/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల సర్వే
మహబూబ్ నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభమైంది. బుధవారం భూత్పూర్ మండలం, కొత్త మల్గర గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సర్వేను పరిశీలించారు.
ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెలాఖరు లోగా సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్ప వద్దు: కోటం రాజు
నల్లగొండ: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని,బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకుఅమలు చేయాలని, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను భీమా కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పజెప్పాలని ఆలోచన చేస్తుందని, అన్ని యూనియన్లు కొద్దిగా వెనకకు తగ్గిన పూర్తిగా విరమించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
వెల్ఫేర్ బోర్డు సైట్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా క్లెయిమ్స్ పరిష్కారం కాకుండా ఉండిపోయాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని, భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డు నే నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెల్ఫేర్ బోర్డులో 5500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్నా పాటించడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ,బి దయానంద్, వరికుప్పల ముత్యాలు, అవుట రవీందర్, బి సైదులు,బివెంకటయ్య యాదయ్య, మన్నెం శంకర్, ఎం.రామకృష్ణ, శంకర్, ఎండి సర్దార్, ఎస్.కె హుస్సేన్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్
నల్లగొండ: సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఏకసభ్య కమిషన్ కు న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ఉప కులాల వర్గీకరణ పై ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వారు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ ఫౌండర్ మామిడి ప్రమీల, మేడి సావిత్రి, మాజీ కౌన్సిలర్ రూప, సుధ, తదితరులు పాల్గొన్నారు.
ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్
నల్లగొండ: సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఏకసభ్య కమిషన్ కు న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప కులాల వర్గీకరణ పై ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వారు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మామిడి ప్రమీల, మేడి సావిత్రి, మాజీ కౌన్సిలర్ రూప, తదితరులు పాల్గొన్నారు.
ఏక సభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్
నల్లగొండ: సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, ఏకసభ్య కమిషన్ కు 'న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్' సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప కులాల వర్గీకరణ పై ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు వారు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఉమెన్ ఫౌండర్ మామిడి ప్రమీల, మేడి సావిత్రి, మాజీ కౌన్సిలర్ రూప, సుధ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఏకసభ్య కమిషనర్ కు వినతి పత్రాలు అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వ వేసిన ఏకసభ్య కమిషన్ బుధవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో, ఏకసభ్య కమిషనర్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తమ అభిప్రాయ వినతి పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల, మండలాల, గ్రామాల మాల మహానాడు కమిటీ నాయకులు ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రాలను అందజేశారు.
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాలు కల్పించిన 15% రిజర్వేషన్ పూర్తిగా అంటరానితనం వివక్షతకు దేశ వ్యాప్తంగా ఉన్న 1267 కులాలను ఒకే జాబితాలో చేర్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు.
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా, ఎస్సీలకు కల్పించిన 15 శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినా.. అది చెల్లదని.. సుప్రీంకోర్టు 2004లో తీర్పు ఇవ్వడం జరిగిందని, 341 ఆర్టికల్ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభల్లో, పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీ తో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని గతంలో ఐదుగురితో కూడిన ధర్మాసనం చెప్పడం జరిగిందని, ప్రైవేట్ రంగంలో ఎస్సి రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్, నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఏకుల రాజారావు, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, డిండి మండల నాయకులు పెరుమాళ్ళ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేత
నల్లగొండ జిల్లా: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, బుధవారం కొండమల్లేపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోని రాజీవ్ గృహ కల్ప వద్ద ఓ దుండగుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దూషిస్తూ కొడుతూ హేళన చేసి వీడియో వాట్సాప్ పెట్టిన వ్యక్తి పైన రాజద్రోహం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొండమల్లేపల్లి ఎస్ హెచ్ ఓ కు ఫిర్యాదు అందజేశారు.
అనంతరం డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత, స్త్రీల హక్కుల పరిరక్షకుడు, ప్రజాస్వామ్యవాది ప్రధమ న్యాయశాఖ మంత్రి అయినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తి అవమానపరుస్తూ, దాడి చేసి నీచంగా ప్రవర్తించిన దుండగుడి పై చట్టరీత్యా రాజ ద్రోహం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డాక్టర్ బుర్రి వెంకన్న, జిల్లా నాయకులు ధర్మపురం శీను, డివిజన్ నాయకులు ఆడెపు శోభన్, కొండమల్లేపల్లి మండల కన్వీనర్ మేదరి ప్రసాద్, కందుల చంటి, వసుకుల అనిల్, అన్నెపాక సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
NLG: జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ కు వినతి పత్రాలు అందజేసిన నాయకులు
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో, నేడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో, షెడ్యూల్ కులాల్లో ఉప వర్గీకరణ పై వివరణాత్మకమైన అధ్యయనం కోసం, డా. జస్టిస్ షమీమ్ అక్తర్ బహిరంగ విచారణ నిర్వహించి వినతులు స్వీకరించారు.
ఈ మేరకు మర్రిగూడ మండలం నుండి మాల మహానాడు మండల అధ్యక్షుడు నాగిల్ల మారయ్య హాజరై, ఉపకులాల వర్గీకరణ ఆమోదయోగ్యమైనది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ కు వినతులు అందజేశారు.
టెన్త్ విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు..
నల్లగొండ: జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో, గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి (డిసెంబర్ 22) సందర్భంగా, డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం లో భాగంగా.. విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గణిత ఫోరం.. రేపు అనగా ఈ నెల 11 వ తేదీన, పదో తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థులు ప్రతి పాఠశాల నుండి తెలుగు మీడియం కి ముగ్గురు, ఆంగ్ల మీడియం కు ముగ్గురు పరీక్షలలో పాల్గొనాలని కోరారు.
ప్రతి మండలం నుండి ముగ్గురు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలంగాణ గణిత ఫోరం.. నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షులు అద్దంకి సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొరివి కృష్ణ తెలిపారు.
Dec 12 2024, 17:00