గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ మరియు నాగపురి వెంకటేష్ గౌడ్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన కల్లుగీత వృత్తిదారుడు ముత్యం ఏకాంబ్రం గౌడ్ గారు బుధవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి కిందపడినాడు ఈ ప్రమాదంలో తన రెండు చేతులు పూర్తిగా విరిగి తీవ్ర గాయాలు అయినాయని తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ ఒక ప్రకటనలు తెలిపాడు.
దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి అని బాధితుడికి భార్య మరియు చదువుకునే ఇద్దరు పిల్లలు ఉన్నారని వారికి ప్రభుత్వమే అండగా ఉండాలని కోరాడు.
అంతేకాకుండా తన వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని ఇది ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టాడు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో ప్రభుత్వం ఏర్పాటు కాగానే గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు అందిస్తామని చెప్పి అధికారం వచ్చి సంవత్సరం గడిచిన ఇచ్చిన హామీలు ఒక శాతం కూడా అమలు చేయలేదు అని ధ్వజమెత్తారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు
గీత కార్మికుల పైన దాడులు మానుకొని గీత కార్మికుల రక్షణకై నడుంబించాలని కలుగీత కార్పోరేషన్ తక్షణమే ఏర్పాటు చేయాలని బాధితుడికి రెండు చేతులు విరిగి నరాలు తెగినందున ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు అని కావున తన వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఇప్పటికైనా గీత కార్మికుల రక్షణ కవచాలు పూర్తిస్థాయిలో అందించాలని లేనియెడల తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ ఆఫీసులో ముంగట ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
గతంలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ గారు రాష్ట్రంలో ఏ గీత కార్మికుడు అయిన ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడితే 24 గంటల్లో తక్షణ సహాయం 25వేల రూపాయలు అందించడమే కాకుండా వారికి ప్రభుత్వం రావలసిన నష్టపరిహారాన్ని కూడా రెండు నెలలలో అందించేవారు అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుండి ప్రమాదవశాత్తు గాయపడిన & మరణించిన గీత కార్మికులకు అందవలసిన తక్షణ నష్టపరిహారం ఇవ్వడం లేదని తెలిపారు రాష్ట్రంలో రోజుకు పదుల సంఖ్యలో గీతా కార్మికులు ప్రమాదానికి గురి అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
తక్షణమే ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసి గీత కార్పొరేషన్ ను ఏర్పాటు చేయకుంటే రాబోయే స్థానిక ఎన్నికలలో గౌడ జాతి మోకు దెబ్బ రుచి చూపిస్తామని హెచ్చరించారు గీత కార్మికుని పరామర్శించిన వారిలో గౌడ సంఘం నాయకులు చెంగల ఏకాంబరం గౌడ్ సాగర్ గౌడ్ మరియు జిల్లా గౌడ సంఘం నాయకులు పరామర్శించారు.
Dec 22 2024, 16:30