BSP - లక్ష్యమే బహుజనుల రాజ్యాధికారం
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి.యస్.పి వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాన్షిరం గారి 18 వ వర్ధంతి కార్యక్రమాన్ని *జిల్లా అధ్యక్షులు బాసాని మహేందర్ గారి అధ్యక్షతన నిర్వహించారు.* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు : గౌ,,బొడ్డు కిరణ్ గారు (రాష్ట్ర కార్యదర్శి) గౌ,, నాయిని ప్రణయ్ గారు, ( రాష్ట్ర కోశాధికారి) విచ్చేసి ముందుగా బహుజన్ నాయక్ మాన్య శ్రీ కాన్షిరాం గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. వీరు మాట్లాడుతూ భారతదేశంలో బహుజనుల బతుకులు మార్చడం కొరకు ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మాన్య శ్రీ కాన్షీరామ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు చేసి బహుజనులలో చైతన్యం నింపి,మనువాద పార్టీలలో వణుకు పుట్టించి ఏనాడు అసెంబ్లీ,పార్లమెంట్ లో అడుగుపెట్టనటువంటి కులాలను ఐక్యం చేసి,అట్టి కులాలను ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కుమారి మాయావతి గారిని మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసి, అక్కడ ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించి,జాతీయ అతి పెద్ద మూడవ పార్టీగా నిలబెట్టడం జరిగింది. కావున జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కష్టపడి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వీరస్వామి గారు , జిల్లా కోశాధికారి సల్ల బిక్షపతిగారు, జిల్లా కార్యదర్శి కోరబోయిన పాండు గారు, బోనగిరి అసెంబ్లీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్ గారు, అసెంబ్లీ కోశాధికారి బండారు జహంగీర్ గారు, అసెంబ్లీ నాయకులు నర్సిరెడ్డి గారు,భువనగిరి బివిఎఫ్ కన్వీనర్ సిలివేరు మహేందర్ గారు, బీఎస్పీ నాయకులు ప్రవీణ్, సురేష్, శివ,వసంత్,ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. జై భీమ్.... బాసాని మహేందర్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ
Oct 11 2024, 19:58