నేటి రాశి ఫలాలు నవంబర్ 12, 2024
ఓం గం గణపతయే నమః
ఓం గురుభ్యోనమః
ఓం నమో నారాయణాయ
నేటి రాశి ఫలాలు
నవంబర్ 12, 2024
మేషం
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్యహృదయం చదవడం మంచిది.
వృషభం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపించాలి.
మిధునం
కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
కర్కాటకం
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
సింహం
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
కన్య
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభప్రదం.
వృశ్చికం
చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీ రామ నామాన్ని జపించడం శుభప్రదం.
ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. చతుర్ధంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త. ఇష్టదైవ నామాన్ని జపించాలి.
మకరం
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శనిధ్యానం శుభదాయకం.
కుంభం
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో అప్రస్తుతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం శుభకరం.
మీనం
జన్మరాశిలో చంద్రసంచారం అనుకూలిస్తోంది. ఒక విషయంలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించిన పనిలో మంచి ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభదాయకం.
Dec 02 2024, 07:43