/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు Vijay.S
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని లేనిచో విద్యుత్ గ్రీవెన్స్ రెడ్రేసెల్ ఫోరం లో పిర్యాదు చేస్తామని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్యాలయం లో "విద్యుత్ వినియోగదారుల దినోత్సవం" సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తాను స్థానికంగా అందుబాటు లో లేని కారణంగా పలు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆన్ లైన్ ద్వారా డి ఈ కి వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. భువనగిరి డి ఈ కార్యాలయం లో ఫ్యూజ్ ఆఫ్ కాల్ రిజిష్టర్ ను, సంబంధిత అధికారి పోన్ నెంబర్ నూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారుల సేవా కేంద్రం లో సేవల వివరాలు, గృహ అవసరాలకు, కమర్షియల్ అవసరాలకు మీటర్ల డీడీ అమౌంట్, డీడీ ఎవరి పేరుమీద తీయాలి అనే వివరాలను పొందుపరచాలని ఆయన కోరారు. రూరల్ ఏఈ, పట్టణ ఏఈ కార్యాలయాలు , డీఈ కార్యాలయం పేర్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కొందరు విద్యుత్ అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని , సమయపాలన కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యుత్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ సేవలు అందిస్తున్నారని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల కొందరు విద్యుత్ అధికారులు , బినామీ పేర్లతో కాంట్రాక్టర్ గా చెలామణి అవుతూ, విధులు పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని వాటిపై సమగ్ర విచారణ జరిపి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కొండూరు భాస్కర్ సౌజన్యంతో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లో ఇటీవల అనారోగ్యం తో గ్రామ పంచాయితీ సిబ్బంది పల్లెర్ల యాదయ్య మరణించినారు . ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని కొండూరు భాస్కర్ పరామర్శించి , కొండూరు భాస్కర్ సౌజన్యం తో 5000 రూపాయలను ఆర్థిక సాయం అంద జేశారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల రాజు, కాసుల వెంకన్న, పల్లెర్ల సుధాకర్,కొండూరు సాయి, పల్లెర్ల పెంటయ్య, నాగరాజు, మచ్ఛగిరి,స్వామి, పడిగే0 లింగుస్వామి, పల్లెర్ల క్రిష్ణ, సహదేవ్ తదితరాలు పాల్గొన్నారు.

చదువుల తల్లి ఎండి సానియా కి రూ. 82వేలు ఆర్థిక సహాయం అందించిన అంబేద్కర్ సొసైటీ శోభనాద్రిపురం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పరిధిలోని శోభనాద్రి పురం గ్రామానికి చెందిన ఎండి సానియా నీట్ 2024 మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు పొందిన పేద విద్యార్థిని చదువు ఆటంకం కలగకుండా తన తండ్రి జహంగీర్ దాతలను ఆర్థిక సహాయం కోరారు. అంబేద్కర్ సొసైటీ శోభనాద్రిపురం ఆధ్వర్యంలో సానియా చదువులకు ఇబ్బంది కలగకుండా రూ.82,000 ఆర్థిక సహాయం సొసైటీ నుంచి అందించారు. సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో చదువులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన తాము అండగా ఉంటామని అన్నారు . గ్రామంలో ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇబ్బంది పడితే వారికి తప్పకుండా అంబేద్కర్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయం చేస్తామని తెలిపారు .ఆర్థిక సహకారం అందించి వారు కంచి ముత్తయ్య మాజీ అడిషనల్ డీజీపీ రూ.5000 కంచి మల్లేశం మాజీ ఆర్టీసీ డ్రైవర్ రూ.3000, కంచి రమేష్ సివిల్ ఇంజనీర్ రూ .8000,కంచి నరసింహ మాజీ సిజిఎం రూ .20,000 కంచి బాలస్వామి టీచర్ రూ.5000 కంచి దశరథ హెచ్ఎం ₹1000 కంచి రామలింగం రూ .500 కంచి మధుసూదన్ రూ.5000 కంచి సత్తయ్య ప్రైవేట్ టీచర్ రూ.2000 కంచి సుమన్ సిఐ రూ .20,000 డాక్టర్ కంచి రాజేంద్రప్రసాద్ ప్రొఫెసర్ రూ .2500 డాక్టర్ ఝాన్సీ డిప్యూటీ సివిల్ సర్జన్ రూ 10,000 మొత్తం 82,000 ఆర్థిక సహాయం అందించారు.
AISF పోరాట ఫలితమే మెస్ కాస్మోటిక్ చార్జీల పెంపు

