శారాజీపేట లో ప్రతిఘటన ఉద్యమంలో అమరుడైన దూడల వెంకన్న 35వ వర్ధంతి
ప్రతిఘటనోద్యమంలో అమరుడైన వీరుడు దూడల వెంకన్న 35వ వర్ధంతి సందర్భంగా శారాజిపేటలో పార్టీ శ్రేణుల నివాళులు* భూమి, భుక్తి, దోపిడీ నుండి విముక్తి కోసం ప్రతిఘటన పంథాలో పోరాడుతూ అరాచక శక్తులచే హత్య చేయబడ్డ దూడల వెంకన్న 35వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమరులు దూడల వెంకన్న, అయిల వీరస్వామి, గిరి దేవందర్, ఉప్పు నర్సింహలకు శారాజిపేటలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జండాను గ్రామ కార్యదర్శి అయిల యాకయ్య ఆవిష్కరించిన అనంతరం రెండు న్యూడెమోక్రసీల డివిజన్ కార్యదర్శులు ఇక్కిరి సహదేవ్, బేజాడి కుమార్ లు మాట్లాడుతూ పేద ప్రజల శ్రమను దోచుకుంటున్న దోపిడీ దారులకు ఎదురు నిలిచి కట్ట నర్సింహరెడ్డి స్పూర్తితో ప్రతిగటనోద్యమంలో పోరాడి, యువకులను కూడగట్టి ప్రగతిశీల బాటలో నడుపుతూ ఈ సమాజ మార్పు కోసం పోరాడిన వీరుడు దూడల వెంకన్న అనీ,రాజ్యం నిర్బందాలను, శత్రువు దాడులను దైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలే జీవితంగా బతికాడనీ, కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమని తన ప్రాణాలను వదులుకున్నాడని, పేద ప్రజల జీవితాల మార్పు కోసం అయిల వీరస్వామి, గిరి దేవందర్ లు సైతం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని, ఆ వీరులకు నివాళులు అర్పించడం అంటే, వారు కోరుకున్న సమాజం కోసం పోరాడడమే అనీ, విప్లవ శక్తులు ఐక్యమయ్యి ఒకతాటి పైకి రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ. కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.సీత, కొమురయ్య, వీరమల్లు, తమ్మడి అంజయ్య, ఎలగందుల సిద్ధులు,నెమిలే స్వామి, వంగల నర్సింహ రెడ్డి,ఆర్.ఉదయ్, గాజుల వెంకటేష్, శ్రీను, బుర్ర మల్లయ్య, కాన్రాజు రమేష్,మధు సూధన్, రాజిరెడ్డి, అంజయ్య, రాం చందర్ తదితరులు పాల్గొన్నారు.
Oct 29 2024, 18:46