అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ (ASWO) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నల్లగొండ పట్టణంలోని 36వ వార్డు యాటకన్నా రెడ్డి కాలనీలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ (ASWO) వారి ఆధ్వర్యంలో రక్ష బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, బండారు ప్రసాద్ గారు, బొజ్జ నాగరాజు గారు, పజూరి స్వామి గౌడ్ (అడ్వకేట్) గారు, సిలిగిరెడ్డి విక్రం రెడ్డి, గుర్రం వెంకన్న, కంచర్ల జానా రెడ్డి గార్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, మరియు స్వచ్ఛందంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి బండారు ప్రసాద్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం.. గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒకరు రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు. అందుకే రక్తందానం చేసే వారిని ప్రాణదాతలుగా పేర్కొంటారు. రక్తదానం చేయడం వల్ల.. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే.. రక్తదానం చేసినవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. రక్తదానం చేసినప్పుడు రక్తంతో పాటు, ఆర్‌బీసీ, ప్లాస్మా కూడా వేర్వేరు వ్యక్తులకు దానం చేయవచ్చు. అంటే, రోగి అవసరానికి అనుగుణంగా మనం రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడవచ్చన్నమాట అని అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు, రక్తదానం చేసిన యువకులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రక్త దానం (Blood donation) అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
అలాగే అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు యలిజాల శంకర్ గారు మాట్లాడుతూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు అండగా ఉంటూ, వారి కష్టసుఖాలను తెలుసుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొంత నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా రక్తదానం కూడా చేయాలని ఉద్దేశంతో ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, గ్రూప్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డి, కోశాధికారి పాలకూరి నర్సింహ గౌడ్, జనరల్ సెక్రెటరీ దోనాల లింగారెడ్డి, జాయింట్ సెక్రటరీ కట్టెబోయిన సంజీవ యాదవ్, ముఖ్య సలహాదారులు యలిజాల శంకర్, తుపాకుల ప్రవీణ్, అయితరాజు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తుమ్మలపల్లి మహేష్, చర్లపల్లి అశోక్, మందడి రామ్ రెడ్డి, దేప నవీన్ రెడ్డి, మహమ్మద్ లతీఫ్, దూదిగామ నాగరాజు, హరి, సందీప్, వెంకన్న, భూతరాజు గిరిబాబు, భూతరాజు సైదులు, లక్ష్మణ్, శేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Mar 15 2025, 17:19