విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని లేనిచో విద్యుత్ గ్రీవెన్స్ రెడ్రేసెల్ ఫోరం లో పిర్యాదు చేస్తామని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్యాలయం లో "విద్యుత్ వినియోగదారుల దినోత్సవం" సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తాను స్థానికంగా అందుబాటు లో లేని కారణంగా పలు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆన్ లైన్ ద్వారా డి ఈ కి వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. భువనగిరి డి ఈ కార్యాలయం లో ఫ్యూజ్ ఆఫ్ కాల్ రిజిష్టర్ ను, సంబంధిత అధికారి పోన్ నెంబర్ నూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారుల సేవా కేంద్రం లో సేవల వివరాలు, గృహ అవసరాలకు, కమర్షియల్ అవసరాలకు మీటర్ల డీడీ అమౌంట్, డీడీ ఎవరి పేరుమీద తీయాలి అనే వివరాలను పొందుపరచాలని ఆయన కోరారు. రూరల్ ఏఈ, పట్టణ ఏఈ కార్యాలయాలు , డీఈ కార్యాలయం పేర్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కొందరు విద్యుత్ అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని , సమయపాలన కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యుత్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ సేవలు అందిస్తున్నారని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కొందరు విద్యుత్ అధికారులు , బినామీ పేర్లతో కాంట్రాక్టర్ గా చెలామణి అవుతూ, విధులు పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని వాటిపై సమగ్ర విచారణ జరిపి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Nov 06 2024, 16:57