పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని వినతి పత్రం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని, స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వికలాంగుల వృద్ధాప్య, వితంతు, చేనేత గీత కార్మికుల పెన్షన్లు ఇవ్వాలని అన్నారు.
గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించాలని అన్నారు. భూమిలేని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ప్రజా పాలనలో ఏ విధంగానైతే ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారో, అదేవిధంగా పేదలను గుర్తించి, భూమిలేని నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్య, నీలకంఠం రాములు, దామెర లక్ష్మి, రామలింగాచారి, చింతపల్లి యాదయ్య, మాడుగుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Dec 22 2024, 16:37