మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డుతో బాధ్యత పెరిగింది : కొడారి వెంకటేష్
మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ అవార్డు గ్రహీత మూడు దశాబ్దాలుగా సమాజంలోని సామాజిక రుగ్మతల నిర్మూలనకు, పిల్లల హక్కుల రక్షణ, నాణ్యమైన విద్య కోసం, మహిళలకు, వికలాంగులకు, వయోవృద్ధులకు మనోధైర్యం కలిగిస్తూ, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు "మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ అవార్డు" రావడం ఎంతో ఆనందంగా ఉందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబుల్లాఖాన్ హాల్లో "బహుజన సాహిత్య అకాడమీ" తెలంగాణ రాష్ట్ర ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సినీ గేయ రచయిత, మౌనశ్రీ మల్లిక్ చేతులమీదుగా "మహాత్మా జ్యోతిభా పూలే జాతీయ పురస్కారం" అందుకున్న కొడారి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. సామాజిక విప్లవకారుడు "మహాత్మా జ్యోతిరావు పూలే " ఆలోచనలు ఆశయాల కోసం పనిచేస్తున్న తనకు మహాత్మా జ్యోతిరావు ఫూలే జాతీయ అవార్డు రావడం తో సామాజిక బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. నేడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినా, ఆదునిక సమాజంలో బాణామతి, చేతబడి లాంటి మూఢనమ్మకాలు ఉండడం విచారకరమని ఆయన అన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన కోసం చట్టం రావాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారుల సంఘం బాద్యునిగా నిత్యం దోపిడీకి, కల్తీకి గురవుతున్న వినియోగదారులను చైతన్యం చేస్తున్నాని ఆయన తెలిపారు. యువతీయువకుల కోసం స్వయం ఉపాధి అవకాశాలపై వారికి అవగాహన కల్పిస్తూ, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఫదకాల పై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలకు, వికలాంగులకు, వయోవృద్ధులకు అండగా ఉంటూ వారి హక్కుల రక్షణ కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దళిత బహుజనుల హక్కుల పరిరక్షణ కోసం , వారి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ప్రపంచ మేథావి,భారత రాజ్యాంగ నిర్మాత , రిజర్వ్ బ్యాంక్ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్ల పై ముద్రించాలనే ఉద్యమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన సామాజిక సేవలను గుర్తించిన "బహుజన సాహిత్య అకాడమీ" జాతీయ కమిటీ చైర్మన్ నల్లా రాదాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. సుబ్రహ్మణ్యన్, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు ఎన్.డి వెంకాయమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు ఎన. ఫణి కుమార్ అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కమిటీ సభ్యులకు మరియు జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ మహ్మద్ షానూర్ బాబా, సభ్యులు మైలారం జంగయ్య, ననుబాల మల్లయ్య యాదవ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Nov 03 2024, 08:33