/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేయాలి: కంబాలపల్లి ఆనంద్ Mane Praveen
NLG: అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేయాలి: కంబాలపల్లి ఆనంద్

నల్లగొండ జిల్లా:

ప్రజా సమస్యలపై బలమైన ప్రజా ఉద్యమాలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు. పీఏ పల్లి మండలం, అజ్మాపురం సిపిఐ(ఎం) గ్రామశాఖ 7వ మహాసభ కామ్రేడ్ వాస్కుల సుందరయ్య ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ముందుగా వారు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన ప్రజల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన కోరారు.ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యకర్తలు ఉద్యమాలు చేపట్టాలన్నారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి ప్రజల సంపదను పెద్దలకు ధారాధత్వం చేస్తున్నారని ఆరోపించారు.కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను కొందరు చేతులలో పెట్టి పేద ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు.

దేశ సంపదను కాపాడడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టాలని ఆనంద్ కోరారు. మహాసభ అనంతరం గ్రామ శాఖ నూతన కమిటీ 11 మందితో ఎన్నుకోవడం జరిగింది. గ్రామ శాఖ కార్యదర్శిగా కంబాలపల్లి చిరంజీవి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు వాస్కుల నరేష్, రాజేష్, రామాంజులు, సతీష్, చంద్రయ్య, కృష్ణయ్య, కనకమ్మ, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

TG: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈరోజు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా అష్ట ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రశాంత వాతావరణంలో పండగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నారు.
TG: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ  సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు.. దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సిఎం తెలిపారు.

దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

శమి పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభ సూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

దుర్గామాత దీవెనలతో తెలంగాణకు నిత్య విజయాలు కలిగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

NLG: 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్' నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, కల్వకుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, నేడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్' నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, ధనిక, కుల, మత భేదాలు లేకుండా నాణ్యమైన విద్యను అందించడమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉద్దేశం అని అన్నారు.

ఈ మేరకు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లకు స్కూలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
NLG: అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో గాంధీ సెంటర్ వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా,ఇవాళ 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శీను యాదవ్ హాజరై మాట్లాడుతూ.. అమ్మవారు ఆశీస్సులతో గ్రామ ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

లెంకలపల్లి మాజీ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
NLG: మర్రిగూడ మండలంలో ఎస్జీటీ టీచర్ ఉద్యోగం సాధించిన వారికి సన్మానం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
యరగండ్లపల్లి గ్రామంలో ఎస్జిటి టీచర్ ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు అందుకున్న ఆవంచల దర్శన్, బచ్చనగోని పుష్పలత లను, వారి తల్లిదండ్రులను ఇంటి వద్ద శుక్రవారం సామాజిక కార్యకర్త, యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు అభ్యర్థులు ఇటీవల ఎస్జిటి ఉద్యోగాలను సాధించి గ్రామానికి గొప్ప పేరు తెచ్చినందుకు అభినందిస్తున్నానని అన్నారు. దర్శన్, పుష్పలత లను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఉన్న మిగతా విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు వీధిలైట్లు ఏర్పాటు

నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, చర్లగూడెం ముప్పు గ్రామంలో వీధిలైట్లు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు.. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగినది. ఎమ్మెల్యే సూచనల మేరకు రవీందర్ రావు ఇవాళ చర్లగూడెం లో తక్షణమే వీధిలైట్లు ఫిట్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు వెన్నమనేని రవీందర్ రావు లకు ధన్యవాదములు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
యరగండ్లపల్లి: భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు.. అనంతరం అన్న ప్రసాదం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద గురువారం అమ్మవారు  దుర్గామాత అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త, యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్-విమల దంపతులు, దేవుని లక్ష్మయ్య యాదవ్-యాదమ్మ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పూజ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తదుపరి ఉత్సవ కమిటీ వారు అన్నదాత సంతోష్ యాదవ్ ను  ఘనంగా సన్మానించారు.
SAD: పిడుగుపాటు గురై ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
నల్లగొండ జిల్లా:
దామరచర్ల మండలం, వీర్లపాలెం గ్రామంలో గురువారం భారీ వర్షం కురిసింది. పిడుగుపాటు కు గురై ఒకరు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు
HYD: తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సంఘం నాయకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం ఉన్నారు.