NLG: 'నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలి'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం, మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి, పార్టీలకతీతంగా నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని అన్నారు. రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలి.
వికలాంగులు సదరం సర్టిఫికెట్ పొంది ఎదురుచూస్తున్నారని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, ఈ ప్రభుత్వం పెన్షన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు మైల సత్తయ్య గడగోటి వెంకటేష్ సల్వోజు రామలింగా చారి, కృష్ణయ్య మేడిపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Dec 06 2024, 22:26