PDSU 50 ఏళ్ల ఉత్సవాలను జయప్రదం చేయండి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18న ఆలేరులో , 24న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సభలను ప్రస్తుత,పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ. పూర్వ జిల్లా అధ్యక్షు,కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 18న ఆలేరులోని దినేష్ గార్డెన్స్లో జరిగే పి.డి.ఎస్.యూ. అర్థ శతాబ్దోత్సవ సభను జయప్రదం చేయాలని ఆలేరు పట్టణంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాగరాజు, కుమార్ లు మాట్లాడుతూ ఉస్మానియాలో 1972లో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. గత 50ఏళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ, విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపుకోసం, స్కాలర్ షిప్పుల విడుదల కోసం, ఆలేరులో ఐ.టి.ఐ. కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని, తెలంగాణ ఉద్యమంలో పి.డి.ఎస్.యూ. ముఖ్య పాత్ర పోషించిందనీ, ఆ పోరాటాల్లో ఎన్నో అక్రమ కేసులను, నిర్బందాలను అనుభవించిందని, కోలా శంకర్ లాంటి నాయకులు తన విలువైన ప్రాణాలు సైతం అర్పించారనీ, తన 50ఏళ్ల చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ నెల 18న ఆలేరులో జిల్లా సభ, 24న ఓయూలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నామనీ, ఈ సభకు ప్రస్తుత పూర్వ విద్యార్థులు , మేధావులు హాజరై ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ. నాయకులు ఆర్.ఉదయ్, ప్రవీణ్, ఇ. శ్రీనివాస్, ఇ. కుమార్, బాలకృష్ణ, ఆకుల కృష్ణ, మహేష్, కుమారస్వామి, మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.
Oct 16 2024, 14:34