/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz నేటి రాశిఫలాలు అక్టోబర్ 26,2024 శనివారం TS breaking
నేటి రాశిఫలాలు అక్టోబర్ 26,2024 శనివారం

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాదిక్యాతతో దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

వృషభం

ప్రయాణాలలొ మార్గావరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచనాలు కలుగతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం

దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం

ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మండకొడిగా సాగుతాయి.

సింహం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.

కన్య

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. 

ధనస్సు

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

మకరం

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

మీనం

నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.

నేటి పంచాంగము అక్టోబర్ 26,2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః 

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ 

పక్షం: కృష్ణ - బహుళ 

తిథి:‌ నవమి ఉ‌.06:48 వరకు

తదుపరి దశమి

 

వారం: శనివారం - మందవాసరే 

 

నక్షత్రం: ఆశ్లేష ప‌.01:42 వరకు

తదుపరి మఖ

యోగం: శుక్ల రా.తె.03:58 వరకు

తదుపరి బ్రహ్మ 

కరణం: గరజ ఉ‌.06:48 వరకు

తదుపరి వణిజ రా.07:24 వరకు

తదుపరి భధ్ర 

వర్జ్యం: రా.02:31 - 04:13 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:12 - 07:40

రాహు కాలం: ఉ‌.09:06 - 10:33

గుళిక కాలం: ఉ‌.06:12 - 07:39

యమ గండం: ప‌.01:26 - 02:53

 

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:12

సూర్యాస్తమయం: 05:47

చంద్రోదయం: రా.01:07

చంద్రాస్తమయం: ప‌.02:14

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కర్కాటకం

దిశ శూల: తూర్పు

వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసలపై కేసు... పోస్టాఫీసుకు భారీ జరిమానా... ఎంతంటే...

చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసల వివాదానికి సంబంధించి ఒక కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టమర్‌కు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు రూ. 15,000 జరిమానా విధించబడింది. డిసెంబర్ 3, 2023న రిజిస్టర్డ్ లెటర్‌ను పంపించడానికి వచ్చిన పొలిచలూరు పోస్టాఫీసుకు గెరుగంబాక్కం నివాసి మనషా వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజిస్టర్డ్ లెటర్‌ సంబంధించి మొత్తం రూ. 29.50 కాగా మనషా కౌంటర్‌లో రూ. 30 చెల్లించాడని.. అతనికి 50 పైసలు కస్టమర్ కి రావాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. అయితే, పోస్టాఫీసుకు చెందిన సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫీజును రూ.30కి పూర్తి చేసిందని తెలిపింది. ఈ విషయంలో మిగిలిన మొత్తం తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, సాంకేతిక సమస్యల కారణంగా యాభై పైసలు ఇవ్వడానికి పోస్టాఫీసు నిరాకరించింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనషా.. ఇండియా పోస్ట్ రోజువారీ లావాదేవీల వల్ల గణనీయమైన మొత్తంలో డబ్బు స్వాహా చేయబడుతుందని.. దాని ఫలితంగా నల్లధనం, GST రాబడి కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాలను స్థిరంగా “విస్మరించారని” పోస్ట్ ఆఫీస్ పేర్కొంది. అటువంటి మొత్తాన్ని సమీప రూపాయికి పూర్తి చేయడానికి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ చేయబడిందని పేర్కొంది.

యూపీఐ చెల్లింపుల కోసం వారి “Pay U” QR కోడ్ సిస్టమ్ నవంబర్ 2023 నుండి తప్పుగా పని చేసిందని, మే 2024లో నిలిపివేయబడిందని పోస్ట్ ఆఫీస్ వివరించింది. ఈ కేసును సమీక్షించిన తర్వాత, సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అధిక ఛార్జీ విధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం.. రూ. 15,000 జరిమానా విధించాలని కోర్ట్ ఆదేశించింది.

Sangareddy: కస్తూర్బా గురుకులంలో 11 మంది విద్యార్థినిలకు అస్వస్థత..

సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. శ్వాసకోస సమస్యలతో విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

 గురుకుల సిబ్బంది విద్యార్థినులను జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో 11 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. గురుకులంలో ఏం జరిగిందనే కోణంలో గురుకుల సిబ్బంది ఆరా తీస్తున్నారు.

 విద్యార్థులను పరిశీలించిన వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో వున్నారని తెలిపారు. తీవ్ర అస్వస్థలకు గురి కావడానికి కారణాలను తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు అస్వస్థకు గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు అస్వస్థలకు గల కారణం పూర్తి యాజమాన్యమే అంటూ ఆందోళన చేపట్టారు. ఉదయం జరిగితే ఇప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. గురుకుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు శ్వాస కూడా తీసుకోలేక పోతున్నారని కన్నీరుపెట్టుకున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

BRS లో మొదలైన CM అభ్యర్థిపై చర్చ...

