తాటి చెట్టు పై నుండి పడి గాయపడిన గీతా కార్మికుడున్ని పరామర్శించిన తెలంగాణ గౌడ సంఘాల JAC...
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన గడ్డం వెంకటనారాయణ గౌడ్ గారు వృత్తి ధర్మంలో తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలు అయినాయని తెలిసి హాస్పిటల్లో పరామర్శించిన
తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్ మరియు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ గారు ఈ సందర్భంగా గట్టు నరేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో గీతా వృత్తి ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపానికి పోలేదని ప్రభుత్వంపై గట్టు నరేష్ గౌడ్ ధ్వజమెత్తారు.
అంతేకాకుండా గత ప్రభుత్వంలో వృత్తి ప్రమాదాలు జరిగి గాయపడిన మరణించిన తక్షణ సహాయ నిధి కింద గీత కార్పొరేషన్ ద్వారా 15000 రూపాయలు 25వేల రూపాయలు బాధిత కుటుంబ సభ్యులకు అందించేవారు అని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడిచిన నేటికి బాధితులకు ఎలాంటి తక్షణం సహాయం గాని మరణించిన వారికి ఎక్స్గ్రేషియా గాని అందించడం లేదని మండిపడ్డారు ఇకనైనా గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గీతా వృత్తి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
గీత కార్మికులు ప్రమాదానికి గురి అయితే ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటే భయపడి ప్రైవేటు హాస్పిటల్ లను వెతుక్కునే పరిస్థితి వచ్చిందని ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో బిల్లులు కట్టుకోలేక బాధితులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం వారికి అయినా వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి సేవలందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నాగపురి వెంకటేష్ గౌడ్ గారు నందు గౌడ్ గారు. మధుసూదన్ రాజుగారు దొడ్డుపల్లి రఘుపతి నందగోపాల్ ఉదయ్ కుమార్ సతీష్ తదితర గౌడ నాయకులు పాల్గొని బాధితుడిని పరామర్శించారు.
Jan 16 2025, 17:32