NLG: ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సౌజన్యంతో దుప్పట్లు పంపిణీ
నాగార్జునసాగర్ నియోజకవర్గం,
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సౌజన్యంతో బుధవారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో విద్యార్థిని, విద్యార్థులకు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయ వీర్ సొంత ఖర్చులతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యే మండలాల్లోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గడ్డం సాగర్ రెడ్డి,మాజీ ఎంపీపీలు భగవాన్ నాయక్, బ్రహ్మానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ నాయక్, ఉపాధ్యక్షులు లాలు నాయక్, బ్రహ్మానందరెడ్డి, యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు మేరావత్ ముని నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు బాలు నాయక్,ఎంకన్న, శ్రవణ్ కుమార్ రెడ్డి, బద్రి నాయక్, పాపిరెడ్డి, పాండు నాయక్, అనుముల అంజి,నగేష్ నాయక్, పగడాల సైదులు, హరి నాయక్, పాండురంగ, శ్రీను నాయక్,వెంకటేశ్వర్లు, బీలు నాయక్,సర్దార్ నాయక్, కృష్ణ,మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.
Dec 05 2024, 22:19