గత కొద్ది రోజులుగా కేటీఆర్ తెలంగాణ భవన్లో వచ్చిన ప్రతిసారి అక్కడున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కేటీఆర్ సీఎం, సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 9 ఏళ్లపాటు పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఆయనే అధ్యక్షుడు.. చాలా మీడియా సమావేశంలో కూడా తానే తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా ఉంది బీఆర్ఎస్.. ఈ కీలక సమయంలో కేటీఆర్ సీఎం అంటూ వినిపిస్తున్న నినాదాలు దేనికి సంకేతం అని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కేటీఆర్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించనున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ కాక మరో నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ కానీ, ప్రజలు కాని సమ్మతించే అవకాశం ఉందా.. ఇలా రకరకాలుగా పార్టీ నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక దీంతోపాటు పార్టీలో మరో కీలక నేతగా ఉన్న హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉంటారని గుసగుసలు నడుస్తున్నాయి. పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడ్డ హరీష్ రావును కూడా కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారనేది హరీష్ అనుచరులు ఆశిస్తున్నారు. పార్టీలో ఏ విషయమైనా స్వయంగా కేసీఆర్ మాత్రమే ప్రకటిస్తారు. అలాంటిది ఇప్పటివరకు ఈ విషయంపై ఆయన స్పందించలేదు.

అయితే ఈ కొత్తగా వినిపిస్తున్న నినాదాలు కేవలం వచ్చిన యువ కార్యకర్తల అభిమానం మాత్రమేనని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ తప్పుకుంటే.. జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి సారిస్తారా? లేక పూర్తిగా రాజకీయాలనుంచి రిటైర్ అయిపోతారా? అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి. గత ఏడాదికాలంగా కేసీఆర్ పూర్తిగా సైలెంట్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో తప్పా ఎక్కడ కనిపించలేదు. పార్టీ యాక్టివిటీస్ అన్ని ఫామ్ హౌస్ నుంచే చూస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన సమావేశాలు ఉన్న ఫామ్ హౌస్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే కేసిఆర్ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని.. ప్రభుత్వాన్ని నిలదీసి ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని బీఆర్‌ఎస్ పార్టీ చెబుతుంది.

Hyd : కోకాపేట్ లో 7 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... వివరాల్లోకి వెళ్ళితే....

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌ లోని కోకాపేట్ లో చోటు చేసుకుంది.

7 అంతస్తుల భవనం పై నుండి కిందికి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తరునంలోనే.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు….మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలి లోని ఓ కంపనీ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.

 అయితే… కోకాపేట్ లో హాస్టల్ గదికి వచ్చి తనువు చాలించాడు నాగ ప్రభాకర్. నాగ ప్రభాకర్ ఆత్మహత్య కు గల కారణాలను తెలుసుకుంటున్నారు పోలీసులు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. కోకాపేట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగ ప్రభాకర్ ఆత్మహత్య ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

TG : ఈ రోజు భద్రాద్రిలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈ రోజు ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో పర్యటించనున్నారు.

 భద్రాచలంలోని సీతారామ చంద్ర దేవస్థానాన్ని సందర్శించి ఆలయంంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

 అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కవులు, కళాకారులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

"ఆదిలాబాద్: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి కార్నర్ సమీపంలో ఇవాళ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమదాంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురు గాయపడగా.. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రక్త సంబంధికులు నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లా్రు."

బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం

ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా..

రాష్ట్రంలోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతల్లోె జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్న హైడ్రా (HYDRA) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ (HYDRA Chief Ranganath) సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. బ్యాంకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది. లీగల్ టీంను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేశారు. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థల జాబితాను ఇప్పటికే హైడ్రా సిద్ధం చేసింది. చెరువుల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా రుణాలు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు.

జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టిన హైడ్రా బ్రేకుల్లేండా దూసుకెళ్తోంది. హైడ్రాకు ప్రభుత్వం కూడా హైపవర్స్‌ ఇచ్చేసింది. ఇప్పటి వరకు దాదాపు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఆక్రమణకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించగా.. వెంటనే హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి కూల్చివేతలు చేస్తున్నాయి. హై రీచ్ జా క్రషర్స్‌తో పాటు జేసీబీలతో, బుల్డోజర్ల తో కూల్చివేతలు సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు జీహెచ్‌ఎంసీ ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు కొనసాగింది.

ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.

అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు17 గంటలపాటు హైడ్రా నాన్ స్టాప్ కూల్చివేతలు చేపట్టింది. ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలను కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు ఆనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సుమారు 17 గంటల పాటు హైరిస్క్ ఆపరేషన్‌ను హైడ్రా కొనసాగించింది.

ల్యాబ్ టెక్నీషియన్ లకు గుడ్ న్యూస్ ‼️

- 2,030 మంది స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి పది రోజుల్లో..

- ఈ నెలాఖరుకల్లా ఫార్మాసిస్టుల సెలక్షన్‌కు కూడా..

- మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖలో 4వేల పోస్టులకు నోటిఫికేషన్లు

- జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు

- 1,280 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

వైద్య ఆరోగ్యశాఖలో 1,280 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

2,030 మంది స్టాఫ్‌ నర్సుల భర్తీకి పదిరోజుల్లోపే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపాయి.

వీటితో పాటు మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి ఈ నెలాఖరుకల్లా మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 4వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం లభించింది. కాగా, వైద్యశాఖలోని స్టాఫ్‌నర్స్‌లు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు సెప్టెంబరులో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్‌ క్యాలండర్‌లోనే ప్రకటించింది.