NLG: ఈనెల 5 న జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్
![]()
నల్లగొండ: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు యశోద హాస్పిటల్, మలక్ పేట సౌజన్యంతో ఈనెల 5 వ తేదిన జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్,నల్గొండ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆశ్వాక్ అహ్మద్, మలక్ పేట యశోదా హాస్పిటల్స్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సాజిద్ లు వివరాలు వెల్లడించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... నిరంతరం ఉరుకుల పరుగుల జీవితంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వారి సంక్షేమం కోసమే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు. ఈనెల 5న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, హెల్త్ క్యాంపు నిర్వహణకు వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ యశోద హాస్పిటల్స్ ముందుకు వచ్చారన్నారు.
యశోద హాస్పిటల్స్ సహకారంతో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు ను జిల్లా కేంద్రం లో పని చేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మలక్ పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మెగా హెల్త్ క్యాంపులో కార్డియాలజీ, ఆర్థోపెటిక్, గైనిక్, షుగర్, బిపి, ఈసిజి, 2D ఈకో, BMD బోన్ మినరల్ టెస్ట్, వెంటనే రిజల్ట్ వచ్చే టెస్టులన్నీ చేస్తామని తెలిపారు.అందుబాటులో లేని టెస్టు లను మలక్ పేట యశోద హాస్పిటల్ లో 50 శాతం డిస్కౌంట్ తో చేస్తామని, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెస్టులలో ఏమైనా అనారోగ్య సమస్యలు నిర్ధారణ అయితే జర్నలిస్ట్ హెల్త్ కార్డు ద్వారా యశోద హాస్పిటల్ లో వైద్యం అందజేస్తామన్నారు.


నారాయణ కళాశాల విద్యార్థి తనుష్.. మృతి పైన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ కుమార్ స్పందించారు. ఈ మేరకు నల్లగొండలో కట్టెల శివ మాట్లాడుతూ.. నారాయణ కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల గిరిజన విద్యార్థి బలైయ్యాడని తక్షణమే,యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
UP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్ లోని ‘మహా కుంభ్' ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. దీనిని 'మహా కుంభమేళా' జిల్లాగా పిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
నల్లగొండ: ఆశా వర్కర్లతో లెప్రసీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన క్రమంలో, ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని లేకపోతే సర్వేను నిలిపివేస్తామని, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిఎంహెచ్ఓ పుట్ట శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్ఒ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
నల్లగొండ జిల్లా,మర్రిగూడ మండలం, తిరుగండ్లపల్లి గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో, సోమవారం నూతన మాల మహానాడు గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడు గా చెల్లం శంకర్ ఉపాధ్యక్షులు- బత్తుల వెంకటయ్య, చెల్లం జంగయ్య, ప్రధాన కార్యదర్శి- బత్తుల పెద్దిరాజు, సహాయ కార్యదర్శి- చెల్లం ముత్యాలు, కార్యదర్శి చెల్లం పెద్దిరాజు, కోశాధికారి చెల్లం పెద్ద యాదయ్య, కార్యనిర్వాహణాధికారి వడ్డేమోని యాదయ్య లను ఎన్నుకున్నారు.
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీ పరిధిలోని జల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన, ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ప్రారంభించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.
HYD: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
నల్గొండ జిల్లా:
నల్లగొండలో ఆదివారం బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. రాచూరి వెంకటసాయి గత సంవత్సరం 2సార్లు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా సారధ్య బాధ్యతలు వహించడం జరిగిందని తెలిపారు.
నల్లగొండ జిల్లా:
Dec 03 2024, 17:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.4k