భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరి లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధులు
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ, ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని బృందావన్ యోజన మైదానంలో ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రెసిడెంట్ గైడ్ రొయ్య విమల, ఎంపిహెచ్ఎ పాల్గొని జాంబోరి డైరెక్టర్ దర్శన పవర్స్కార్ చేతుల మీదుగా జాతీయ ప్రశంసా పత్రాన్ని పొందారు. రొయ్య విమల 1998లోనే ప్రెసిడెంట్ గైడ్ గా ఎంపికయ్యారు.
ఈ మేరకు నల్లగొండలో ఆర్. విమల మాట్లాడుతూ.. నవంబర్ 23–29, 2025 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. భారతదేశంలో సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జాతీయ ఐక్యత, నైపుణ్యాభివృద్ధి మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు సహా 32,000 మందికి పైగా పాల్గొన్నారు.
ముఖ్య కార్యకలాపాలలో సాహస సవాళ్లు, సాంకేతికత మరియు సోషల్ మీడియాపై వర్క్షాప్లు, డ్రోన్ ప్రదర్శన మరియు సాంస్కృతిక మార్పిడి ఉన్నాయని తెలిపారు.
ముఖ్య అతిథి గారైన శ్రీమతి ఆనందన్ పాటిల్ గవర్నర్, ప్రెసిడెంట్ భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఉత్తర్ ప్రదేశ్ గారి చేతుల మీదుగా నేషనల్ BSG ప్రెసిడెంట్ Dr అనిల్ కుమార్ జైన్ , కేకే కండాల వాల జాతీయ చీఫ్ కమిషనర్, ఇతర దేశాల ప్రతినిధులు శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ , ఏరోనాటిక్, నావికాదళం అతిథులుగా పాల్గొని 19వ నేషనల్ జంబూరి 24వ తేదీ సాయంత్రం BSG అన్ని రాష్ట్రాల విద్యార్థుల బ్యాండ్ విన్యాసాలతో విద్యార్థులచే గౌరవ వందనం తీసుకొని నేషనల్ జంబోరీ ని వైభవంగా ప్రారంభించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడం తో కార్యక్రమం ముగిసింది.
నల్లగొండ జిల్లా నుండి ప్రెసిడెంట్ గైడ్ ఇ.కరుణాకర్ ( జిల్లా సెక్రటరీ ), ఆర్. విమల జిల్లా వైస్ ప్రెసిడెంట్, స్కౌట్ మాస్టర్ సయ్యద్ జిలానీ, ఎం.ఆశ్రిత్ సూర్యం, అభిరామ్, యశ్విన్, వరుణ్ సాయి, గోపీనాథ్, పార్ధివ్, జయంత్, రఘు తేజ్, అశ్రిత్ ఆండ్రూ, హరి ప్రసాద్, సహజ్ గౌడ్, నల్లగొండ జిల్లా నుండి సెయింట్ ఆల్ ఫెన్సెస్ స్కూలు స్కౌట్స్, సూర్యాపేట జిల్లా నుండి తెలంగాణ మోడల్ స్కూల్ హిమంపేట స్కౌట్స్, తదితరులు పాల్గొన్నారు. 
16 min ago
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.8k