తోడికోడలు నిందలు వేస్తూ వేధింపులకు పాల్పడుతోంది. దీంతో రాధిక అవమానభారంతో హైదరాబాద్‌ నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని వారం రోజుల క్రితం తుమ్మలచెరువులోని పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా తోడికోడలు వేధింపులు ఆగకపోవటంతో తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లిదండ్రులు గమనించే సరికి ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు