ఘనంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు
బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం, అభ్యున్నతికి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అభినవ ఫూలే తీన్మార్ మల్లన్న అని కొనియాడారు. తన దాతృత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేద విద్యార్థుల విద్య కోసం, పేదల వైద్యం కోసం, ఇతరత్రా కార్యక్రమాలకు అన్నా అంటే నేనున్నానంటూ స్పందించి ఆర్ధిక సహాయం అందించి ఎంతో మందిని దయార్ద్ర హృదయంతో ఆదుకున్న గొప్ప మహానుభావుడన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా మరింత ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నానన్నారు. మల్లన్నకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి గండిచెర్వు చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, పట్టణ కార్యదర్శి యలిజాల రమేష్, శ్రీరంగం, గడగొజు విజయ్ చారి, నేదునూరి సాయి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Jan 20 2025, 13:37