వినియోగదారులకు నాణ్యత ప్రమాణాలు ముఖ్యమే: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు
ఏదైనా వస్తువు కొనాలంటే దాని యొక్క నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా వినియోగదారుడు గమనించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు . సోమవారం "ప్రపంచ నాణ్యతా ప్రమాణాల దినోత్సవం" సందర్భంగా ఆయన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మన దేశంలో ఐ.ఎస్.ఐ మార్క్ (ISI Mark ), బి.ఐ.ఎస్ మార్క్ (BIS Mark), ఆగ్ మార్క్ (AG Mark), ఎఫ్ పి ఓ మార్క్ (FPO Mark) లాంటి ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో వస్తువుల తయారీ మరియు నాణ్యతా ప్రమాణాలను ఆయన అన్నారు. ప్రతి వస్తువు యొక్క బాక్స్ లపై పై మార్కు లను చూసి కొనుగోలు చేయాలన్నారు. ప్రతి వినియోగదారుడు ఖర్చు పెట్టిన "డబ్భుకు తగిన నాణ్యమైన వస్తువులు పొందటం అనేది వినియోగదారుల హక్కు" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాల దినోత్సవం ను 1946 అక్టోబర్ 14 న ప్రారంభమై ప్రతి ఏటా జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్కెట్ లో కల్తీ, నకిలీ వస్తువుల తయారీ, రవాణా మరియు అమ్మకాలు పెరిగిపోయాయని , దీంతో అమాయక వినియోగదారులు ఆర్ధికంగా మరియు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు (1986, 2018) ఉన్నప్పటికీ, చాలా మందికి ఈ చట్టాలపై అవగాహన లేదని, ఒకవేళ వున్నా మనకు ఎందుకులే అని మౌనంగా ఉండిపోతున్నారని ఆయన అన్నారు. కొంతమంది వినియోగదారులు యూట్యూబ్ ల్లో వచ్చే వీడియోలు ఆధారంగా అమెజాన్ , ప్లిప్ కార్డ్ లాంటి ఆన్లైన్ సంస్థల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన మందులు, ఇతర సౌందర్య సాధనలను కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. వీటి లో ఎంత వరకు నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయో చెప్పలేమని, అందుకే నిపుణుల సలహాలు లేకుండా మందులు కొనకూడదని ఆయన సూచించారు . అదే విధంగా చర్మ సౌందర్య సాధానాల విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం, వస్తువుల నాణ్యతా ప్రమాణాల పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, నకిలీ వస్తువులు అమ్మే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారుల హక్కులను, పాలకులు చిత్తశుద్ధితో కాపాడాలని ఆయన కోరారు.
Oct 15 2024, 14:57