/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం Yadagiri Goud
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం

•బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

•రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 3.4 శాతం నిధులా ఇదెక్కడి న్యాయం..?

•అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా..?

•-- బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

 బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం 3,04,965 లక్షల కోట్ల బడ్జెట్లో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 11,405 కోట్లు, 3.4 శాతం నిధులు కేటాయించి బీసీల గొంతుకోసి తీరని అన్యాయం చేశారన్నారు. గత సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో బీసీల లెక్కలు లేవనే సాకుతో కేవలం 9,200 కోట్లు కేటాయించిందని కానీ ప్రస్తుతం స్పష్టమైన లెక్క ప్రభుత్వం తేల్చిన తర్వాత కూడా కొత్త సీసాలో పాత చింతకాయ పచ్చడి అన్న చందంగా ప్రస్తుత బడ్జెట్ ఉందని ఎద్దేవాచేశారు.

ప్రభుత్వం మారితే బీసీల బ్రతుకులు మారుతాయని ఆశించినా ఫలితం శూన్యంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్తో బీసీలకు ఒరిగిందేమీ లేదని 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 3.4 శాతం నిధులు బడ్జెట్లో కేటాయిస్తే ఏవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర సంపద సృష్టించేది, ఉత్పత్తి చేసేది బీసీలని, సగానికిపైగా పన్నులు కట్టేది బీసీలన్నారు. అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ నిధులు రెండున్నర కోట్ల బీసీ జనాభాకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

 ఇప్పటికే గ్లోబరైజేషన్ లిబరైజేషన్ మార్పుల తర్వాత పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరగడంతో పెద్ద పరిశ్రమలు కంపెనీలు రావడంతో చేతివృత్తులు కులవృత్తులు దెబ్బతిన్న కారణంగా బీసీల బ్రతుకులు రోడ్ల పాలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని 40 వేల కోట్లు కేటాయించి బీసీలపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. అంతేకాకుండా 50 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, బీసీ యువజన సంఘం నాయకులు శేరి రవీందర్, జక్కలి సాయి కంబాలపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ

•అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ.

•ఈ చట్టం బీసీల పోరాట మొదటి విజయం.

•బీసీ రిజర్వేషన్ల పెంచుతూ చట్టం చేసిన సీఎంకు, బిల్లుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు.

•---బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రాజకీయ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ ఈ చట్టం బీసీల మొదటి పోరాట విజయం అని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు భవనాల శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు ఇదే సమయంలో ఈ బిల్లు కు బేషరతుగా మద్దతు తెలిపిన బిఆర్ ఎస్, బీజీపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల నేతలకు సమస్త బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, జి.శ్రీ రంగారావు, ప్రశాంత్, వేణు, కోటేష్, పవన్ కుమార్, సంతోష్, సాయి, అరవింద్, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

•రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

•కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు నిధులు పెంచాలి

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోని బీసీల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 20000 కోట్ల నిధులు కేటాయిస్తామని అధికారంలోకి రాకమందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు స్పష్టంగా ప్రకటించిందని, ఈ నెల 19వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని మొదటి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రెండు లక్షల 91 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే అందులో 9200 కోట్లు మాత్రమే కేటాయించిందని 60 శాతం ఉన్న బీసీలకు మూడు శాతం నిధులు కేటాయించిందని ఇందులో కూడా రెండు శాతమే నిధులు ఖర్చు చేసింది ఆయన తెలిపారు.

గత బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణాంకాలు అందుబాటులో లేనందున తక్కువ నిధులు కేటాయించారని ప్రస్తుతం బీసీల జనాభా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వమే 56% ఉన్నారని అధికారికంగా తేల్చిన సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ కులగణన అనంతరం ఈమధ్య నియమించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఏవిధంగానైతే జనాభా ప్రకారం సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారో బడ్జెట్లో కూడా జనాభా దామషా ప్రకారం నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయం అనేక సభలలో పదేపదే చెప్తున్నందున వారి మాటను గౌరవించి బీసీల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కట్టెకోలు దీపెందర్ కోరారు.

ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, జక్కలి సాయిరాం, కంబాలపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ సంఘం నూతన కమిటీ జిల్లా అధ్యక్షునిగా ఎలిజాల శంకర్

చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్

ఐతరాజు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యఅతిథిగా ఫౌండర్ చైర్మన్ రచయిత ఐదారి నాగిళ్ళ శంకర్ పాల్గొని నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎలిజాల శంకర్ నియామక పత్రంతో పాటు చాకలి ఐలమ్మ చిత్రపటాన్ని తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర పుస్తకం అందజేస్తూ

ఈ సందర్భంగా ఐదారి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి కొనసాగిస్తూ భావజాల వ్యాప్తి కొరకు పనిచేయడంలో భాగమే నాని అన్నారు.వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తున్న క్రమంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట గడ్డ నల్గొండ జిల్లాలో వేయడం సంతోషకరమని

దీనితోపాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో కూడా కమిటీ వేయడం జరుగుతుందని,సంఘం 16 డిమాండ్లతో కూడి ఉండగా మూడు డిమాండ్లు మాత్రమే నెరవేరాయని మిగతావి ఐలమ్మ స్ఫూర్తి కొనసాగిస్తూ నెరవేరే విధంగా కృషి చేస్తామని మాతోపాటు కలిసొచ్చే వారిని కలుపుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నాగరాజు బుతారాజు సైదులు తుపాకుల ప్రవీణ్,ప్రసాద్ భూతరాజు గిరి,రాంబాబు లింగస్వామి,శంకర్ ఐతరాజు యాదగిరి,ప్రసాద్ ఎస్ యాదగిరి పి నరసింహ దేవేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ (ASWO) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నల్లగొండ పట్టణంలోని 36వ వార్డు యాటకన్నా రెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ (ASWO) వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, బండారు ప్రసాద్ గారు, బొజ్జ నాగరాజు గారు, పజూరి స్వామి గౌడ్ (అడ్వకేట్) గారు, సిలిగిరెడ్డి విక్రం రెడ్డి, గుర్రం వెంకన్న, కంచర్ల జానా రెడ్డి గార్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, మరియు స్వచ్ఛందంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి బండారు ప్రసాద్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం.. గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు. అందుకే రక్తందానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. రక్తదానం చేయడం వల్ల.. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే.. రక్తదానం చేసినవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. రక్తదానం చేసినప్పుడు రక్తంతో పాటు, ఆర్‌బీసీ, ప్లాస్మా కూడా వేర్వేరు వ్యక్తులకు దానం చేయవచ్చు. అంటే, రోగి అవసరానికి అనుగుణంగా మనం రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడవచ్చన్నమాట అని అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు, రక్తదానం చేసిన యువకులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

అలాగే అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు యలిజాల శంకర్ గారు మాట్లాడుతూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు అండగా ఉంటూ, వారి కష్టసుఖాలను తెలుసుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొంత నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదానం కూడా చేయాలని ఉద్దేశంతో ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, గ్రూప్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి, కోశాధికారి పాలకూరి నర్సింహ గౌడ్, జనరల్ సెక్రెటరీ దోనాల లింగారెడ్డి, జాయింట్ సెక్రటరీ కట్టెబోయిన సంజీవ యాదవ్, ముఖ్య సలహాదారులు యలిజాల శంకర్, తుపాకుల ప్రవీణ్, అయితరాజు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తుమ్మలపల్లి మహేష్, చర్లపల్లి అశోక్, మందడి రామ్ రెడ్డి, దేప నవీన్ రెడ్డి, మహమ్మద్ లతీఫ్, దూదిగామ నాగరాజు, హరి, సందీప్, వెంకన్న, భూతరాజు గిరిబాబు, భూతరాజు సైదులు, లక్ష్మణ్, శేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా నలగొండ టూ టౌన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సైదులు సార్ గారికి స్వాగతం పలికిన ASWO సభ్యులు

నలగొండ పట్టణంలోని టూ టౌన్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సైదులు సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు స్వాగతం పలికారు.

సైదులు సార్ గారు మాట్లాడుతూ ఎన్జీవో సంస్థలకు ఎల్లప్పుడు మా సహకారం ఉంటుందని చెప్పినందుకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు సురకారవు యాదగిరి గౌడ్, కంచర్ల రఘురామ్ రెడ్డి, దోనాల లింగారెడ్డి, పాలకూరి నర్సింహ గౌడ్,

కట్టెబోయిన సంజీవ యాదవ్, అయితరాజు ప్రసాద్, మందడి రాం రెడ్డి, దేప నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ను ఖండించిన బీసీ యువజన సంఘం.

బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ముందుకొచ్చి తన గళమెత్తి పోరాడుతున్న కారణంగా బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడాన్ని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి బహిష్కరించడమంటే అంటే యావత్ బీసీలను పార్టీ నుండి బహిష్కరించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలకో న్యాయం బీసీ ఎస్సీ ఎస్టీలకో న్యాయమా అని ప్రశ్నించారు.

మొదటినుండి పార్టీ కోసం అహర్నిశలు తన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో కేసులను సైతం లెక్కచేయకుండా ఆనాటి ప్రభుత్వానికి ఎదురోడ్డి పోరాడి నాటి ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి మల్లన్న ఆని తెలిపారు.

అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతుంటే సహించలేని అగ్రకుల పార్టీ పెద్దలు ఈరోజు పార్టీ నుండి గెంటేయడం దుర్మార్గమైన చర్యన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మొన్నటి వరకు పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించిన అగ్రకుల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం మల్లన్న పై చర్యలు తీసుకోవడం అంటే బీసీలపై కాంగ్రెస్ పెద్దలకు ఉన్న సవతి తల్లి ప్రేమ ఏందో తేటతెల్లమైందన్నారు. రానున్న రోజుల్లో యావత్ బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చికిత్స పొందుతున్న బాలుని కుటుంబ సభ్యులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆర్థిక సహాయం

నల్లగొండ పట్టణంలో 18 వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కందగట్ల కృష్ణ - గీతా దంపతుల కుమారుడు 11 సంవత్సరాల నవదీప్ జనవరి 17 శుక్రవారం రోజున బిల్డింగ్ పై పతంగి ఎగరవేస్తున్న సమయంలో వారి ఇంటి పక్కన ఉన్న కరెంటు తీగలకు పతంగి చిక్కడంతో పతంగిని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి 60% అబ్బాయి కాలిపోవడం జరిగింది. వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అబ్బాయికి సీరియస్ గా ఉందని హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కి పంపించారు. బాబు తల్లిదండ్రులు గాంధీ హాస్పిటల్ నుండి మెరుగైన వైద్యం కోసం కె.పి.హెచ్.బి. గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయిస్తున్నారు.

బాబును ఆ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై బాధపడుతున్నారని తెలుసుకున్న అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నల్లగొండ నుండి కె.పి.హెచ్.బి. గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కి చేరుకొని శోకసంద్రంలో ఉన్న నవదీప్ తల్లిదండ్రులను కలిసి బాబు పరిస్థితి గురించి తెలుసుకొని ధైర్యాన్నిచ్చి వారికి కొంత ఆర్థిక సహాయం చేశారు.

నవదీప్ తల్లిదండ్రులు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ బాబు త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే బాబు కుటుంబ సభ్యులు చాలా బీదరికంలో ఉన్నారని ఇంకా ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకొని ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి కుటుంబ సభ్యులకు అందజేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సురకారపు యాదగిరి గౌడ్, కంచర్ల రఘురామ్ రెడ్డి, పాలకూరి నర్సింహ గౌడ్, దోనాల లింగారెడ్డి, కట్టెబోయిన సంజీవ యాదవ్, అయితరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.

తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం, అభ్యున్నతికి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అభినవ ఫూలే తీన్మార్ మల్లన్న అని కొనియాడారు. తన దాతృత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేద విద్యార్థుల విద్య కోసం, పేదల వైద్యం కోసం, ఇతరత్రా కార్యక్రమాలకు అన్నా అంటే నేనున్నానంటూ స్పందించి ఆర్ధిక సహాయం అందించి ఎంతో మందిని దయార్ద్ర హృదయంతో ఆదుకున్న గొప్ప మహానుభావుడన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా మరింత ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నానన్నారు. మల్లన్నకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి గండిచెర్వు చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, పట్టణ కార్యదర్శి యలిజాల రమేష్, శ్రీరంగం, గడగొజు విజయ్ చారి, నేదునూరి సాయి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Rtv Folk Songs యూట్యూబ్ ఛానల్ రవికి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆర్థిక సహాయం

Rtv folk Songs యూట్యూబ్ ఛానల్ రవి తీవ్ర అనారోగ్యంతో గత రెండు నెలలుగా అపెండిక్స్ కడుపునొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న ఐదు రోజుల్లో తండ్రి అకాల మరణం, దానికి తోడు కడుపులో ఇన్ఫెక్షన్ తో నల్లగొండ పట్టణంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారు అక్కడికి చేరుకొని పండ్లు, నగదు ఆర్థిక సహాయం అందజేశారు.

రవి కుటుంబ సభ్యులు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ రవి ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని, స్వచ్ఛంద కార్యక్రమాలను తన వీడియో ద్వారా కవరేజ్ చేశారన్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి తను నటించిన ఫోక్ సాంగ్స్ ని అందించారని గుర్తు చేశారు.

రవితో పాటు పనిచేసిన ఎంతోమంది కళాకారులు, మీడియా మిత్రులు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి హాస్పిటల్ బిల్లులకు సహకరించగలరని అమ్మ స్వచ్చంద సేవా సంస్థ వారు కోరుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రవికి ఇంకా ఆరోగ్యం మెరుగుపడనందు వల్ల ఆస్పత్రిలోనే చికిత్స పొందాలి కాబట్టి ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు 8340988212 నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే చేయగలరని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సురకారపు యాదగిరి గౌడ్, కంచర్ల రఘురాం రెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, దోనాల లింగారెడ్డి, కట్టెబోయిన సంజీవ యాదవ్, అయితరాజు ప్రసాద్, తుపాకుల ప్రవీణ్, తుమ్మలపల్లి మహేష్ మరియు చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ ఐతరాజు లక్ష్మణ్, రజక సంఘం నాయకులు యలిజాల శంకర్, నడిగోటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.