హైదరాబాద్ గజగజ - ఆరేళ్ల రికార్డు బిగ్ అలర్ట్
హైదరాబాద్ నగరం గజగజ వణుకుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దాదాపు ఆరేళ్ల తరువాత ఈ స్థాయిలో చలి వణికిస్తోంది. నగరంలోని శివారు ప్రాంతాలతో పాటుగా పలు జిల్లాల్లోనూ ఇదే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. చలి గాలుల తీవ్రత పైన వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించింది. ఈ సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అలర్ట్ చేస్తున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఉదయం వేళ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి గాలులు భయపెడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలాలో అత్యంత కనిష్ఠంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లో ఆరేళ్ల తరువాత ఈ స్థాయిలో చలి భయపెడుతోంది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల లోపే నమోదయ్యాయి. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
అదే విధంగా హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, గోల్కొండ, సఫిల్‌గూడ, హయ త్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తిరుమలగిరిలో 13.6 డిగ్రీల సెల్సియస్, చెర్లపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (నిర్మల్) తాండ్రలో 6.3 డిగ్రీలు, (ఆదిలాబాద్) పొచ్చర 6.4, జైనథ్ (ఆదిలాబాద్) 6.5, అర్లి (టి) (ఆదిలాబాద్) 6.6, చాప్రాల్ (ఆదిలాబాద్) 6.6, సత్వార్ (సంగారెడ్డి) 6.6, బంట్వారం (వికారాబాద్) 6.7సంగారెడ్డి ) 6.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి పంజా విసురుతోంది. ఎలిమినేడు (రంగారెడ్డి) 6.7, సిర్పూర్ (యు) (ఆసిఫాబాద్) 6.7, చందనవల్లి (రంగారెడ్డి) 6.7, కోహీర్ (సంగారెడ్డి) 6.7, మర్పల్లి (వికారాబాద్) 6.8, నాగారం (టి) (వికారాబాద్) 6.8, మన్నెగూడ (వికారాబాద్) 6.8 (వికారాబాద్) సంగారెడ్డి) 6.8, పోతారెడ్డిపేట (సిద్దిపేట)లో 6.9 డిగ్రీల సెల్సియస్, జహీరాబాద్ (సంగారెడ్డి) 6.9 డిగ్రీల సెల్సియస్, మేనూరు (కామారెడ్డి)లో 6.9 డిగ్రీల సెల్సియస్, రాఘవపేటలో (జగిత్యాల) 7.3 డిగ్రీల సెల్సియస్, కెరమెరిలో (ఆసిఫాబాద్) 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ సమయంలో వృద్ధులు.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
Dec 19 2024, 20:21