విగ్రహావిష్కరణకు రాలేను మంత్రి పొన్నంకు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి లేఖ
డిసెంబర్ 9 సోమవారం తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అందరికీ ఆహ్వాన పత్రికలు పంపింది. ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ గౌడ్ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు లేఖ రాశారు. తను సోమవారం నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేనని పేర్కొన్నారు.
ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాల ఉండడంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నట్లుగా వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీకగా అని పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు తనను ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి మాజీ సీఎం రావడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కార్యక్రమానికి ఆయన వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విగ్రహావిష్కరణ తర్వాత జరిగే పబ్లిక్ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతారు. విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని అందరూ భావించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహిళల చేతులు మీదుగా ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలకు చెందిన మహిళలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమానికి కు ఏఐసీసీ నుంచి ఎవరు వస్తారనేది తెలియరాలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాగాంధీ హైదరాబాద్ కు వచ్చే అవకాశం లేదు. రాహుల్ లేదా ప్రియాంకాగాంధీలో ఎవరో ఒకరు వస్తారని భావించారు. కానీ వారి రాకకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదు.
Dec 08 2024, 18:56