NLG: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ నల్లగొండ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా శాఖ కార్యాలయంలో జరిగిన టిఆర్టిఎఫ్ జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏకగ్రీవంగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ.. 80 సంవత్సరాల నుండి అనగా స్థాపించిన 1944 వ సంవత్సరం నుండి ఉపాధ్యాయుల శ్రేయస్సుకై మరియు సమస్యల పరిష్కారానికి పాటుపడిన సంఘం టిఆర్టిఎఫ్ అని అన్నారు.
టిఆర్టిఎఫ్ సంఘం భవిష్యత్తులోనూ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్ డీ ఏ లు, బిల్లులు మరియు మెరుగైన పీఆర్సీ ఇప్పించేందుకు కట్టుబడి ఉందని అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంఘానికి, ఉపాధ్యాయులకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించుట ద్వారా జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
TRTF జిల్లా అధ్యక్షులు నిమ్మనగోటి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ముప్పిడి మల్లయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తంతెనపల్లి సైదులు, రాష్ట్ర కార్యదర్శి బి.సూర్యనారాయణ, దొడ్డేని సాయిబాబు,జలంధర్ రెడ్డి, జానకిరెడ్డి, అర్రూరి జానయ్య, ఎల్.నగేష్, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
TRTF జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ కు ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య సెక్రటరీ జనరల్ ఎం.వీ. గోనారెడ్డి, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఓలి సమీర్ కుమార్, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు కొన్నె శంకర్ గౌడ్, వైద్యుల సత్యనారాయణ, దూదిగామ స్వామి, లక్ష్మయ్య, కృష్ణ, నర్సింహ, గుండెబోయిన జానయ్య, బాతుక శ్రీనివాస్, సోమనబోయిన లింగస్వామి, బెల్లి నాగరాజు, లక్ష్మీనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Oct 13 2024, 19:13