NLG: అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేయాలి: కంబాలపల్లి ఆనంద్
నల్లగొండ జిల్లా:
ప్రజా సమస్యలపై బలమైన ప్రజా ఉద్యమాలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు. పీఏ పల్లి మండలం, అజ్మాపురం సిపిఐ(ఎం) గ్రామశాఖ 7వ మహాసభ కామ్రేడ్ వాస్కుల సుందరయ్య ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ముందుగా వారు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన ప్రజల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన కోరారు.ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యకర్తలు ఉద్యమాలు చేపట్టాలన్నారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి ప్రజల సంపదను పెద్దలకు ధారాధత్వం చేస్తున్నారని ఆరోపించారు.కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను కొందరు చేతులలో పెట్టి పేద ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు.
దేశ సంపదను కాపాడడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టాలని ఆనంద్ కోరారు. మహాసభ అనంతరం గ్రామ శాఖ నూతన కమిటీ 11 మందితో ఎన్నుకోవడం జరిగింది. గ్రామ శాఖ కార్యదర్శిగా కంబాలపల్లి చిరంజీవి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు వాస్కుల నరేష్, రాజేష్, రామాంజులు, సతీష్, చంద్రయ్య, కృష్ణయ్య, కనకమ్మ, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.
Oct 13 2024, 17:37