విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే ఉద్యమాలను ఉదృతం చేస్తాం : PDSU రాష్ట్ర కార్యదర్శిలు శ్రీకాంత్ ,నాగరాజు
రాష్టంలో ఉన్న విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యూ. రెండు రాష్ట్ర కమిటీల ప్రధాన కార్యదర్శులు ఎస్.వి. శ్రీకాంత్, నాగరాజులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలేరు బస్టాండ్ నుండి దినేష్ గార్డెన్స్ వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ తీసి, అనంతరం పి.డి.ఎస్.యూ.జిల్లా అధ్యక్షులు ఆర్.ఉదయ్, మామిడాల ప్రవీణ్ ల అధ్యక్షతన అర్థ శతాబ్దోత్సవపు సభ నిర్వహించారు . ఈ సందర్భంగా శ్రీకాంత్, నాగరాజులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. జంపాల చంద్రశేఖర ప్రసాద్, రంగవల్లి, మారోజు వీరన్న, కొలనుపాక ప్రాంతానికి చెందిన కోలా శంకర్ లాంటి ఎందరో అమరవీరుల త్యాగాలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతూ, ఎన్నో అక్రమ నిర్బందాలను కేసులను భరిస్తూ ప్రభుత్వాలను ఎదురిస్తూ విద్యార్థులకు అండగా నిలిచిందనీ, సొంత రాష్టం తెచ్చుకున్నా విద్యార్థుల జీవితాలు మాత్రం మారలేదని, 10ఏళ్ల బి.ఆర్.ఎస్. ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తే, మేం న్యాయం చేస్తాం, విద్యార్థుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10నెలలు గడుస్తున్నా విద్యార్థులను పట్టిచ్చుకోవడం లేదనీ, 6నెలలుగా గురుకుల హాస్టల్ అద్దె బకాయిలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు హాస్టళ్లకు తాళాలు వేస్తే విద్యార్థులను రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని, 3ఏళ్లుగా ఇంటర్ విద్యార్థులకు, 4ఏళ్లుగా డిగ్రీ విద్యార్థులకు ఫీ-రీఎంబెర్స్ మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాలు సమ్మెకు దిగాయని, స్కాలర్ షిప్పులు రాక యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బడ్జెట్లో విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని పి.డి.ఎస్.యూ. గా డిమాండ్ చేసినా కేవలం 7శాతం కేటాయించి, విద్యార్థులకు అన్యాయం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ కార్పొరేట్ స్కూళ్లకి కొమ్ముకాస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలనీ, శ్రీ చైతన్యా నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థల ఫీజుల నియంత్రణకై చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా రంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 24న ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర స్థాయి అర్థ శతాబ్దోత్సవ సభకు జిల్లా నుండి పూర్వ ప్రస్తుత విద్యార్థులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు ఆర్.జనార్దన్, ఎం.భిక్షపతి,పూర్వ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ , సహదేవ్, తొలితరం పి.డి.ఎస్.యూ. నాయకులు పూల నాగయ్య, కడకంచి కిష్టయ్య, మంద సోమరాజు, గడ్డం సిద్ధులు, ప్రజా సంఘాల నాయకులు ఇక్కిరి శ్రీనివాస్, ఇ. కుమార్, పడాల శివ, కుమారస్వామి, బాలకృష్ణ, ఎం.మహేష్, ఆకుల కృష్ణ, మురళి, పరమేష్, ఇక్కిరి బీరయ్య, స్వేచ్ఛ, మధు, బర్మా బాబు, సిద్ధులు, సిహెచ్ రాజయ్య, నేరేడు స్వామి, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
Oct 18 2024, 18:17