/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఎల్లుండి మళ్లీ అల్పపీడనం Raghu ram reddy
ఎల్లుండి మళ్లీ అల్పపీడనం

ఫెంగల్‌ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు మంగళవారం వెల్లడించారు.

ఫెంగల్‌ తుఫాను ప్రభావం నుంచి బాధితులు ఇంకా కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు మంగళవారం వెల్లడించారు. ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళుతుందని అంచనా వేశారు. రానున్న రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుందన్నారు. కాగా, మూడు రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్‌ తుఫాన్‌ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు.

తుఫాన్‌ ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రకాశం జిల్లా కనిగిరిలో 97, చిత్తూరు జిల్లా కటికిపల్లిలో 84, పెనుమూరులో 82, అనంతపురం జిల్లా ఈస్టు కందిపల్లిలో 82, తిరుపతి జిల్లాలో పాకాలలో 71, చిత్తూరు జిల్లా అరగొండలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగేంద్రపురంలో 73, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో 71 మి.మీ. వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తరువాత రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు.

తెలంగాణలో భూ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

తెలంగాణలోని భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

ఉదయం 7.25 గంటల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు. ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవంతో ప్రజలు హడలిపోయారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు.

ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ప్రధానంగా గోదావరి పరివాహాక ప్రాంతంతో పాటుగా.. కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర ఛత్తీస్‌గడ్‌లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరౌలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని.. అటువంటింది 5.3 తీవ్రతతో భూమి కంపంచటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్

పెద్దసార్‌తో(కేసీఆర్) ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారు అంటూ ఎమ్మెల్యే వివేక్ కామెంట్స్ చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఉనికి కోసం ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ (BRS MLA Vivek) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దసార్‌తో(కేసీఆర్) ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారు అంటూ కామెంట్స్ చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఉనికి కోసం ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు తాము కాంగ్రెస్‌తో టచ్‌లో లేమని తెలిపారు.

ప్రజల పక్షాన పోరాడుతున్నందునే హారీష్ రావుపై కేసు పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీలో తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని విమర్శించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు మూటలు మోయడానికి రేవంత్ పనిచేస్తున్నారని.. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని కూడా రేవంత్ విస్తరించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ నమ్మించి గొంతు కోశారన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు శాశ్వత ప్రభుత్వాలు కాదన్నారు. లిమిట్ దాటి పనిచేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఇంటిలిజెన్స్ అధికారులను బెదిరిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే వివేక్ వెల్లడించారు.

ఏం సాంధిచారని సంబురాలు‌ జరుపుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హాయాంలోనే తెలంగాణ నవంబర్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. మత్స్యకారులు, నాయిని బ్రాహ్మణలు రోడ్ల మీదకు వస్తే.. ప్రత్వం సంబురాలు జరుపుతోందని మండిపడ్డారు. మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులవి న్యాయమైన డిమాండ్లు అని తెలిపారు. కేసీఆర్ పథకాలనే ప్రజలు నేటికి గుర్తుచేసుకుంటున్నారన్నారు. నాయి బ్రాహ్మణల ఆందోళనలను బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మత్స్య వృత్తిపైన ఆధారపడి జీవిస్తోన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతివృత్తుల వారికి అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. కోతల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలు చేశారు.

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 

అంతేకాదు... పులివెందుల, ఉద్ధానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. హోమియోపతి ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా నేటి సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఈ క్యాబినెట్ భేటీలో బియ్యం అక్రమ రవాణా అంశం కూడా చర్చించారు. ప్రభుత్వానికి ఈ మాఫియా సవాల్ గా మారిందని, దీనికి అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ పోర్టులో అరబిందో సంస్థ 41 శాతం వాటాను లాగేసుకుందని ఆరోపించారు. ఆస్తులు గుంజుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్ గా మారిందని వ్యాఖ్యానించారు. 

ఇక కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుండడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రాధాన్య పథకం ఇంకా డీపీఆర్ స్థాయిని దాటకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, తాగునీటి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ ను ఏపీ సద్వినియోగం చేసుకోవడంలేదని ఢిల్లీలో కూడా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. 

అధికారుల ఉదాసీనత వల్లే ఈ పథకం ఆలస్యమవుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా ఈ పథకంపై స్పందించారు. ఇది అందరికీ చేరువయ్యే భారీ ప్రాజెక్టు అని. దీన్ని మిషన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు.

శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆందోళన

మియాపూర్ శ్రీ ఛైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో ఆందోళన నెలకొంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేమని ఆత్మహత్యకు పాల్పడతామంటూ కొందరు విద్యార్థులు వాష్ రూమ్ గోడలపై రాసిన ఘటన వెలుగుచూసింది

ఆ రాతలను చెరిపేసేందుకు కాలేజీ సిబ్బంది ప్రయత్రించారు. అంతేకాకుండా నాలుగు రోజుల పాటు ఔటింగ్ ఇచ్చామని చెప్పి విద్యార్థులను ఉన్నపళంగా ఇళ్లకు పంపించేస్తున్నారు.

విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సిఎంగా ఫడ్నవీస్ ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం

మహారాష్ట్ర సిఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సిఎంగా ఏక్‌నాథ్‌ షిండే మరో డిప్యూటీ సిఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. వీరి ప్రమాణ స్వకారం డిసెంబర్ 5వ తేదీన ఉంటుందని సదరు వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కేబినెట్ మంత్రలకు సంబంధించి ఇంకా ఫైనల్ కాలేదని దీంతో.. సిఎం, ఇద్దరు డిప్యూటీ సిఎంలే ఆరోజు ప్రమాణ స్వకారం చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటుంది.

కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయిన బిజెపి ఈ ఎన్నికల్లో 132 సీట్లను గెలుచుకుంది.

ఇక శివసేన షిండే పార్టీ 57  ఎన్ సిపి అజిత్ పవార్ పార్టీ 41 సీట్లు దక్కాయి. అయితే భారీ విజయం సాధించినా.. ఎన్నికల అనంతరం సిఎం పదవిపై బిజెపి అధిష్టానంతో ఢిల్లీలో ఉత్కంఠభరితంగా చర్చలు సాగాయి.

ములుగు ఎన్‌కౌంటర్‌ కేసు హైకోర్టు ఏం చెప్పిందంటే

ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ కొనసాగింది. పిటిషనర్ తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అయితే మృతదేహాలపైన అనేక గాయాలు ఉన్నాయని, ఇదొక బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భద్రపరిచిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని పదే పదే కోరారు.

ములుగు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) విచారణ జరిగింది. ములుగు ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలు, పోస్టుమార్టం రిపోర్టును అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై ఈరోజు (మంగళవారం) విచారణ జరిపిన న్యాయస్థానం మల్లయ్య మృతేదహాన్ని గురువారం వరకు భద్రపరచాలని ఆదేశించింది. మిగిలిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించాలని చెప్పింది. తదుపరి విచారణను గురువారం (డిసెంబర్ 5)కు వాయిదా వేసింది.

నిన్నటి విచారణలో ఈరోజు వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. నేడు మరోసారి పిటిషనర్ తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగాయి. అయితే మృతదేహాలపైన అనేక గాయాలు ఉన్నాయని, ఇదొక బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భద్రపరిచిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని పదే పదే కోరారు. మరోవైపు నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సమయంలో పోస్టుమార్టం అంతా కూడా చీకటిలో నిర్వహించారని, పంచనామా ప్రక్రియ సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

అలాగే ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తూ.. ఎన్‌హెచ్‌ఆర్సీ గైడ్‌లెన్స్‌ ప్రకారం, అలాగే హైకోర్టు ఆదేశాల మేరకే శవ పరీక్షలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. కేవలం ఎదురుకాల్పుల్లో మాత్రమే మావోలు మృతిచెందారని ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎక్కడా కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని, ఆహారంలో ఎలాంటి విషం ఇవ్వలేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఎనిమిది మంది వైద్య నిపుణులతో పోస్టుమార్టం పూర్తి చేశామని వాటికి సంబంధించి ఫోటోగ్రఫీ కూడా కోర్టుకు అందజేస్తున్నామని ప్రభుత్వం తరుపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. మృతదేహాలను భద్రపరిచనట్లైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. అందుకే మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.