యాదాద్రి భువనగిరి జిల్లా: గత 14 ఏళ్లగా అర్ధా ఆకలితో అలమటిస్తూ అరకోర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్న వసతి గృహాల విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఫలితంగానే మెస్ ఫాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ప్రభుత్వం పెంచడం అభినందనీయమన్నారు. AISF ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 3 నుంచి7, వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 950 నుంచి 1330, 8,నుంచి 10 పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 1100నుంచి 1540, ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు విద్యార్థిని విద్యార్థులకు 1500 నుంచి 2100 వరకు దీనితోపాటు కాస్మోటిక్ చార్జీలు 3,నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకు 55 నుండి 175 వరకు 8,నుండి 10వ తరగతి విద్యార్థులకు 75 నుండి 275 వరకు 3,నుంచి 7 తరగతి విద్యార్థులకు 62 నుండి 150 వరకు 8,నుండి 10 వరకు 62 నుండి 200 వరకు పెంపుదల చేయడం జరిగిందని ఇది ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు తక్షణమే దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు వసతి గృహాల భవనాలకు మరమ్మతులు చేయించి కిటికీలు తలుపులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న డైట్ బిల్లులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుట్టునున్నట్లు. ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వస్టుపుల అభిలాష్ ఉపాధ్యక్షులు సూరారం జానీ ,సుమన్ భను ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు..
నవంబర్ 3న మిర్యాలగూడలో జరిగే బీసీ గర్జన ను జయప్రదం చేయండి: చిల్లర స్వామి యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో గురువారం బిసి మండల నాయకులు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి యాదవ్ మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీన మిర్యాలగూడలో నిర్వహించే బీసీ గర్జన ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1947 దేశానికి స్వాతంత్రం వస్తే 1993 మండల్ కమిషన్ అమలు చేసే వరకు దాదాపు నాలుగు దశబ్దాలు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. రాజకీయ రంగంలో నేటికి లేదు .మండల్ అమలుతో వచ్చిన ఇరువై ఏడు శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ రంగాలలో మాత్రమే ఇది కూడా అరకొరగా అమలవుతుందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు తెచ్చి ఉన్న కొద్ది అవకాశాలు గండి కొట్టారని అన్నారు. ఈ మహాసభలో తమ్మడబోయిన అర్జున్ కోకన్వీనర్ బీసీ జాతీయ చైతన్య వేదిక, సూరజ్ యాదవ్ మండల్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ,ఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ,దేశ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వైస్ చైర్మన్ ఎల్లంకి స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వలిగొండ పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం కేర్చుపల్లి, వర్కట్ పల్లి, సుంకిశాల, దాసిరెడ్డిగూడెం, ఎద్దుల్ల గూడెం చైతన్యపురి గ్రామాలలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ ఎల్లంకి స్వామి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కొమురెల్లి సంజీవరెడ్డి, నానచర్ల శ్రీనివాస్, సి ఓ బోనగిరి ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డు రావడం గర్వకారణం: తోటకూర యాదయ్య ప్రిన్సిపల్

భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కు మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ అవార్డు రావడం యాదాద్రి భువనగిరి జిల్లా కే గర్వకారణమని శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య అన్నారు. బుధవారం పాఠశాల ప్రార్థనా సమయంలో జాతీయ అవార్డు గ్రహీత కొడారి వెంకటేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యాదయ్య మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా సమాజంలోని రుగ్మతల నివారణకు కృషి చేస్తున్న కొడారి వెంకటేష్ కు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు , గుర్తింపులు రావాలని కోరారు. ముఖ్యంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాల్య వివాహాల నిర్మూలనకు, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడం కోసం వెంకటేష్ చేస్తున్న కృషి చాలా గొప్పదని ఆయన అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ కరస్పాండెంట్ తోటకూర కృష్ణ, ఉపాధ్యాయులు రవీందర్ , షఫీ , జోసఫ్, సురేందర్, కళ్యాణి, భవ్య , మౌనిక, ప్రమీల ,సరిత, కనక లక్ష్మీ, ఇంద్రయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత కొడారి వెంకటేష్ కు ఘన సన్మానం

యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత కొడారి వెంకటేష్ ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్ శాలువాతో కొడారి ని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా, సామాజిక ఉద్యమ నాయకులుగా కొడారి వెంకటేష్ చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు రావడం యాదాద్రి భువనగిరి జిల్లా కే గర్వకారణమని అన్నారు. కొడారి వెంకటేష్ ప్రజాస్వామ్య పద్దతిలో అన్యాయాన్ని ఎదురిస్తూ, ప్రశ్నించే తత్వాన్ని కలిగిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ కొడారి వెంకటేష్ కు సంపూర్ణ సహకారం అందిస్తాయని ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ నాయకులు రాసాల సాయికుమార్, మహేష్, సంతోష్ , శ్రీకాంత్, సంపత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన బద్దం రాజలింగం పెద్ద కుమారుడికి బద్దం అయ్యప్ప కి, దసరా పండుగ ముందు ఆక్సిడెంట్ జరిగింది. కాలుకు సర్జరీ చేశారు  సమాచారం తెలిసిన వెంటనే AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రూ.5000 వేలు ఆర్థిక సహాయం   అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఏజేఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి; సంగిశెట్టి క్రిస్టఫర్ తెలంగాణ మలి దశ ఉద్యమకారులు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులకు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారులు. సంగిశెట్టి క్రిస్టఫర్.. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల లక్ష్యం సంక్షేమ బోర్డే అని వారన్నారు ఉద్యమకారులు ఎన్ని సంఘాలు ఉన్నా అందరి లక్ష్యం ఉద్యమకారుల సంక్షేమం ఆత్మగౌరం కోసమే అని వారు అన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారాలని వారన్నారు ఇప్పటికే అనేకమంది ఉద్యమకారులు నష్టపోయి రోడ్డున పడ్డారని అనేకమంది చనిపోయారని మరికొంతమంది నష్టపోక ముందే వెంటనే ఉద్యమకాలకు ఇచ్చిన 25 వేల రూపాయల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జేరుపోతుల కరుణాకర్. ఈతప మల్లేశం. ఎదురుగట్ల రాములు. గంగ దారి సత్తయ్య. పబ్బు లక్ష్మయ్య. మంటి లింగయ్య. మంటి శంకర్. జోగు యాదయ్య. బోయ మహేష్. రుద్రవరం గణేష్. తదితరులు పాల్గొన్నారు