అయితే మావోలకు భోజనంలో విషం కలిపారని, ఆపై కస్టడీలోకి తీసుకుని కాల్చిచంపారన్న అంశాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. పీఎంఈ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాలని హైకోర్టు చెప్పింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కేవలం మల్లయ్య మృతదేహం తప్ప మిగిలిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీఎంఈ రిపోర్టుతో పాటు ఎన్‌కౌంటర్ జరిగిన పరిణామాలకు సంబంధించిన రిపోర్టు, ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలను న్యాయస్థానానికి అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఇచ్చిన తరువాత తదుపరి చర్యలకు హైకోర్టు ఆదేశించే అవకాశం ఉంది. కేవలం పిటిషనర్‌గా మల్లయ్య భార్య ఉన్నందున.. ఆయన మృతదేహాన్ని తప్ప మిగిలిన మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కేరళలో బస్సును కారు ఢీకొని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అలప్పుజా జిల్లా లో కారు,బస్సు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం ప్రకారం,బస్సు అతివేగంగా రావడంతో కారు తో ఢీకొన్నట్లు తెలుస్తోంది.

బాధితులుగా వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్మ హమ్మద్, ఇబ్రహీం దేవన్‌లుగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం,మృతులెవరు కోజికోడ్,కన్నూర్,చేర్యాల,లక్షద్వీప్ ప్రాంతాలకు చెందినవారు.

ఈ ప్రమాదంలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్(KSRTC)బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు ఈప్రమాదానికి సంబంధించిన వివిధ కోణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

హరీష్ రావుకు బిగ్ షాక్

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చలికాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయని చెప్పుకొవచ్చు. ఒక వైపు బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే.. తెలంగాణ వెనక్కు పోయిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరొవైపు బీఆర్ఎస్ మాత్రం.. 420 హమీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కూడా కౌంటర్ ఇస్తుంది. ఇచ్చిన హమీలు కాంగ్రెస్ మెడలు వంచి మరీ అమలు చేసేలా చేస్తామని కూడా బీఆర్ఎస్ గట్టిగానే ఏకీపారేస్తుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇటీవల బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి తన విమర్శలతో చుక్కలు చూపిస్తున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీష్ రావు సైతం.. తాము కూడా తగ్గేదేలా అన్నట్లు కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తున్నారు.

దీంతో తెలంగాణ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం..బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపైన పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.

సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి.. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ తో కలిసి తన ఫోన్ లు ట్యాపింగ్ లకు పాల్పడ్డారని, తనపై అక్రమ కేసులు బనాయించి, మానసికంగా వేధించారని కూడా సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది

దీంతో పంజాగుట్ట పోలీసులు. 120(బి), 386, 409, 506, రెడ్ విత్ 34 , ఐటీయాక్ట్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.

బంగ్లాదేశ్ బరితెగింపు

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. రోజుల తరబడి ఇవి కొనసాగుతోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి బ్రేకులు పడట్లేదు.

షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి. హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు.

మహ్మద్ యూసుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా భావిస్తోన్నారు. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ పరిణామాలన్నింటిపై ఇటీవలే ఆర్ఎస్ఎస్ ఘాటుగా స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేయాలని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పీల్ చేసింది. సాధారణ పరిస్థితులు, శాంతియుత వాతావరణం నెలకొనేలా ఇస్లామిక్ గ్రూప్స్‌తో చర్చించాలని కోరింది.

అక్కడ జరుగుతోన్న పరిణామాలన్నింటినీ కూడా భారతీయ టెలివిజన్ ఛానళ్లు ఎప్పటికప్పుడు కళ్లకు కట్టినట్టు చూపిస్తోన్నాయి. రాజధాని ఢాకా సహా ఇతర నగరాల్లో హిందువులు, హైందవ ఆలయాలు, గుళ్లు- గోపురాలపై సాగుతున్న దాడులను ప్రపంచం ముందుకు తీసుకొస్తోన్నాయి. బంగ్లాదేశ్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తోన్నాయి.

దీన్ని కొంతమంది బంగ్లాదేశ్ మత ఛాందసవాదులు ఎంతమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలన్నింటిపైనా తక్షణమే నిషేధం విధించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. దీనిపై ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ ఆపరేషన్ చట్టం 2006 కింద భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలంటూ అడ్వొకేట్ ఎక్లాస్ ఉద్దీన్ భుయాన్ ఈ పిటీషన్ వేశారు. దీన్ని జస్టిస్ ఫాతిమా నజీబ్ జస్టిస్ సిక్దర్ మహ్మదుర్ రజీతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

బంగ్లాదేశ్ సమాచార, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, ఆ దేశ టెలికమ్యూనికేషన్ల రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్‌ను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. స్టార్ జల్సా, స్టార్ ప్లస్ జీ బంగ్లా రిపబ్లిక్ బంగ్లా సహా భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలపై నిషేధం విధించాలని అభ్యర్థించారు.